newssting
BITING NEWS :
*అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పర్యటన.. ఘనంగా స్వాగతం..సబర్మతి ఆశ్రమంలో మహాత్మాగాంధీ వినియోగించిన చరఖా తిప్పిన ట్రంప్ పంపతులు *సబర్మతి ఆశ్రమంలో ట్రంప్ దంపతులు... గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ట్రంప్, మోడీ *నేడు విజయనగరం జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన.. జగనన్న వసతి దీవేన కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం*సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు బాంబు బెదిరింపు.. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో పోలీసుల తనిఖీలు.. ప్లాట్ ఫామ్‌లతో పాటు రైళ్లలోనూ క్షుణ్ణంగా తనిఖీ, పేలుడు పదార్థాలు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు *చిత్తూరు జిల్లాలో గుప్త నిధుల తవ్వకాల కలకలం..శ్రీ చౌడేశ్వరి ఆలయం వెనకాల ప్రాంతంలో తవ్వకాలు *ఆదిలాబాద్‌ గుడిహత్నూర్‌లో దారుణం....బాలికపై ఇద్దరు కామాంధుల అత్యాచారం* చైనాలో కొనసాగుతున్న కరోనా మరణమృదంగం....ఇప్పటివరకు 2వేల 460కి చేరిన కొవిడ్-19 మృతుల సంఖ్య*ఒడిశా : పూరీ జిల్లా పిప్పిలి ప్రాంతంలో ఏనుగుల బీభత్సం...ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి.., ఐదుగురికి గాయాలు *గుజరాత్‌లోని వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం..ట్రక్కు- టెంపో ఢీ, 11మంది మృతి *68వ రోజు కొనసాగుతున్న రాజధాని రైతుల ఆందోళన

ఎంఐఎంకి కీలక పదవి.. పీఏసీ ఛైర్మన్‌గా అక్బరుద్దీన్ నియామకం

05-12-201905-12-2019 17:17:26 IST
Updated On 12-12-2019 16:12:26 ISTUpdated On 12-12-20192019-12-05T11:47:26.547Z05-12-2019 2019-12-05T11:47:00.380Z - 2019-12-12T10:42:26.652Z - 12-12-2019

ఎంఐఎంకి కీలక పదవి.. పీఏసీ ఛైర్మన్‌గా అక్బరుద్దీన్ నియామకం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షహోదా కోల్పోయిన కాంగ్రెస్ స్థానంలో టీఆర్ఎస్ మిత్రపక్షం మజ్లిస్ చేరిపోయింది. దీంతో కీలక పదవులు కొన్ని మజ్లిస్ ఖాతాలోకి చేరాయి.పీఏసీ కమిటీ ఛైర్మన్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్ధీన్‌ ఓవైసీ నియమించారు.

ఇవాళ అసెంబ్లీ కమిటీ హాల్‌లో జరిగిన సమావేశంలో పీఏసీ ఛైర్మన్‌గా ఆయనను ఎన్నుకున్నారు. సమావేశంలో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, సభ్యులు జైపాల్‌ యాదవ్‌, రమావత్‌ రవీందర్‌ కుమార్‌ పాల్గొన్నారు.

1958 నుంచి పీఏసీ కమిటీ ఛైర్మన్‌గా ప్రతిపక్షనేతను నియమించడం ఆచారంగా వస్తోందన్నారు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి.  పీఏసీ ఛైర్మన్‌గా ఎంపికైన అక్బరుద్ధీన్‌ ఓవైసీకి స్పీకర్‌ శుభాకాంక్షలు తెలియజేశారు.

పీఏసీ కమిటీ మిగతా కమిటీల కంటే చాలా భిన్నమైనదన్నారు. ప్రభుత్వాల పనితీరు, పాలన పారదర్శకంగా కొనసాగాలని పోచారం అన్నారు. శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు అనగుణంగా, ఆయా శాఖలు సక్రమంగా పని చేస్తున్నాయా లేదా అని పరిశీలించి ప్రభుత్వానికి రిపోర్టు ఇవ్వడం ఈ కమిటీ విధి అని స్పీకర్‌ తెలిపారు. 

మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి అక్బరుద్థీన్‌ ఓవైసీకి అభినందనలు తెలిపారు. మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి పీఏసీ కమిటీ కీలకమైనదన్నారు.ప్రభుత్వం ప్రజల కోసం చేసే ఖర్చును ప్రశ్నించే అధికారం పీఏసీ ద్వారా ప్రతిపక్ష నేతకు ఇవ్వడం ప్రజాస్వామ్య అద్భుతమని మంత్రి కొనియాడారు.

ఎన్నికల్లో టీఆర్ఎస్ తర్వాత అత్యధిక స్థానాలు పొందింది కాంగ్రెస్ పార్టీ. 19 స్థానాలు పొందగా.. లోక్ సభ ఎన్నికల్లో గెలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో కాంగ్రెస్ బలం 18కి పడిపోయింది. వివిధ రాజకీయ కారణాల వల్ల 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు.

ఉప ఎన్నికల్లో హుజూర్ నగర్లో కాంగ్రెస్ అభ్యర్ధి పద్మావతి ఓడిపోయారు. దీంతో ప్రతిపక్ష హోదాకు అవసరమయిన సభ్యులు లేకపోవడంతో ఆ హోదా ఎంఐఎంకి దక్కింది. ప్రస్తుతం ఎంఐఎంకి ఏడుగురు సభ్యులు ఉన్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle