newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఉమ్మి వేస్తే ఊరుకోరు.. మాస్క్ లేకుంటే రానివ్వరు

10-04-202010-04-2020 16:42:08 IST
2020-04-10T11:12:08.491Z10-04-2020 2020-04-10T11:10:53.234Z - - 16-04-2021

ఉమ్మి వేస్తే ఊరుకోరు.. మాస్క్ లేకుంటే రానివ్వరు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్ వ్యాపిస్తూ ఉండడంతో ప్రభుత్వం కొన్ని నిబంధనలను కఠినతరంగా అమలుచేయడానికి సిద్ధమయింది. మాస్కుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి ఒక్కరూ ఇళ్ల నుంచి బయటకు వస్తే తప్పనిసరిగా మాస్క్‌  ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే విధుల్లో ఉన్న ఉద్యోగులందరూ మాస్క్‌లు ధరించాల్సిందేనని స్పష్టం చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఉద్యోగులు కూడా మాస్క్‌లు పెట్టుకోవాల్సిందేనని సూచించింది. 

మాస్కుల కొరత నేపథ్యంలో  బయట దొరికే మాస్కులతో పాటు ఇళ్లలో తయారు చేసిన మాస్క్‌లను కూడా ధరించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే ఇతరులతో మాట్లాడేటప్పుడు తప్పనిసరిగా మాస్కు వేసుకోవాలని తెలిపింది. ఢిల్లీ, మహారాష్ట్ర, పంజాబ్‌, ఒడిశా రాష్ట్రాలు మాస్క్‌లు ధరించడం తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. కొన్ని రాష్ట్రాల్లో మాస్క్‌లు పెట్టుకోకుంటే అరెస్టుతో పాటు జరిమానా కూడా విధిస్తున్నాయి. ఆ రాష్ట్రాల జాబితాలో తెలంగాణ కూడా చేరింది. తెలంగాణలో ఇప్పటివరకు 471 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా, మృతుల సంఖ్య 12కు చేరుకుంది. వివిధ ప్రాంతాల్లో కరోనా వ్యాపించకుండా చర్యలు చేపట్టింది ప్రభుత్వం. 

అలాగే  తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త రూల్ పాస్ చేసింది.  రోడ్లపైన, సామాజిక ప్రాంతాల్లో ఉమ్మివేయడాన్ని నిషేధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శాంతి కుమారి మాట్లాడుతూ, కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు వ్యక్తిగతంగానే కాకుండా పరిసరాల పరిశుభ్రతను కలిగి ఉండాలని, అందుకే ఈ నిబంధనను అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం బుధవారం ఈ జీవో విడుదల చేసిందని, దీని ప్రకారం పాన్, చూయింగ్ గమ్, పొగాకు ఉత్పత్తులు వంటివి ఏవైనా ఎక్కడ పడితే అక్కడ ఎవరూ ఉమ్మివేయకూడదని ఆమె హెచ్చరించారు.

ఇలా ఉమ్మివేయడం వల్ల కరోనా వ్యాప్తికి ఎక్కువగా అవకాశం ఉందన్నారు. అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని వివరించారు. ఇదిలా ఉంటే ఎవరైనా నిబంధనలను అతిక్రమించినట్లైతే వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించలేదని, అయితే ప్రజలందరూ సామాజిక బాధ్యతగా దీనిని పాటిస్తే కరోనాపై చేస్తున్న పోరాటానికి కొంత మద్దతుగా ఉంటుందని వైద్య విద్య విభాగం డైరెక్టర్ డాక్టర్ కె. రమేశ్ రెడ్డి తెలిపారు. ఈ చర్యల ద్వారానైనా జనంలో మార్పులు రావాలని ఆశిద్దాం.

 

 

 

 

 

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

   12 hours ago


లొంగిపోయిన కూన రవికుమార్

లొంగిపోయిన కూన రవికుమార్

   8 hours ago


రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

   10 hours ago


షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

   13 hours ago


తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

   15 hours ago


ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

   17 hours ago


బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

   18 hours ago


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

   19 hours ago


భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

   20 hours ago


ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

   21 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle