newssting
BITING NEWS :
* ఆర్టీఐ పరిధిలోకి సీజేఐ ఆఫీస్.. సుప్రీం మరో సంచలన తీర్పు*మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన.. గవర్నర్ నిర్ణయంపై కాంగ్రెస్ గరం గరం *సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన శివసేన.. ఇవాళ విచారణ *సమ్మెపై హైకోర్టు తీర్పుకు కట్టుబడి ఉంటాం: అశ్వథ్థామరెడ్డి.*ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ అగ్రస్థానంలో కోహ్లీ, బుమ్రా *గురుగ్రామ్ లో తైక్వాండో క్రీడాకారిణి సరిత దారుణ హత్య *మిషన్ భగీరథ అవినీతిపై సీబీఐతో విచారణ జరపాలి : భట్టి విక్రమార్క*నా పెళ్లిళ్ల వల్లే జగన్ జైలుకెళ్లారా ? : పవన్*ఆర్టీసీ సమ్మెపై ఇవాళ హైకోర్టులో విచారణ *ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ

ఉధృతంగా ఆర్టీసీ సమ్మె-కార్మికుల వంటావార్పు

13-10-201913-10-2019 12:52:59 IST
2019-10-13T07:22:59.747Z13-10-2019 2019-10-13T07:22:00.413Z - - 14-11-2019

ఉధృతంగా ఆర్టీసీ సమ్మె-కార్మికుల వంటావార్పు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కార్మికుల డిమాండ్లు.. ప్రభుత్వం మొండిపట్టుదలతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. సమ్మె ఇవాళ్టికి 9వ రోజుకు చేరుకోవడంతో యాణికులకు తిప్పలు తప్పడం లేదు. సమ్మెలో భాగంగా వివిధ రకాలుగా నిరసనలు తెలుపుతున్న ఆర్టీసీ కార్మికులు ఇవాళ అన్ని డిపోల ముందు వంటావార్పు కార్యక్రమం చేపడుతున్నారు. 

ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు డిపోల ముందు ఆర్టీసీ కార్మికులు వంటావార్పుకు సిద్ధమయ్యారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనంతో పాటు సమస్యలు, డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు సమ్మెబాట పట్టారు. తమ పోరాటం జీతాల కోసం కాదని, వేలాదిమంది కార్మికులు, లక్షలాది మంది కుటుంబాల గురించి ఆలోచిస్తున్నామని ఆర్టీసీ నేతలు చెబుతున్నారు. 

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల కార్యాచరణ గురించి కార్మికులు ప్రకటించారు. 14న డిపోల ఎదుట బైఠాయింపు, ఆర్టీసీ కార్మికుల సభ, 15న రాస్తారోకోలు నిర్వహించనుంది. 16న విద్యార్థులతో కలసి ర్యాలీలు, 17న రాష్ట్రవ్యాప్తంగా ధూంధాం, 18న బైక్ ర్యాలీలు, 19న తెలంగాణ బంద్ పాటించాలని నిర్ణయించింది. ఈ  క్రమంలో ప్రభుత్వం అరెస్టులకు దిగినా, లాఠీఛార్జీలు చేసినా తమ డిమాండ్లను సాధించే వరకు పోరు ఆపేది లేదని ఆర్టీసీ కార్మికులు స్పష్టంచేశారు. ప్రభుత్వం మాత్రం దీన్ని గూండాగిరిగా భావిస్తోంది. ఇలాంటి వాటిని సహించబోమన్న సీఎం కేసీఆర్... కార్మికులను క్షమించేది లేదంటున్నారు. పట్టువిడుపులు లేకపోవడంతో ప్రయాణికులు నలిగిపోతున్నారు. 

Image result for rtc strike in khammam

ఇదిలా ఉంటే. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. ఆర్టీసీ డ్రైవర్‌ శ్రీనివాసరెడ్డి ఆత్మహత్యకు యత్నించడంతో ఆర్టీసీ సంఘాలు ఆదివారం బస్సుల బంద్‌కు పిలుపునిచ్చాయి. ఉదయం నుంచే ఆర్టీసీ డిపోల దగ్గర కార్మికులు ఆందోళన చేస్తున్నారు. ఖమ్మం, మణుగూరు సహా ఆరు డిపోల్లో బస్సులు బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు. కార్మికుల ఆందోళనకు కాంగ్రెస్‌, వామపక్షాలు మద్దతు ఇచ్చాయి.

హైదరాబాద్‌ పాతబస్తీలో డిపో ముందు ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు. ఫలక్‌నుమ, ఫారూఖ్‌నగర్‌ డిపోల ముందు మౌనప్రదర్శన చేశారు. ఆర్టీసీ కార్మికుల ఆందోళనకు బీజేపీ, సీఐటీయూలు తమ మద్దతు తెలిపాయి.

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం డిపో కార్మికులు.. ఆందోళన కొనసాగిస్తున్నారు. నోటికి నల్లరిబ్బన్‌ కట్టుకుని నిరసన ర్యాలీ చేశారు. హన్మకొండలోని అంబేద్కర్‌ విగ్రహం దగ్గర మౌనదీక్షకు దిగారు. ప్రభుత్వం ఇలానే నిర్లక్ష్య ధోరణిలో వ్యవహరిస్తే.. సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆర్టీసీ కార్మికుల ఆందోళనలో బీజేపీ నేతలు పాల్గొన్నారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో ఆర్టీసీ కార్మికుల ఆందోళనలు శాంతియుతంగా కొనసాగుతున్నాయి. 

ఖమ్మం జిల్లా సత్తుపల్లి డిపోకు చెందిన ఆర్టీసీ కార్మికులు నోటికి నల్ల బ్యాడ్జీలు ధరించి మౌనప్రదర్శన చేశారు. మొత్తం మీద ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మె విషయంలో అమీతుమీ తేల్చుకోవడానికే సిద్ధం అవుతున్నట్టు కనిపిస్తోంది. 

 

కోర్టు ప్రతిపాదనకు కేసీఆర్ ససేమిరా.. సమ్మెపై కొనసాగుతున్న విచారణ

కోర్టు ప్రతిపాదనకు కేసీఆర్ ససేమిరా.. సమ్మెపై కొనసాగుతున్న విచారణ

   11 hours ago


చంద్రబాబు ఇసుక దీక్షకు అంతా రెడీ... పవన్ సపోర్ట్

చంద్రబాబు ఇసుక దీక్షకు అంతా రెడీ... పవన్ సపోర్ట్

   12 hours ago


ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ .. ఇంగ్లీషు మీడియానికి ఓకె

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ .. ఇంగ్లీషు మీడియానికి ఓకె

   13 hours ago


ప్ర‌శ్నార్ధ‌కంలో టీఆర్ఎస్‌ రాజ‌కీయ ఉద్దండుల భ‌విత‌వ్యం..!

ప్ర‌శ్నార్ధ‌కంలో టీఆర్ఎస్‌ రాజ‌కీయ ఉద్దండుల భ‌విత‌వ్యం..!

   13 hours ago


మీరూ చేసుకోండి స్వామీ మూడు పెళ్ళిళ్లు... జగన్‌పై పవన్ సెటైర్

మీరూ చేసుకోండి స్వామీ మూడు పెళ్ళిళ్లు... జగన్‌పై పవన్ సెటైర్

   14 hours ago


పట్నం వర్సెస్ పటోళ్ళ ...అత్తా.. అల్లుడి మధ్య కోల్డ్ వార్‌..!

పట్నం వర్సెస్ పటోళ్ళ ...అత్తా.. అల్లుడి మధ్య కోల్డ్ వార్‌..!

   14 hours ago


జీవోలను దాచిపెట్టడం దేనికి కేసీఆర్.. బీజేపీ ధ్వజం

జీవోలను దాచిపెట్టడం దేనికి కేసీఆర్.. బీజేపీ ధ్వజం

   14 hours ago


న‌న్న‌ప‌నేని ఈజ్ బ్యాక్‌.. రోజా లేని లోటును తీరుస్తుందా..?

న‌న్న‌ప‌నేని ఈజ్ బ్యాక్‌.. రోజా లేని లోటును తీరుస్తుందా..?

   15 hours ago


జ‌గ‌న్ 'రెడ్డి' అని పిల‌వ‌డం వెనుక‌ ప‌వ‌న్ ప్లాన్.!

జ‌గ‌న్ 'రెడ్డి' అని పిల‌వ‌డం వెనుక‌ ప‌వ‌న్ ప్లాన్.!

   15 hours ago


అమరావతిపై జగన్ సర్కార్ నిర్ణయం.. సింగపూర్‌కు వరమేనా?

అమరావతిపై జగన్ సర్కార్ నిర్ణయం.. సింగపూర్‌కు వరమేనా?

   16 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle