newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఉమ్మడి జలవివాదాల పరిష్కారం దిశగా అడుగులు

05-06-202005-06-2020 08:36:34 IST
2020-06-05T03:06:34.005Z05-06-2020 2020-06-05T03:06:22.908Z - - 17-04-2021

ఉమ్మడి జలవివాదాల పరిష్కారం దిశగా అడుగులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
నదీ జలాల విషయంలో  ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వివాదాలపై జరిగిన కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశం సానుకూలంగా జరిగింది. ఆరు గంటల పాటు జరిగిన సమావేశంలో రెండు రాష్ట్రాల ప్రాజెక్టులకు సంబంధించిన అనేక విషయాలు చర్చకు వచ్చాయి. ఇరు రాష్ట్రాలు తమ వాదనలపై పవర్ ప్రజంటేషన్ ఇచ్చారు.

నది జలాల వినియోగం, ప్రాజెక్టులపై అభ్యంతరాలను ఇరు రాష్ట్రాలు తమ వాదనలను వినిపించాయని కెఆర్ఎంబి చైర్మన్ పరమేశం తెలిపారు. రెండు రాష్ట్రాలు  కృష్ణ నది పై నిర్మించే అన్ని ప్రాజెక్టుల డిపిఆర్ ఇవ్వాలని కోరామనీ, రెండు రాష్ట్రాల ఇరిగేషన్ శాఖలు తమ ప్రభుత్వాల అనుమతులు త్వరలో ఇవ్వాలని సూచించామని ఆయన తెలిపారు.

66-34 నిష్పత్తి లో గత మూడేళ్ళుగా నీటిని తీసుకున్నట్లుగానే ఈ యేడాది కూడ నీటి కేటాయింపులకు ఇరు రాష్ట్రాలు  అంగీకరించాయని, టెలిమెట్రి పేజ్ 2 అమలు చేసేందుకు కావాల్సిన నిధులను సమర్పించేందుకు రెండు రాష్ట్రాలు సిద్ధమయ్యాయని పరమేశం ప్రకటించారు. అన్ని విషయాలను పరిశీలించి పరిష్కరించుకోవాలని సూచించామన్నారు. 

శ్రీశైలం జలాశయం పై విద్యుత్ కోసం ఇరు రాష్ట్రాలు 50 శాతం నీటిని ఇచ్చేందుకు అంగీకరించాయనీ బోర్డు చైర్మన్ తెలిపారు.  ఇరు రాష్ట్రాలు లేవనెత్తిన అంశాలను కేంద్ర జలాశక్తి శాఖకు పంపుతామని అన్ని అంశాలపై కేంద్రం తుది  నిర్ణయం తీసుకుంటుందని ఆయన తెలిపారు. పూర్తి డిపిఆర్ నివేదికలు ఇచ్చే వరకు ఎలాంటి ప్రాజెక్టు నిర్మాణాలు చేయొద్దని రెండు రాష్ట్రాలకు సూచించామని, బోర్డు తరలింపు అనేది కేంద్ర జలశక్తి ఆధీనంలో ఉంటుందని వాళ్ళు ఎక్కడ పెట్టమంటే అక్కడ పెడుతామని ప్రకటించారు. గతంలో వాడుకొని నీళ్లను భవిష్యత్ ఇవ్వాలని తెలంగాణ కోరిన అంశం పై చర్చ జరిగిందనీ, అయితే ఇంకా నిర్ణయం తీసుకోలేదని బోర్డు తెలిపింది.

మిగులు జలాల వాడకంపై కమిటీ వేశామనీ, ఆ కమిటీ రిపోర్ట్ వచ్చాక మిగులు జలాల పై నిర్ణయం తీసుకుంటామని బోర్డు చైర్మన్ తెలిపారు. ఇక నీటి వివాదాలకు సంబంధించి ఏపీ కి ఇవ్వాల్సిన, రావాల్సిన నీళ్లను మాత్రమే తాము వాడుకుంటామని ఏపీ తెలిపిందని,పట్టిసీమ 45 టీఎంసీలో ఇరు రాష్ట్రాలకు ఎంత మేరకు రావాలని అంశాన్ని జలాశక్తి కి పంపామని బోర్డు ప్రకటించింది. బోర్డ్ నిధుల సమస్య పరిష్కరం అయినట్లేనని,ఉద్యోగుల విషయంలో కొన్ని చిన్న చిన్న విషయాలను చూసుకొని బదిలీలు చేయాల్సి ఉందని బోర్డు చైర్మన్ తెలిపారు.

రెండు రాష్ట్రాల మధ్య జలవివాదాలు కొత్తవేంకాదు. సమస్యల పరిష్కారానికి రెండు రాష్ట్రాలు సానుకులంగా ఉన్నాయని, రెండు రాష్ట్రాల వివాదాల పరిష్కారానికి ఒక అడుగు ముందుకు పడిందని ఇరు రాష్ట్రాల ఇరిగేషన్ అధికారులు తెలిపారు. దీంతో ఉత్కంఠ తీరిపోయింది. 

 

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

   11 hours ago


ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

   15 hours ago


కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

   12 hours ago


సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

   16 hours ago


కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

   14 hours ago


కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత

కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత

   19 hours ago


ల‌క్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడిన‌ట్లే- ర‌ఘురామ‌

ల‌క్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడిన‌ట్లే- ర‌ఘురామ‌

   18 hours ago


తిరుప‌తిలో  ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

తిరుప‌తిలో ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

   20 hours ago


ష‌ర్మిల ప‌క్క‌నే విజ‌య‌మ్మ‌.. లాభ‌మా న‌ష్ట‌మా

ష‌ర్మిల ప‌క్క‌నే విజ‌య‌మ్మ‌.. లాభ‌మా న‌ష్ట‌మా

   17 hours ago


ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

   21 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle