newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఎగువన కుంభవృష్టితో పోటెత్తిన కృష్ణమ్మ.. రోజుకు 18 టీఎంసీల నీరు పరవళ్లు

09-08-202009-08-2020 06:56:04 IST
2020-08-09T01:26:04.910Z09-08-2020 2020-08-09T01:25:52.725Z - - 10-04-2021

ఎగువన కుంభవృష్టితో పోటెత్తిన కృష్ణమ్మ.. రోజుకు 18 టీఎంసీల నీరు పరవళ్లు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అలమట్టికి 1.41 లక్షల క్యూసెక్కులు వరదప్రవాహం.. నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి 1.87 లక్షల క్యూసెక్కుల నీటివిడుదల. కొనసాగుతున్న కాళేశ్వరం ఎత్తిపోతలు... సాగర్ ఎడమకాల్వకు నీటి విడుదల.. పడమట దిక్కున వరద గుడేసి అనే పాత తెలుగు సినిమా పాటను నిజం చేస్తూ కృష్ణానది బేసిన్ పొడవునా వరద జలాలు పోటెత్తుతున్నాయి. రెండు రోజుల వ్యవధిలో దాదాపు  రెండు లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకు ప్రవహిస్తుండటంతో, ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో వారం, పదిరోజుల వ్యవధిలో కృష్ణా నది బేసిన్ లోని రిజర్వాయర్లు, డ్యాములు మొత్తంగా నిండిపోయే పరిస్థతి కనిపిస్తోంది. రెండు  రోజుల్లోపే 50 టీఎంసీల నీటి రాకతో తుంగ భద్ర డ్యామ్ నిండిపోనుండటంతో అన్ని వరద ప్రవాహాలు శ్రీశైలం డ్యామ్ వైపు పోటెత్తనున్నాయి.

కృష్ణా, ఉప నదులు మలప్రభ, ఘటప్రభల నుంచి శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు 1,41,389 క్యూసెక్కులు చేరుతుండటం, వరద ఉధృతి గంట గంటకూ పెరుగుతుండటంతో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్‌డీఎంఏ) మార్గదర్శకాల మేరకు కర్ణాటక సర్కార్‌ ఆల్మట్టి డ్యామ్‌ గేట్లు ఎత్తివేసింది. దిగువకు 1.80 లక్షల క్యూసెక్కులు వదిలేస్తున్నారు. ఆ ప్రవాహం నారాయణపూర్‌ డ్యామ్‌లోకి చేరుతుండటంతో.. ముందు జాగ్రత్త చర్యగా డ్యామ్‌ను ఖాళీ చేస్తూ దిగువకు 1,87,678 క్యూసెక్కులు వదిలేస్తున్నారు.

ఈ నేపథ్యంలో జూరాల ప్రాజెక్టు నుంచి వరద ప్రవాహాన్ని విడుదల చేస్తున్నారు. దాంతో శ్రీశైలంలోకి గంట గంటకూ వరద ప్రవాహం పెరుగుతోంది. ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్‌ కేంద్రంలో ఉత్పత్తి కొనసాగిస్తూ 38,140 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు. అప్పర్‌ తుంగ, భద్ర డ్యామ్‌లు నిండటంతో వరద నీటిని విడుదల చేస్తుండటంతో నీటి నిల్వ 49.78 టీఎంసీలకు చేరుకుంది. మరో 51 టీఎంసీల ప్రవాహం వస్తే తుంగభద్ర డ్యామ్‌ నిండిపోతుంది. పశ్చిమ కనుమల్లో శుక్రవారం విస్తారంగా వర్షాలు కురిసిన నేపథ్యంలో కృష్ణా, ఉప నదులకు శనివారం వరద ప్రవాహం పెరుగుతుందని కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) అంచనా వేసింది.

ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణా నదికి పోటెత్తుతున్న వరద మరి కొద్ది రోజుల పాటు ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. శుక్రవారం ఆలమట్టి ప్రాజెక్టులోకి సుమారు 1.41 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చింది. దాంతో 1.80 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సుమారు 129 టీఎంసీల సామర్థ్యం గల ఆలమట్టిలో ఇప్పటికే 100 టీఎంసీల నీరు ఉంది. ఆలమట్టి దిగువన ఉన్న నారాయణపూర్‌ ప్రాజెక్టు ఇప్పటికే నిండింది. ఎగువ నుంచి వస్తున్న వరదను పరిగణనలోకి తీసుకుని ఈ ప్రాజెక్టు నుంచి 1.87 లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఈ నీరు శని లేదా ఆదివారం జూరాలకు చేరే అవకాశం ఉంది. 

అంటే రానున్న రోజుల్లో రాష్ట్రంలోకి రోజూ సుమారు 18 టీఎంసీల వరకు నీరు రానుంది. జూరాల ప్రాజెక్టులోకి 20 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా, 30 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. తుంగభద్ర ప్రాజెక్టులోకి 98 వేల క్యూసెక్కుల వరద నమోదయింది. 100 టీఎంసీల సామర్థ్యం గల ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం 49 టీఎంసీల నీరు ఉంది. శ్రీశైలం జలాశయంలోకి 28 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా, జలవిద్యుత్తు కేంద్రం ద్వారా 38 వేల క్యూసెక్కులను నాగార్జున సాగర్‌కు వదులుతున్నారు. 

కృష్ణా బేసిన్‌లో వరద ప్రవాహం రానున్న రోజుల్లో ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టు కేంద్ర జల సంఘం అంచనా వేస్తున్నది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజీలోకి శుక్రవారం 63వేల క్యూసెక్కుల నీరు చేరుతుండగా 30 గేట్లను ఎత్తి 39,900 క్యూసెక్కులను దిగువకు విడుదల చేశారు. కాగా, కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటి పంపింగ్‌ కొనసాగుతూనే ఉంది. రోజుకు రెండు టీఎంసీల చొప్పన గోదావరి నీటిని మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి, అక్కడి నుంచి మిడ్‌మానేరుకు తరలిస్తున్నారు.

సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు నాగార్జునసాగర్‌ ఎడమ కాల్వకు ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య శుక్రవారం నీటిని విడుదల చేశారు. రెండు రోజుల్లో నల్లగొండ, ఖమ్మం జిల్లాల ఆయకట్టుకు నీటి విడుదల షెడ్యూల్‌ ప్రకటిస్తామని సాగర్‌ ప్రాజెక్టు సీఈ నర్సింహ తెలిపారు. నవంబరు చివరి వరకు నీరందిస్తామని అన్నారు.

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నీటి మట్టం శుక్రవారం సాయంత్రానికి 557.10 అడుగులకు చేరింది శ్రీశైలం నుంచి 38,140 క్యూసెక్కుల నీరు వస్తోంది. సాగర్‌ ఎడమ కాల్వ ద్వారా 1,390 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 2,200 క్యూసెక్కులు, ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రం ద్వారా 25,984 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి 38,140 క్యూసెక్కుల నీరు చేరుతోంది. 

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   6 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   3 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   5 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   9 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   12 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   13 hours ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   09-04-2021


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle