newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఎన్ఆర్ఐ పాలసీ.. ఎన్నికల వేళ సర్కార్ మరో ఆయుధం?

22-01-202022-01-2020 11:26:05 IST
Updated On 22-01-2020 11:31:51 ISTUpdated On 22-01-20202020-01-22T05:56:05.199Z22-01-2020 2020-01-22T05:56:03.063Z - 2020-01-22T06:01:51.722Z - 22-01-2020

ఎన్ఆర్ఐ పాలసీ.. ఎన్నికల వేళ సర్కార్ మరో ఆయుధం?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ ప్రభుత్వం మంగళవారం తమ అధికార బృందాన్ని కేరళకి పంపించింది. తమ రాష్ట్రం నుండి వివిధ దేశాలలో ఉద్యోగ, విద్యా, ఉపాధి కోసం వెళ్లిన పౌరుల విషయంలో కేరళ రాష్ట్రం అవలంభిస్తున్న విధానాన్ని పరిశీలించేందుకుగాను తెలంగాణ ప్రభుత్వ ఉన్నత అధికారాల బృందం వెళ్ళింది. అక్కడ విధానాన్ని పరిశీలించి తెలంగాణ రాష్ట్రంకోసం మెరుగైన విధానాన్ని రూపొందిస్తామని మీడియాకి కబురు పంపింది.

ఇక అనుకున్నదదే తడువుగా వివిధ దేశాలలో ఉంటూ రాష్ట్రంలో తెరాసకి సపోర్ట్ చేసే వివిధ సంఘాలు సీఎం కేసీఆర్ ను కీర్తిస్తూ అదే మీడియాకి లీకులు పంపింది. అయితే అసలు ఎన్ఆర్ఐ పాలసీ అన్నది గత ఆరేళ్ళుగా నానుతూ ఉన్నదే. ఇంకా చెప్పాలంటే ఎన్ఆర్ఐ పాలసీ తెస్తామని టీఆర్ఎస్ పార్టీ 2014 ఎన్నికల సమయంలో తమ మ్యానిఫెస్టోలో కూడా పెట్టారు.

ఇక అనంతరం 2016లో ఇందుకోసం ముసాయిదా జాబితాను తయారుచేసి సాధారణ పరిపాలన శాఖకు పంపించారు. అక్కడ ఆమోదం పొందిన తర్వాత హోం, పరిశ్రమలు, ఐటీ, కార్మిక ఉపాధి, ఆర్థిక, నైపుణ్య అభివృద్ధి, సాంస్కృతిక పర్యాటక శాఖ, టామ్‌కామ్‌లకు ప్రభుత్వం పంపించింది. ఆయా శాఖల సూచనలను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం ముసాయిదాను తమ వద్దే ఉంచుకుంది.

అప్పటి నుండి దాని ఊసేలేదు. ఆ తర్వాత వచ్చిన ప్రతి ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ ఎన్ఆర్ఐ పాలసీ మాటను ఎన్నికల కోసం వాడుకుంటూనే ఉంది. ఇప్పుడు అదే మాదిరి మున్సిపల్ ఎన్నికల ముందు అదే అస్త్రాన్ని ప్రయోగించిందా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సరిగా ఎన్నికలకు ముందు రోజే అధికారులను కేరళకు పంపడం మేధావులను విస్తుకొల్పుతుంది.

గతంలో 2016 చేసిన ముసాయిదాలో ప్రవాస పౌరులు చేసే అన్ని డిమాండ్లను పొందిపరిచారు. నిరుద్యోగులను మోసం చేసే ఏజెంట్లను అరికట్టడం, ఎయిర్‌పోర్టులో హెల్ప్‌డెస్క్‌లు, గల్ఫ్‌ దేశాల్లో వారికి చట్టబద్దత, కార్మికులకు చట్టపరంగా రక్షణ, ఇన్సూరెన్స్‌, చనిపోయిన వారికి రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా, విదేశీ జైళ్లలో మగ్గుతున్న ప్రవాసులకు న్యాయ సహాయం, 24 గంటల పాటు, హెల్ప్‌లైన్‌, ప్రత్యేక బీమా పథకం, ఎన్‌ఆర్‌ఐలకు రేషన్‌కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు, పిల్లలకు ఉచిత విద్య వంటి ఎన్నో వాటిని చేర్చారు.

మరి ఆ ముసాయిదా ఏమైందో కానీ అంతకు మించిన పాలసీని ఇప్పుడు తీసుకొస్తామంటూ కేరళకు పంపించడం ఆశ్చర్యం అనిపించకమానదు. సోమవారం రైతు బంధు ఒక ఆయుధంగా వాడుకున్న సర్కార్ మంగళవారం ఎన్ఆర్ఐ పాలసీను ఆయుధంగా వాడుకుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓటు కోసమే కోటి పాట్లు అన్నది రాజకీయ పార్టీలని చూసేనేమో!

 

 

 

 సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

   6 hours ago


ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

   9 hours ago


నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

   13 hours ago


మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

   13 hours ago


ఏంద‌య్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే

ఏంద‌య్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే

   13 hours ago


ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మ‌రి రాష్ట్రాల మాటేంటి

ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మ‌రి రాష్ట్రాల మాటేంటి

   11 hours ago


ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..

ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..

   21-04-2021


తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!

   a day ago


కాంగ్రెస్ కి ఇంకా ఆశ‌లు ఉన్న‌ట్లున్న‌య్

కాంగ్రెస్ కి ఇంకా ఆశ‌లు ఉన్న‌ట్లున్న‌య్

   21-04-2021


తిరుప‌తి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ త‌ప్ప‌దా

తిరుప‌తి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ త‌ప్ప‌దా

   21-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle