newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఎక్కడ చూసినా జనమే.. ఇదెక్కడి లాక్ డౌన్.. !

10-05-202010-05-2020 14:50:39 IST
Updated On 10-05-2020 14:57:33 ISTUpdated On 10-05-20202020-05-10T09:20:39.084Z10-05-2020 2020-05-10T09:20:36.927Z - 2020-05-10T09:27:33.892Z - 10-05-2020

ఎక్కడ చూసినా జనమే.. ఇదెక్కడి లాక్ డౌన్.. !
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కేంద్రం మే 17 వరకు లాక్ డౌన్ పొడగింపు అంటే తెలంగాణలో సీఎం కేసీఆర్ ఏకంగా మే 29 వరకు లాక్ డౌన్ అమలు అవుతుందని ప్రకటించారు. అయితే మే 8 నుండి కొన్ని సడలింపులు ఇచ్చారు. అంతే హైదరాబాద్ నగరం ఇప్పుడు ఎక్కడ చూసినా జనాలతో కళకళలాడుతుంది. రోడ్లపై వాహనాల రద్దీ.. ట్రాఫిక్ జామ్ అన్నీ యధావిధిగా కనిపిస్తూ మనం ప్రస్తుతం లాక్ డౌన్ లోనే ఉన్నామా అనే అనుమానం కలిగిస్తుంది.

శుక్రవారం నుండి మొదలైన లాక్ డౌన్ సడలింపులలో భాగంగా ప్రజలు యధావిధిగా తమ దైనందిన కార్యకలాపాలను మొదలుపెట్టారు. సడలింపులలో ఇచ్చిన రంగాలలో పనులు మొదలు కావడంతో ప్రజలు ఉరుకులు పరుగులు మొదలుపెట్టారు. అయితే, ఈక్రమంలో కరోనా వ్యాప్తిలో కీలకంగా భావించే సామాజిక దూరం, మాస్క్ నిబంధనలు గాలికి వదిలేసినట్లుగా కనిపిస్తుంది.

మద్యం దుకాణాల వద్ద సామాజిక దూరం గురించి మాట్లాడుకోకపోవడమే మంచిది కాగా మార్కెట్లు, నిత్యావసర దుకాణాల వద్ద కూడా పరిస్థితులు ఆందోళనకరంగా మారిపోయాయి. దుకాణాల నియంత్రణలో సరి-బేసి విధానం పాటించాలని కొన్నిచోట్ల చర్యలు ప్రకటించినా ఆచరణ కావడం లేదని వినిపిస్తుంది. ఇక ప్రజలైతే తామేదే కరోనాను జయించినంత ధైర్యంగా ప్రవర్తిస్తున్నారు.

రోడ్లపై వాహనాలు కూడా వేలసంఖ్యలో తిరుతున్నాయి. పోలీసులు కూడా ప్రతి వాహనాన్ని తనిఖీ చేయడం కష్టం కావడంతో నిబంధనకు విరుద్ధంగా వెళ్లే వాహనాలను మాత్రమే తనిఖీ చేస్తున్నారు. కాగా ఆ మధ్య లాక్ డౌన్ లో సీజ్ చేసిన వాహనాలను కూడా పోలీసులు వెనక్కి ఇచ్చేస్తున్నారు. మొత్తం 2 లక్షల వాహనాలను సీజ్ చేయగా రెండు రోజులలో ముప్పై వేలకు పైగా వాహనాలను వెనక్కు ఇచ్చేశారు.

సీజ్ చేసిన వాహనాలకు జరిమానాలు కట్టించుకొని తిరిగి ఇచ్చేస్తున్నట్లుగా పోలీస్ అధికారులు చెప్తున్నారు. ఇక మార్కెట్లు.. సంతలు.. షాపులు, మద్యం దుకాణాల వద్ద కూడా మాస్కుకు లేకపోతే వస్తువుల అమ్మకం లేదని బోర్డులు పెట్టినా అవి అలంకారప్రాయంగా మారిపోయాయి. ఇక షాపుల వద్ద వినియోగదారులకు శానిటైజర్ల వినియోగం కంటికి కనిపిస్తే ఒట్టు.

తొలిరోజు శుక్రవారం హైదరాబాద్ పరిధిలో చాలా చోట్ల ఫ్లై ఓవర్లపై రాకపోకలు నిషేధించి ఉండగా మధ్యాహ్నం తర్వాత అన్నీ తెరుచుకున్నాయి. రోడ్లపై టాఫిక్ జామ్ అవుతుండడంతో అధికారులు ఫ్లై ఓవర్లపై అనుమతులు ఇచ్చేశారు. పైగా లాక్ డౌన్ లో సమయం దొరకడంతో పలుచోట్ల రోడ్లకు మరమత్తులు చేయడంతో వాహనదారులు రయ్ రయ్ మంటూ దూసుకెళ్తున్నారు.

మొత్తంగా చూస్తే ఒక్క క్షణం రోడ్ల మీదకి వెళ్తే మనం లాక్ డౌన్ లోనే ఉన్నామా అనే అనుమానం కలగకమానదు. అధికారికంగా ప్రజా రవాణాకు అనుమతులు ఇవ్వలేదు కానీ దాదాపుగా వ్యక్తిగత వాహనాలు.. కంపెనీల వాహనాల ద్వారా నలభై శాతం ప్రజా రవాణా జరుగుతున్నట్లుగా కనిపిస్తుంది. ప్రస్తుతం పేరుకే లాక్ డౌన్ ఉన్నా ఎక్కడ చూసినా నగరంలో జనమే కనిపిస్తున్నారు. కాగా నగరంలో కరోనా కేసుల సంఖ్య మాత్రం ఇంకా తగ్గకపోగా ఈనెల 17 తర్వాత మరికొన్ని సడలింపులు ఇచ్చే అవకాశం ఉందంటున్నారు.

 

 

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

   11 hours ago


లొంగిపోయిన కూన రవికుమార్

లొంగిపోయిన కూన రవికుమార్

   7 hours ago


రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

   9 hours ago


షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

   11 hours ago


తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

   14 hours ago


ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

   15 hours ago


బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

   17 hours ago


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

   18 hours ago


భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

   19 hours ago


ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

   19 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle