newssting
BITING NEWS :
*ఢిల్లీ వెళ్లనున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌..రాష్ట్రపతి భవన్‌ లో విందుకు హాజరుకానున్న సీఎం కేసీఆర్‌ *రెండవ రోజు భారత్‌లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పర్యటన *దేవరకొండలో మంత్రి కేటీఆర్‌ పర్యటన. పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొని సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేయనున్న కేటీఆర్‌ *తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎన్‌ ఎన్నికల్లో నేడు నామినేషన్ల స్వీకరణ * కుప్పంలో రెండోరోజు పర్యటించనున్న చంద్రబాబు* ఏపీ స్థానికల రిజర్వేషన్లపై తీర్పు వెల్లడించనున్న ఏపీ హైకోర్టు ఫాలో అప్ *వివేకా హత్యకేసుపై తీర్పు రిజర్వు చేసిన హైకోర్టు *ఇవాళ హైదరాబాద్ హౌస్ లో మోదీతో ట్రంప్ ద్వైపాక్షిక చర్చలు *ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్‌ గా రామ్‌ నివాస్‌ గోయల్ ఏకగ్రీవ ఎన్నిక*అమరావతి: 70వ రోజుకు చేరిన అమరావతి రైతుల ఆందోళనలు, మందడం, వెలగపూడి, తుళ్లూరులో రైతుల ధర్నాలు*వికారాబాద్: కొడంగల్ సమీపంలో రోడ్డు ప్రమాదం. బీజాపూర్ - హైదరాబాద్ హైవేపై కారును ఢీకొట్టిన లారీ. భార్యాభర్తలకు తీవ్రగాయాలు. హాస్పిటల్ కు తరలింపు*భారతీయ సినిమాలు గ్రేట్.. దిల్‌వాలే దుల్హనియా, షోలే చిత్రాలు గొప్పవి-డొనాల్డ్ ట్రంప్

ఎంఎంటిఎస్ లోకో పైలట్ చంద్రశేఖర్ మృతి

17-11-201917-11-2019 10:18:51 IST
2019-11-17T04:48:51.993Z17-11-2019 2019-11-17T04:48:32.607Z - - 25-02-2020

ఎంఎంటిఎస్  లోకో పైలట్ చంద్రశేఖర్ మృతి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కాచిగూడలో ఇంటర్ సిటీ రైలును ఢీకొన్న ఎంఎంటిఎస్ రైలు లోకో పైలట్ చంద్రశేఖర్ మృతిచెందాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చంద్రశేఖర్ ప్రమాదం జరిగినప్పటి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే వున్న సంగతి తెలిసిందే. కాచిగూడ రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన లోకో పైలట్ చంద్రశేఖర్ ని రెండు రైళ్ళ మధ్య ఇరుక్కున్న ఎనిమిదిగంటల తర్వాత బయటకు తీశారు.

నాంపల్లి కేర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ శేఖర్ తుదిశ్వాస వదిలారు. 5 రోజుల క్రితం కాచిగూడలో ప్రమాదం జరిగాక.. కాళ్ళనుంచి తీవ్ర రక్తస్రావం జరిగింది. కిడ్నీలు పనిచేయడం మానేశాయి. శరీరం అంతా నొక్కేయడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు.  చంద్రశేఖర్ పై కేసులు కూడా నమోదుచేశారు. 

సాంకేతిక సమస్య కారణంగా హైదరాబాద్ లోని కాచిగూడ రైల్వే స్టేషన్లో రెండు రైళ్ళు ఢీకొన్నాయి. ఆగివున్న ఉన్న ఇంటర్ సిటీ ప్యాసింజర్ రైలు ట్రాక్‌పైకి వచ్చిన ఎంఎంటీఎస్‌ ట్రైన్‌ వచ్చి ఢీకొంది. సిగ్నల్ రాకుండానే లోకో పైలట్ చంద్రశేఖర్ రైలుని నడిపినట్టు విచారణలో వెల్లడైంది. రైల్వేస్టేషన్‌ కావడంతో ఎంఎంటిఎస్ రైలు వేగం తక్కువగానే ఉంది. దీంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

ప్రమాదంలో ఎంఎంటీఎస్‌ ట్రైన్‌ మూడు కోచ్‌లు ధ్వంసం అయ్యాయి. ఆరు కోచ్‌లు పట్టాలపై పడిపోయాయి. రైళ్ళు రాకపోకలను అధికారులు పునరుద్ధరించారు. ప్రమాదం తీవ్రంగా గాయపడ్డ చంద్రశేఖర్‌‌ కుడి కాలును కేర్ ఆస్పత్రి వైద్యులు మూడ్రోజుల క్రితం తొలగించారు. ప్రమాదంలో కాలికి తీవ్ర గాయాలు కావడంతో.. దాన్ని తొలగించాల్సి వచ్చిందని కేర్ ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. 

లోకో పైలట్ చంద్రశేఖర్ ది పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఫిరంగుల దిబ్బ. పైలట్ చంద్రశేఖర్‌ 2011లో ఉద్యోగంలో చేరాడు. కాచిగూడ నెహ్రూనగర్‌లో నివాసం ఉంటున్నాడు. హైదరాబాద్‌ రైల్వే డివిజన్‌ మెకానిక్‌ విభాగంలో చేరి లోకోపైలట్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 15రోజుల క్రితమే మగబిడ్డ పుట్టాడు. చంద్రశేఖర్‌ మృతితో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle