newssting
BITING NEWS :
*గుజరాత్‌: సూరత్‌లో దారుణం.. కార్పొరేషన్ ట్రైనీ ఉద్యోగినులను గుంపులో నగ్నంగా నిలబెట్టి ఫిట్‌నెస్ పరీక్ష *నేడు తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల... ఈ నెల 25న డైరెక్టర్ పదవులకు నామినేషన్లు, 29న ఛైర్మన్, ఉపాధ్యక్ష ఎన్నికలు *అమరావతి: వైఎస్ జగన్‌ సర్కార్‌ మరో కీలక నిర్ణయం.. గత ప్రభుత్వ అక్రమాలపై విచారణకు సిట్ ఏర్పాటు.. ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామ్‌రెడ్డి నేతృత్వంలో 10 మంది సభ్యులతో సిట్ *హైదరాబాద్: బంజారాహిల్స్ లో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు.. విదేశీయుల హల్చల్, పోలీసులతో వాగ్వాదం.. పాస్ పోర్టు, వీసా పత్రాలు చూపకపోవడంతో పోలీసులకు అప్పగింత *అమరావతి: నేడు 29 గ్రామాల్లో బంద్‌కు పిలుపునిచ్చిన రైతుల జేఏసీ.. మందడంలో పోలీసుల లాఠీఛార్జ్‌కి నిరసనగా బంద్, విద్యా, వ్యాపార సంస్థలను బంద్‌ పాటించాలని కోరిన జేఏసీ

ఎన్నికలవేళ కాంగ్రెస్‌లో గ్రూపు తగాదాలా?

29-12-201929-12-2019 12:27:07 IST
Updated On 30-12-2019 12:39:46 ISTUpdated On 30-12-20192019-12-29T06:57:07.572Z29-12-2019 2019-12-29T06:57:00.561Z - 2019-12-30T07:09:46.730Z - 30-12-2019

ఎన్నికలవేళ కాంగ్రెస్‌లో గ్రూపు తగాదాలా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో మునిసిపల్ ఎన్నికలకు నగారా మ్రోగింది. ఇప్పటికే షెడ్యూల్ విడుదల కాగా ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదలకు సిద్ధమవుతున్నారు. అధికార తెరాస పార్టీ అభ్యర్థుల ఖరారుపై ఇప్పటికే సమావేశాలు నిర్వహిస్తూ జిల్లాల వారీగా సన్నాహక సమావేశాలను మొదలుపెట్టింది. బీజేపీ కూడా అభ్యర్థుల ఎంపికకు సిద్దమవుతుంది. మరి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? ఒకపక్క రాష్ట్రంలో రెండో అతిపెద్ద బలమైన పార్టీగా ఉన్నా ఎన్నికల వేళ కూడా కాంగ్రెస్ ఆధిపత్య పోరులో పోటీపడుతున్నట్లుగా తెలుస్తుంది.

కేంద్రంలో బీజేపీ తీసుకొచ్చిన పౌరసత్వ చట్టం ద్వారా కూడా ఎన్నికల వేళ లబ్ది పొందాలని అధికార తెరాస పార్టీ ప్రయత్నిస్తుంటే కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం ఒకరి మీద మరొకరు పెత్తనం చెలాయించే పనిలో బిజీగా ఉన్నారనిపిస్తుంది. తొలి నుండి కాంగ్రెస్ పార్టీ అంటే ఆధిపత్య పోరుకి పరాకాష్ట అన్న పేరుంది. అయితే అది పార్టీకి తీవ్ర నష్టాలే తెచ్చే వేళ.. ఎన్నికలలో చావో రేవో తేల్చుకొనే వేళ కూడా ఆ పోరుతోనే సెగ కాచుకోవాలని చూడడం ఇప్పుడే కనిపిస్తుంది.

సాధారణ ఎన్నికల అనంతరమే తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ముసలం మొదలైంది. ఇక హుజూర్ నగర్ ఉప ఎన్నికల అనంతరం ఇది పరాకాష్టకు చేరింది. టిపిసిసి చీఫ్ గా ఉన్న ఉత్తమ్ భార్య పద్మావతిని అభ్యర్థిగా ప్రకటించడంపై పార్టీలో ఓ వర్గం బహిరంగంగానే ఆక్షేపించింది. కానీ చివరికి ఆ వర్గానికి నాయకత్వంగా ఉన్న రేవంత్ రెడ్డి ఆ ఎన్నికలలో ప్రచారం చేసినా ఫలితం లేకపోయింది. చివరికి చీఫ్ స్థానంలో కూడా అభ్యర్థిని గెలిపించుకోలేని పార్టీగా మిగిలిపోయింది.

ఆ ఎన్నికల అనంతరం ఆ గ్రూపు తగాదాలు అలానే కొనసాగుతూనే ఉన్నట్లుగా ఇప్పుడు పరిస్థితిలు కనిపిస్తున్నాయి. ఇంకా సూటిగా చెప్పాలంటే 'రేవంత్ వర్సెస్ ఉత్తమ్-భట్టి'గా ఓ వార్ నడుస్తున్నట్లుగా గాంధీ భవన్ వర్గాలు కోడై కూస్తున్నాయి. హుజూర్ నగర్ ఎన్నికల అనంతరం పిసిసి చీఫ్ మార్పుపై పెద్ద కథనాలే వచ్చాయి. జగ్గారెడ్డి వాళ్ళు తమకి ఏం తక్కువ పిసిసి అధ్యక్షుడికి అంటూనే రేవంత్ అయినా అభ్యంతరాల్లేవని చెప్పారు.

తమకి జూనియర్ నేత రేవంత్ పోటీ అవుతున్నారనుకున్నారో లేక పోటీ లేకుండా చేయాలనుకున్నారో కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్కలు రేవంత్ కార్యక్రమాలకు మొహం చాటేశారు. ఉదాహరణకు రేవంత్ ఎంపీగా ఉన్న మల్కాజ్ గిరి ప్రాంతంలో పార్లమెంటరీ ఆఫీసును అట్టహాసంగా ప్రారంభించారు. ఆ కార్యక్రమానికి చాన్నాళ్ల క్రితమే ముహూర్తం ఖరారయింది. కానీ, చివరి నిమిషంలో భట్టితో పాటు కొంతమంది నేతలు అసిఫాబాద్‌లో సమత హత్యాచార కేసులో ఆమె కుటంబ సభ్యులను పరామర్శకు వెళ్లారు.

తాజాగా గాంధీ భవన్లో సీనియర్ నేతలు ఉత్తమ్, భట్టితో సహా కొందరు నేతలు తిరంగా ర్యాలీ కార్యక్రమాన్ని తలపెట్టారు. దీనికి రేవంత్ అండ్ కో దూరమైంది. ఇవి కేవలం ఉదాహరణలు మాత్రమే. ఒకపక్క సీఎం కెసిఆర్ సామజిక, ఆర్థిక, రాజకీయ, ప్రాంతాల వారీగా పార్టీని పరిగెట్టిస్తూ దూసుకెళ్తుంటే కాంగ్రెస్ నేతలు ఇలా కుమ్ములాటలతో అంటకాగడం విస్మయానికి గురి చేస్తుంది. ఒకపక్క మున్సిపల్స్.. మరోపక్క ఆధిపత్యపోరు.. ప్రజలు నమ్మేదెలా? నమ్మకం కలిగించేదెలా? ఈ నేతలకు అర్ధమయ్యేదెలా?!

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

   6 hours ago


‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

   7 hours ago


మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

   8 hours ago


బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

   9 hours ago


రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

   9 hours ago


రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

   10 hours ago


ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

   11 hours ago


మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

   12 hours ago


పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

   12 hours ago


కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

   13 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle