ఎన్ఆర్ఐల మధ్య చిచ్చు పెట్టిన వాట్సాప్ మేసేజ్
14-04-202014-04-2020 08:59:45 IST
Updated On 14-04-2020 10:24:32 ISTUpdated On 14-04-20202020-04-14T03:29:45.725Z14-04-2020 2020-04-14T03:29:38.430Z - 2020-04-14T04:54:32.426Z - 14-04-2020

వాట్సాప్, ఫేస్బుక్ సర్య్కులేట్ అయ్యే ఓ మెసేజ్ ఇప్పుడు అమెరికాలో ఉన్న భారతీయుల మధ్య విభేదాలకు కారణమైంది. సోషల్ మీడియా వేదికగా ఒకరిని ఒకరు తప్పుబడుతూ వీడియోలు పెట్టడం, చివరకు దేశాలనే అవమానించారనే చర్చ జరగడం, పోలీసులకు ఫిర్యాదు చేయడం వరకు వెళ్లింది. ఏదో ఓ యూట్యూబ్ ఛానల్ వారు అడిగినందున స్క్రిప్ట్ చదివి వీడియో చేసిన మహిళ ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం కాంగ్రెస్ - బీజేపీ నేతల మధ్య వివాదంగా మారింది. అసలేం జరిగిందంటే.. అమెరికాలో ఉండే స్వాతి అనే ఓ ఎన్ఆర్ఐ మహిళ ఇటీవల ఓ వీడియో చేశారు. కరోనా వైరస్ మహమ్మారి అమెరికాను అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో అమెరికాలోని పరిస్థితులను, భారతదేశంలోని పరిస్థితులను పోలుస్తూ ఆమె ఈ వీడియోలో మాట్లాడారు. భారత్ కరోనాను బాగా ఎదుర్కొంటోందని, అమెరికా విఫలమైందనే అర్థంతో ఆమె వ్యాఖ్యలు ఉన్నాయి. వాస్తవానికి, ఆమె ఈ వీడియోలో మాట్లాడిన మాటలు ఆమె స్వంత వ్యాఖ్యలు కావు. అప్పటికే ఈ స్క్రిప్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ స్క్రిప్ట్‌నే ఆమె వీడియోలో చదివింది. అయితే, స్వాఇతి అమెరికాలో ఉంటూ అమెరికాను కించపరిచేలా మాట్లాడటాన్ని పలువురు ఎన్ఆర్ఐలు తప్పుపట్టారు. జన్మనిచ్చిన భారతదేశంతో పాటు జీవిస్తున్న అమెరికా కూడా గొప్పవేనని, ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని విజయ అనే మరో ఎన్ఆర్ఐ మహిళ ఇంకో వీడియో చేశారు. స్వాతి చేసిన వీడియోకు, ఆమె మాటలకు కౌంటర్‌గా ఆమె వీడియో ఉంది. అమెరికాను తక్కువ చేసి చూడటం అక్కడ నివసిస్తున్న ఎన్ఆర్ఐలకు ఇబ్బందికరంగా మారిందనేది విజయ చేసిన వీడియో ఉద్దేశ్యం. ఈ రెండు వీడియోలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తెలుగు రాష్ట్రాల్లోని నెటిజన్లు, ఎన్ఆర్ఐలు కొందరు స్వాతికి మద్దతు ఇస్తుండగా, మరికొందరు విజయకు మద్దతు ఇస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇంతలో శ్రవంత్ పోరెడ్డి అనే ఓ ఎన్ఆర్ఐ స్వాతి వీడియోను సీరియస్‌గా తీసుకొని న్యూయార్క్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రవంత్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి. ఓవర్సీస్ కాంగ్రెస్‌లో కీలకంగా వ్యవహరిస్తారు. అమెరికాపై విద్వేషాన్ని పెంచేలా స్వాతి వ్యాఖ్యలు ఉన్నాయని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా తాను చేసిన వీడియో పట్ల స్వాతి క్షమాపణలు కోరారు. తనకు అమెరికాను కించపరిచే ఉద్దేశ్యం, ఎన్ఆర్ఐలను ఇబ్బంది పెట్టాలనే భావన లేదని ఆమె చెప్పారు. కేవలం ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులు స్క్రిప్ట్ పంపించి చదవమంటేనే ఆ వీడియో చేశానని ఆమె పేర్కొన్నారు. క్స్వాష్తి క్షమాపణ చెప్పడంతో ఆమె వీడియోను మొదట విమర్శించిన విజయ కూడా కన్విన్స్ అయ్యారు. కానీ, ఇప్పుడు బీజేపీ శ్రేణులు, కొందరు నెటిజన్లు శ్రవంత్ పై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. ఒక తెలుగు వ్యక్తి అయి ఉండి మరో తెలుగు మహిళను అమెరికాలో ఇబ్బంది పెట్టేలా పోలీసులకు ఫిర్యాదు చేయడం పట్ల మండిపడుతున్నారు. ఈ వ్యవహారంలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా జోక్యం చేసుకున్నారు. స్వాతికి ఆయన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఆమెపై ఫిర్యాదు చేసిన శ్రవంత్ కాంగ్రెస్ నేత అని, ఆయనను మళ్లీ భారత్‌లోకి అడుగుపెట్టకుండా చేయాలని చెప్పారు. ఈ మేరకు ఆయన వీసాను రద్దు చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను, హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి కోరతానని చెప్పారు. అయితే, అమెరికాపై విద్వేషాన్ని పెంచేలా మాట్లాడినందుకే పోలీసులకు ఫిర్యాదు చేశానని, కానీ, మళ్లీ ఫిర్యాదు వెనక్కు తీసుకోవాలని ముందే భావించానని శ్రవంత్ చెబుతున్నారు. మొత్తానికి సోషల్ మీడియాలో ఎవరో తయారు చేసిన గాలి మెసేజ్ ఇప్పుడు ఇంత పెద్ద వివాదమైంది. కాబట్టి, ఇటువంటి సోషల్ మీడియా మెసేజ్‌ల పట్ల జాగ్రత్తగా ఉండకపోతే ఎవరికైనా సమస్యలు తప్పవు.

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!
11 hours ago

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు
15 hours ago

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు
12 hours ago

సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ
16 hours ago

కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!
14 hours ago

కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత
19 hours ago

లక్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడినట్లే- రఘురామ
18 hours ago

తిరుపతిలో ఇవాళ అమ్మవారి కటాక్షమే పార్టీలకు ఇంపార్టెంట్
21 hours ago

షర్మిల పక్కనే విజయమ్మ.. లాభమా నష్టమా
17 hours ago

షర్మిల ట్రయల్స్.. పార్టీ పెట్టకుండానే ఎన్నికల్లో పోటీకి రెడీ
21 hours ago
ఇంకా