newssting
BITING NEWS :
*గుజరాత్‌: సూరత్‌లో దారుణం.. కార్పొరేషన్ ట్రైనీ ఉద్యోగినులను గుంపులో నగ్నంగా నిలబెట్టి ఫిట్‌నెస్ పరీక్ష *నేడు తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల... ఈ నెల 25న డైరెక్టర్ పదవులకు నామినేషన్లు, 29న ఛైర్మన్, ఉపాధ్యక్ష ఎన్నికలు *అమరావతి: వైఎస్ జగన్‌ సర్కార్‌ మరో కీలక నిర్ణయం.. గత ప్రభుత్వ అక్రమాలపై విచారణకు సిట్ ఏర్పాటు.. ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామ్‌రెడ్డి నేతృత్వంలో 10 మంది సభ్యులతో సిట్ *హైదరాబాద్: బంజారాహిల్స్ లో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు.. విదేశీయుల హల్చల్, పోలీసులతో వాగ్వాదం.. పాస్ పోర్టు, వీసా పత్రాలు చూపకపోవడంతో పోలీసులకు అప్పగింత *అమరావతి: నేడు 29 గ్రామాల్లో బంద్‌కు పిలుపునిచ్చిన రైతుల జేఏసీ.. మందడంలో పోలీసుల లాఠీఛార్జ్‌కి నిరసనగా బంద్, విద్యా, వ్యాపార సంస్థలను బంద్‌ పాటించాలని కోరిన జేఏసీ

ఎంపీ అర్వింద్‌కు పసుపు సెగ‌..!

16-12-201916-12-2019 17:02:44 IST
2019-12-16T11:32:44.567Z16-12-2019 2019-12-16T11:32:35.883Z - - 22-02-2020

ఎంపీ అర్వింద్‌కు పసుపు సెగ‌..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
నిజామాబాద్ ఎంపీ ధ‌ర్మ‌పురి అర్వింద్‌కు ప‌సుపు బోర్డు సెగ త‌గులుతోంది. ప‌సుపు బోర్డు రాద‌ని, అంత‌కంటే మెరుగైన వ్య‌వ‌స్థ‌ను తీసుకువ‌స్తాన‌ని ఆయ‌న చేసిన ప్ర‌క‌ట‌న రైతుల్లో ఆగ్ర‌హానికి కార‌ణ‌మైంది.

త‌న‌ను గెలిపిస్తే వారం రోజుల్లో ప‌సుపు బోర్డు తీసుకువ‌స్తాన‌ని హామీ ఇచ్చి గెలిచిన అర్వింద్ ఇప్పుడు మాట త‌ప్పార‌ని రైతులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఆయ‌న వెంట‌నే త‌న ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

నిజామాబాద్ ఎంపీగా బీజేపీ త‌ర‌పున ధ‌ర్మ‌పురి అర్వింద్ అనూహ్య విజయం సాధించారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ కుమార్తె క‌ల్వ‌కుంట్ల క‌వితను ఓడించి ఒక్క‌సారిగా వార్త‌ల్లో న‌లిచారు. అర్వింద్ గెలుపున‌కు ప్ర‌ధాన కార‌ణం ప‌సుపు రైతుల మ‌ద్ద‌తును కూడ‌గ‌ట్ట‌డ‌మే. నిజామాబాద్‌లో ప‌సుపు బోర్డును ఏర్పాటు చేయాల‌నేది ఇక్క‌డి రైతుల ద‌శాబ్దాల కోరిక‌.

ఇందుకోసం రైతులు ఎన్నో ఉద్య‌మాలు చేసినా లాభం లేకుండా పోయింది. ఈ డిమాండ్‌ను ధ‌ర్మ‌పురి అర్వింద్ బాగా ఉప‌యోగించుకున్నారు. తాను గెలిస్తే వారం రోజుల్లో ప‌సుపు బోర్డును తీసుకువ‌స్తాన‌ని రైతుల‌కు హామీ ఇవ్వ‌డంతో మెజారిటీ రైతులు బీజేపీ వైపు మొగ్గు చూపారు. ఫ‌లితంగా క‌ల్వ‌కుంట్ల క‌విత ఇక్క‌డ ఓట‌మి పాల‌య్యారు.

అయితే, అర్వింద్‌కు గెలిచిన సంతోషం నెల రోజుల్లోనే ఆవిరైపోయింది. ఇచ్చిన మాట నెర‌వేర‌క‌పోవ‌డంతో రైతులు క్ర‌మంగా ఆయ‌న‌పై ఒత్తిడి పెంచారు. ప‌సుపు బోర్డు సాధ‌న కోసం అర్వింద్ ఢిల్లీలో బాగానే ప్ర‌య‌త్నాలు చేశారు.

కేంద్రమంత్రుల‌ను క‌లిసి బోర్డు సాధించే ప్ర‌య‌త్నం చేశారు. కానీ, ఆయ‌న ప్ర‌య‌త్నాలు ఇంత‌వ‌ర‌కు ఫ‌లించ‌లేదు. అయితే, ప‌సుపు బోర్డు కంటే మెరుగైన వ్య‌వ‌స్థ‌ను తీసుకువ‌స్తామ‌ని అర్వింద్ ప్ర‌క‌టించారు. సంక్రాంతి వ‌ర‌కు రైతుల‌కు తీపిక‌బురు చెబుతామ‌ని చెప్పారు.

ద‌శాబ్దాలుగా పోరాడుతున్న ప‌సుపు బోర్డు రాద‌ని, ఇంకా ఏదో కొత్త వ్య‌వ‌స్థ‌ను తీసుకువ‌స్తామ‌ని ఎంపీ చెప్ప‌డం, వారం రోజుల్లో ప‌సుపు బోర్డు తెస్తాన‌ని హామీ ఇచ్చి, కేంద్రంలో బీజేపీనే అధికారంలో ఉన్నా తేలేక‌పోవ‌డంతో రైతులు ఎంపీపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. అర్వింద్‌కు వ్య‌తిరేకంగా, ప‌సుపు బోర్డు సాధ‌న‌కు మ‌రోసారి ఉద్య‌మాన్ని మొద‌లు పెట్టారు.

అయితే, రైతులు మూడు వ‌ర్గాలుగా చీలిపోయి ప్ర‌త్యేక కార్యాచరణ ద్వారా ఉద్య‌మాల‌ను ప్రారంభించారు. ఒక వ‌ర్గం పాద‌యాత్ర‌ను ప్రారంభించింది. మ‌రో వ‌ర్గం ప్ర‌జాప్ర‌తినిధుల‌కు విన‌తిప‌త్రాలను స‌మ‌ర్పిస్తోంది. మూడో వ‌ర్గం అర్వింద్ రాజీనామాను డిమాండ్ చేస్తోంది. మూడు వ‌ర్గాలూ అర్వింద్ వైఖ‌రికి వ్య‌తిరేకంగా ఉన్నాయి.

త‌మ చిర‌కాల కోరిక‌గా ఉన్న ప‌సుపు బోర్డును సాధించాల‌ని ఆయ‌న‌పై మ‌రింత ఒత్తిడి పెంచుతున్నారు. అయితే, రైతులు రాజ‌కీయాల‌కు ఆహారం కావొద్ద‌ని, ప‌సుపు బోర్డు కంటే మంచి వ్య‌వ‌స్థ‌ను తీసుకువ‌స్తున్న‌ట్లు అర్వింద్ చెబుతున్నారు. మొత్తంగా ఎన్నిక‌ల్లో గెలిచేందుకు ఇచ్చిన ఒక్క హామీ ఇప్పుడు అర్వింద్‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.

 

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

   an hour ago


‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

   2 hours ago


మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

   3 hours ago


బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

   4 hours ago


రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

   4 hours ago


రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

   5 hours ago


ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

   6 hours ago


మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

   7 hours ago


పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

   7 hours ago


కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

   8 hours ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle