newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఉప్పొంగుతున్న గోదావరి.. అంతా అప్రమత్తం

16-08-202016-08-2020 09:27:17 IST
Updated On 16-08-2020 10:39:28 ISTUpdated On 16-08-20202020-08-16T03:57:17.301Z16-08-2020 2020-08-16T03:57:09.864Z - 2020-08-16T05:09:28.945Z - 16-08-2020

ఉప్పొంగుతున్న గోదావరి.. అంతా అప్రమత్తం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో అనేక చెరువులు నిండిపోయాయని సీఎం అన్నారు. అధికారులు అప్రమత్తంగా వుండాలన్నారు. సీఎం కేసీఆర్‌ వర్షాలు, వరదల పరిస్థితిపై శనివారం ఎప్పటికప్పుడు ఆరా తీశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, మంత్రులతో  సీఎం మాట్లాడుతూ.. ఆయా జిల్లాల పరిస్థితిని బట్టి తగు సూచనలు చేశారు.

ఉమ్మడి వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైందని, దాదాపు అన్ని చెరువులు అలుగులు పోస్తున్నాయని పేర్కొన్నారు. ఈ రెండు జిల్లాల్లో అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం రెండు హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచింది. వరదల్లో చిక్కుకున్నవారిని కాపాడేందుకు వీటిని ఉపయోగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ హెలికాప్టర్‌తోపాటు సైనిక హెలికాప్టర్‌ కూడా అందుబాటులోకి వచ్చింది.

రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలు, వరదలపై జిల్లా అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ కలెక్ట ర్లను ఆదేశించారు. ప్రధాన కార్యాలయాల్లో అందుబాటులో ఉం టూ పరిస్థితులను పర్యవేక్షించి ప్రజల ప్రాణాలు, ఆస్తులకు నష్టం జరుగకుండా చూడాలని చెప్పారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు వర్షాలు, వరదల నేపథ్యంలో తీసుకుంటున్న చర్యలపై బీఆర్కే భవ న్‌ నుంచి శనివారం జిల్లా కలెక్టర్లతో సీఎస్‌ టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. 

తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఉత్తర కోస్తా, దాన్ని ఆనుకుని ఉన్న వాయవ్య బంగాళాఖాతం, పశ్చిమ బెంగాల్లోని గాంగ్ టక్ ప్రాంతాల్లో అల్పపీడనం, దీనికితోడు 9.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది ఎత్తుకు వెళ్లేకొద్దీ నైరుతి వైపునకు వంపు తిరిగి ఉన్నది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఉత్తర బంగాళాఖాతంలో సుమారుగా ఈ నెల 19న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ చేయాలని ఆదేశాలిచ్చారు మంత్రి పువ్వాడ. మరో రెండు రోజుల పాటు వర్షాలు పడనున్నాయి. అధికారులు ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలి. జలాశయాల పరిస్థితి కనిపెట్టుకొని ఉండాలన్నారు. తహశీల్దార్ లు, AEE లు హెడ్ క్వార్టర్స్ వదిలి వెళ్ళవద్దని జిల్లా కలెక్టర్ కు ఇప్పటికే సూచించారు మంత్రి పువ్వాడ. 

సహాయ చర్యలకోసం టోల్ ఫ్రీ నెంబర్ 040-23450624 ఏర్పాటు చేశారు. ఎడతెరిపి లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా  కురుస్తున్న వర్షం కారణంగా ఖమ్మం జిల్లాలోను మూడు రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్న సందర్భంగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సూచించారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ చేయాలనీ మంత్రి అధికారులను ఆదేశించారు.

మంత్రి పువ్వాడ, జిలా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఇతర అధికారులు మున్నేరును సందర్శించి మున్నేరు పరిస్థితిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామాల వారీగా నిండిన చెక్ డ్యాములు, చెరువులు, కుంటలు, ఇంకా వర్షాలు విస్తారంగా కురిస్తే చేపట్టిన, చేపట్టాల్సిన చర్యలపై మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

గత పదేళ్ల తర్వాత కరీంనగర్‌ జిల్లా మానకొండూరు మండలంలోని ఈదులగట్టుపల్లిలో 27.4, వరంగల్‌ జిల్లా నల్లబెల్లిలో 27 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జోరు వానలతో వరంగల్‌, ఖమ్మం జిల్లాలు తడిసి ముద్దయ్యాయి. హన్మకొండ, వరంగల్‌, కాజీపేటలోని పలు కాలనీలు నీటమునిగాయి. జిల్లాలో గోదావరి తీరంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హై అలర్ట్‌ ప్రకటించారు. జిల్లాలో గోదావరి పరీవాహక ప్రాంతంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను రక్షించేందుకు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను రప్పిస్తున్నట్లు తెలిపారు. 

బీజేపీకి  70 సీట్లోస్తే గొప్పే : మమత

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత

   4 hours ago


బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

   5 hours ago


ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

   4 hours ago


మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   8 hours ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   9 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   8 hours ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   10 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   11 hours ago


సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

   6 hours ago


ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

   12 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle