newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఉపాధి కోల్పోతారనే లాక్‌డౌన్‌ సడలించాం.. బయటకి వస్తే ప్రమాదమే.. మంత్రి ఈటెల

09-06-202009-06-2020 06:49:56 IST
Updated On 09-06-2020 09:12:35 ISTUpdated On 09-06-20202020-06-09T01:19:56.103Z09-06-2020 2020-06-09T01:19:53.863Z - 2020-06-09T03:42:35.871Z - 09-06-2020

ఉపాధి కోల్పోతారనే లాక్‌డౌన్‌ సడలించాం.. బయటకి వస్తే ప్రమాదమే.. మంత్రి ఈటెల
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాష్ట్ర ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నించినా తెలంగాణలో కరోనా వైరస్‌ వ్యాప్తి తగ్గలేదనీ, ఈ నేపథ్యంలో లాక్ డౌన్ సడలించారని ప్రజలు కట్టు తప్పి వ్యవహరిస్తే, జాగ్రత్త పడకుంటే ప్రాణాలకే ముప్పు తప్పదని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేంద్ర స్పష్టం చేశారు. లక్షలాది ప్రజలు కరోనా వైరస్ పట్ల నిషేధాల కారణంగా జీవనోపాధి కోల్పోతున్నారన్న కారణంతోనే లాక్‌డౌన్‌ సడలింపులు ఇచ్చినట్లు మంత్రి ఈటల పేర్కొన్నారు. సడలింపులు ఇవ్వడంతో జనాలు ఎక్కువ మంది బయటకు వస్తున్నారని, దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి మరింత పెరిగిందన్నారు. వయోవృద్ధులు, అనారోగ్య సమస్యలున్నవారికి కరోనా వైరస్‌ సోకితే ప్రమాదమని, ఈ క్రమంలో మరణాల సంఖ్య పెరుగుతోందన్నారు. ప్రభుత్వం సూచించినట్లుగా ప్రజలు జాగ్రత్త పడకుంటే కష్టమని వివరించారు. 

ఆదివారం సచివాలయంలో వైద్యశాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించిన సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ ‘కరోనా వైరస్‌ వ్యాప్తి, నియంత్రణ పట్ల ప్రభుత్వాలు ఎంత ప్రచారం చేసినా ప్రజల్లో భయాందోళనలు మాత్రం తగ్గడం లేదు. హోం క్వారంటైన్లో ఉండేందుకు కేంద్రం అనుమతి ఇచ్చినా ప్రజల్లో ఉన్న భయం వారిని హాస్పిటల్‌ నుండి బయటకి రానివ్వడం లేదు. చిన్న ఇల్లు ఉన్న వారు, ఇంట్లో ప్రత్యేక గది వసతి లేని వారు హాస్పిటల్‌లోనే ఉండాలని కోరుకుంటున్నారు. మరోపక్క పాజిటివ్‌ పేషెంట్‌ ఇంటి పక్కన ఉంటే తమకూ వైరస్‌ సోకుతుందేమో అన్న భయం ప్రజల్లో ఉండ డం వల్ల చాలామంది హోమ్‌ క్వారంటైన్‌లో ఉండే వారిని ఇబ్బంది పెడుతున్నారు. జియాగూడలో ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది.’ అని చెప్పారు. 

రోజురోజుకీ ఆసుపత్రుల్లో ఉండే వారి సంఖ్య పెరిగితే మరింత ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల మేరకు తక్కువ లక్షణాలు ఉన్న, లక్షణాలు లేకుండా ఉన్న పాజిటివ్‌ పేషంట్లను ఇంట్లో ఉంచి చికిత్స అందించడానికి ప్రజలు, సమాజం సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అందరినీ హైదరాబాద్‌ తీసుకువచ్చి చికిత్స అందించడం సాధ్యం కాదని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థాయిలోనే జలుబు, దగ్గు లక్షణాలు ఉన్నవారిని గుర్తించి, చికిత్స చేయాలని వైద్యశాఖ అధికారులకు సూచించారు.

కరోనా వైరస్‌ సోకిన వైద్యులు, వైద్య సిబ్బంది, జర్నలిస్టులతో మంత్రి ఈటల రాజేందర్‌ ఆదివారం ఫోన్‌లో మాట్లాడారు. వారి యోగక్షేమాలు ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. కరోనాతో చేస్తున్న పోరాటంలో ముందు వరుసలో ఉన్న డాక్టర్లు, జర్నలిస్టులు సైతం వైరస్‌ బారిన పడుతున్నారన్నారు. వీరికి మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. హోంక్వారంటైన్‌లో ఉన్న వారికి అందుతున్న వైద్య సేవలను సమీక్షించారు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితిని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజారావును అడిగి తెలుసుకున్నారు. 

ఇక జిల్లా కేంద్రాల్లోనే వైద్య చికిత్స

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు సంఖ్య రోజురోజుకీ పెరుగుతున్న తరుణంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా లక్షణాలు ఉన్నవారికి జిల్లా స్థాయి కేంద్రాల్లోనే వైద్య చికిత్స అందించాలని ఆ శాఖ మంత్రి ఈటల రాజేందర్ అధికారులను ఆదేశించారు. అలాగే అన్ని జిల్లా కేంద్రా‍ల్లో ఐసోలేషన్‌ వార్డులను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆదివారం ఉన్నత అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ‘కోవిడ్‌ బాధితుల సంఖ్య పెరిగితే ప్రభుత్వం, వైద్యుల మీది ఒత్తిడి మరింత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిబందనల మేరకు తక్కువ లక్షణాలు ఉన్న, లక్షణాలు లేకుండా ఉన్న పాజిటివ్ పేషంట్లను ఇంట్లో ఉంచి చికిత్స అందించడానికి ప్రజలు, సమాజం సహకరించాలి. లాక్‌డౌన్ సడలించడం వల్ల ప్రజలు ఎక్కువ మంది బయటకి రావడంతో వైరస్‌ వ్యాప్తి పెరిగింది. వయసు మీద పడినవారికి, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి కరోనా సోకితే మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు కరోనా సోకకుండా ఉండే జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నా. మరణాలు తగ్గించడానికి కృషి చేస్తున్నాం.’ అని తెలిపారు.

తక్కువ లక్షణాలు ఉన్న కరోనా పాజిటివ్‌ పేషెంట్లు ఇంట్లోనే చికిత్స తీసుకోవాలని మంత్రి ఈటల రాజేందర్ సూచించారు. కరోనా పేషంట్లకు జిల్లాల్లోనే చికిత్స, జిల్లా కేంద్రాల్లో ఐసోలేషన్లు ఏర్పాటు చేశామని తెలిపారు. హోంక్వారంటైన్‌లో ఉండేందుకు కేంద్రం అనుమతి ఇచ్చినా.. ప్రజల్లో ఉన్న భయం వారిని ఆస్పత్రి నుంచి బయటికి రానివ్వడం లేదన్నారు. ఇంట్లో ప్రత్యేక గది లేనివారు ఆస్పత్రిలోనే ఉండాలని కోరుకుంటున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో ఆస్పత్రుల మీద భారం పెరుగుతుందని వాపోయారు. కరోనా వైరస్ వ్యాప్తి, నియంత్రణ పట్ల ప్రభుత్వాలు ఎంత ప్రచారం చేసినా కొంత మంది ప్రజల్లో భయాందోళనలు మాత్రం తగ్గడం లేదని మంత్రి అన్నారు. హోమ్ క్వారంటైన్లో ఉండేందుకు కేంద్రం అనుమతి ఇచ్చినా ప్రజల్లో ఉన్న భయం వారిని హాస్పిటల్ నుంచి బయటకి రానివ్వడం లేదని పేర్కొన్నారు. మరోపక్క పాజిటివ్ పేషంట్ ఇంటి పక్కన ఉంటే తమకు వైరస్ సోకుతుందేమో అన్న  భయం ప్రజల్లో ఉండటంతో హోమ్ క్వారంటైన్‌లో ఉండే వారిని ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు. క్వారంటైన్‌లో ఉండేందుకు ఇంటిపక్కన ఉన్నవారు సహకరించాలని ఈటల కోరారు. 

 

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   5 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   2 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   4 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   8 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   11 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   12 hours ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   a day ago


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle