ఉపరితల ఆవర్తనం.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు
16-06-202016-06-2020 09:36:51 IST
Updated On 16-06-2020 10:54:52 ISTUpdated On 16-06-20202020-06-16T04:06:51.947Z16-06-2020 2020-06-16T04:06:48.340Z - 2020-06-16T05:24:52.844Z - 16-06-2020

రుతుపవనాలు విస్తరించడం, ఉత్తర అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది 7.6 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. దీనికి తోడు బంగాళాఖాతంలో నెలకొనే వాతావరణ పరిస్థితులతో ఈనెల 19న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గాయి. కాగా, మధ్య భారతం మీదుగా తూర్పు, పడమరగా ఏర్పడిన ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తాలో పలుచోట్ల వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో పలుచోట్ల ఉరుములతో వర్షాలు కురుస్తాయని, ఉత్తర కోస్తాలో అక్కడక్కడా భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కాగా, రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం లేదా ఒకటి రెండు డిగ్రీలు అటూఇటుగా నమోదవుతున్నాయి. వెంకటగిరిలో సోమవారం 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక నైరుతి రుతుపవనాలు ఉత్తర అరేబియా సముద్రం, దియు ద్వీపం అంతా విస్తరించాయి. గుజరాత్, తూర్పు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలు, ఛత్తీ్‌సగఢ్, జార్ఖండ్, బిహార్‌లోని మిగిలిన ప్రాంతాలకు విస్తరించాయని వాతావరణ శాఖ తెలిపింది. మరో రెండు రోజుల్లో తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్‌లో మిగిలిన ప్రాంతాలకు విస్తరించనున్నాయని వాతావరణశాఖ ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడ్డాయి. మరో రెండురోజులు తెలంగాణలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో రైతులు పంటల సాగుకి రెడీ అయ్యారు.

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!
10 hours ago

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు
14 hours ago

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు
11 hours ago

సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ
15 hours ago

కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!
13 hours ago

కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత
18 hours ago

లక్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడినట్లే- రఘురామ
17 hours ago

తిరుపతిలో ఇవాళ అమ్మవారి కటాక్షమే పార్టీలకు ఇంపార్టెంట్
20 hours ago

షర్మిల పక్కనే విజయమ్మ.. లాభమా నష్టమా
16 hours ago

షర్మిల ట్రయల్స్.. పార్టీ పెట్టకుండానే ఎన్నికల్లో పోటీకి రెడీ
20 hours ago
ఇంకా