newssting
BITING NEWS :
* ఆర్టీఐ పరిధిలోకి సీజేఐ ఆఫీస్.. సుప్రీం మరో సంచలన తీర్పు*మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన.. గవర్నర్ నిర్ణయంపై కాంగ్రెస్ గరం గరం *సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన శివసేన.. ఇవాళ విచారణ *సమ్మెపై హైకోర్టు తీర్పుకు కట్టుబడి ఉంటాం: అశ్వథ్థామరెడ్డి.*ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ అగ్రస్థానంలో కోహ్లీ, బుమ్రా *గురుగ్రామ్ లో తైక్వాండో క్రీడాకారిణి సరిత దారుణ హత్య *మిషన్ భగీరథ అవినీతిపై సీబీఐతో విచారణ జరపాలి : భట్టి విక్రమార్క*నా పెళ్లిళ్ల వల్లే జగన్ జైలుకెళ్లారా ? : పవన్*ఆర్టీసీ సమ్మెపై ఇవాళ హైకోర్టులో విచారణ *ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ

ఉసురు తీస్తున్న సమ్మె.. కేసీఆర్ కు కార్మికుల శాపనార్థాలు

13-10-201913-10-2019 15:08:19 IST
2019-10-13T09:38:19.753Z13-10-2019 2019-10-13T09:38:16.713Z - - 14-11-2019

ఉసురు తీస్తున్న సమ్మె.. కేసీఆర్ కు కార్మికుల శాపనార్థాలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
శనివారం సాయంత్రం ఖమ్మం జిల్లా ఆర్టీసీ డిపో డ్రైవర్ శ్రీనివాసరెడ్డి తనను తాను తగులబెట్టుకుని చేసిన ఆత్మహనన ప్రయత్నం ఆర్టీసీ ఉద్యోగులను తీవ్ర ఆగ్రహావేశాలకు గురిచేసింది. సెప్టెంబర్ నెల వేతనాలను సమ్మె చేస్తున్న ఆర్టీసీ సిబ్బందికి ఇవ్వకుండా నిలిపివేసి ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరిస్తున్న మొండివైఖరి ఇప్పటివరకు ముగ్గురు సిబ్బంది జీవితాలను బలిగొందని తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల యూనియన్ జేఏసీ తీవ్రంగా విమర్శించింది.

సమ్మెలో పాల్గొన్నంటున్నందుకు గాను సెప్టెంబర్ నెల జీతం కూడా ప్రభుత్వం నిలిపివేయడంతో దసరా పండుగ సందర్భంగా పిల్లలకు, కుటుంబానికి దుస్తులు కూడా కొనిపెట్టలేకపోయానంటూ సజీవ దహన ప్రయత్నం చేసిన ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి కుమిలిపోయినట్లు సమాచారం. 

తెలంగాణ కాంగ్రెస్ ప్రతినిధి గూడూరు నారాయణ రెడ్డి ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కేసీఆర్ మొండితనాన్ని దుయ్యబట్టారు. ఉద్యోగి సజీవ దహన చర్యకు కేసీఆరే ప్రత్యక్షంగా బాధ్యత వహించాలి. చట్టవిరుద్ధంగా 48 వేలమంది ఆర్టీసీ సిబ్బందిని కేసీఆర్ ఉద్యోగాల్లోంచి పీకేశాడు.

తెలంగాణ ప్రభుత్వం ప్రదర్శించిన క్రూరత్వానికి తట్టుకోలేకే శ్రీనివాసరెడ్డి తనను తాను దహనం చేసుకోవడానికి ప్రయత్నించాడు. తన తండ్రి ప్రయత్నాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించిన  కుమారుడు కూడా తీవ్ర గాయాల పాలయ్యాడని నారాయణ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 

Image result for KCR blamed for RTC worker suicide bid

తమను అన్యాయంగా ఉద్యోగాలనుంచి తప్పించడాన్ని తట్టుకోలేకపోయిన నలుగురు ఆర్టీసీ సిబ్బంది గత వారంరోజులుగా గుండెపోటుతో, మనోవేదనతో బలైపోయారని కాంగ్రెస్ ప్రతినిధి విమర్శించారు. సిబ్బంది పట్ల తాను ప్రదర్సించిన అమానుష వైఖరికి క్షమాపణ చెప్పాల్సింది పోయి ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం మరొక రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడని, సమ్మెలో పాల్గొంటున్న సిబ్బందిని ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి తీసుకోమని, వారికి సెప్టెంబర్ నెల జీతాలు చెల్లించమని చెబుతూ అమానుష ప్రకటన చేశారని గూడూరు ధ్వజమెత్తారు. 

ఆర్టీసీ ఉద్యోగులు ఎలాంటి తీవ్ర చర్యలకు పాల్పడకుండా స్థైర్యంతో సమ్మెను కొనసాగించాలని, రాష్ట్ర ప్రభుత్వం తక్షణం ఆర్టీసీ యూనియన్లతో చర్చలకు పూనుకుని సమస్యను పరిష్కరించాలని పేర్కొన్నారు.

కోర్టు ప్రతిపాదనకు కేసీఆర్ ససేమిరా.. సమ్మెపై కొనసాగుతున్న విచారణ

కోర్టు ప్రతిపాదనకు కేసీఆర్ ససేమిరా.. సమ్మెపై కొనసాగుతున్న విచారణ

   11 hours ago

చంద్రబాబు ఇసుక దీక్షకు అంతా రెడీ... పవన్ సపోర్ట్

చంద్రబాబు ఇసుక దీక్షకు అంతా రెడీ... పవన్ సపోర్ట్

   12 hours ago

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ .. ఇంగ్లీషు మీడియానికి ఓకె

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ .. ఇంగ్లీషు మీడియానికి ఓకె

   13 hours ago

ప్ర‌శ్నార్ధ‌కంలో టీఆర్ఎస్‌ రాజ‌కీయ ఉద్దండుల భ‌విత‌వ్యం..!

ప్ర‌శ్నార్ధ‌కంలో టీఆర్ఎస్‌ రాజ‌కీయ ఉద్దండుల భ‌విత‌వ్యం..!

   13 hours ago

మీరూ చేసుకోండి స్వామీ మూడు పెళ్ళిళ్లు... జగన్‌పై పవన్ సెటైర్

మీరూ చేసుకోండి స్వామీ మూడు పెళ్ళిళ్లు... జగన్‌పై పవన్ సెటైర్

   14 hours ago

పట్నం వర్సెస్ పటోళ్ళ ...అత్తా.. అల్లుడి మధ్య కోల్డ్ వార్‌..!

పట్నం వర్సెస్ పటోళ్ళ ...అత్తా.. అల్లుడి మధ్య కోల్డ్ వార్‌..!

   14 hours ago

జీవోలను దాచిపెట్టడం దేనికి కేసీఆర్.. బీజేపీ ధ్వజం

జీవోలను దాచిపెట్టడం దేనికి కేసీఆర్.. బీజేపీ ధ్వజం

   14 hours ago

న‌న్న‌ప‌నేని ఈజ్ బ్యాక్‌.. రోజా లేని లోటును తీరుస్తుందా..?

న‌న్న‌ప‌నేని ఈజ్ బ్యాక్‌.. రోజా లేని లోటును తీరుస్తుందా..?

   15 hours ago

జ‌గ‌న్ 'రెడ్డి' అని పిల‌వ‌డం వెనుక‌ ప‌వ‌న్ ప్లాన్.!

జ‌గ‌న్ 'రెడ్డి' అని పిల‌వ‌డం వెనుక‌ ప‌వ‌న్ ప్లాన్.!

   15 hours ago

అమరావతిపై జగన్ సర్కార్ నిర్ణయం.. సింగపూర్‌కు వరమేనా?

అమరావతిపై జగన్ సర్కార్ నిర్ణయం.. సింగపూర్‌కు వరమేనా?

   16 hours ago

ఇంకా

NewsSting Team

      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle