newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఉద్యోగులకు తీపి కబురు.. ఈ నెల పూర్తి జీతాలు

24-06-202024-06-2020 07:13:16 IST
Updated On 24-06-2020 10:24:37 ISTUpdated On 24-06-20202020-06-24T01:43:16.225Z24-06-2020 2020-06-24T01:43:01.477Z - 2020-06-24T04:54:37.870Z - 24-06-2020

ఉద్యోగులకు తీపి కబురు.. ఈ నెల పూర్తి జీతాలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్ కారణంగా ప్రభుత్వ ఆదాయం గణనీయంగా పడిపోయింది. వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు వంటి కీలక రంగాలకు తప్ప మిగిలిన శాఖల ఉద్యోగులకు సగం జీతమే చెల్లిస్తోంది తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడిప్పుడే రాష్ట్ర ఆదాయ పరిస్థితి కొంచెం మెరుగవుతున్నందున ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు, ఈ నెల పూర్తి వేతనం చెల్లించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు జూన్ నెల పూర్తి వేతనాలు చెల్లించాలని అధికారులకు కేసీఆర్ ఆదేశాలు జారీచేశారు.

కరోనా వైరస్ దెబ్బకు అన్ని రంగాలు దెబ్బతిన్నాయి. ఎంతో మంది ప్రజలు ఉపాధిని కోల్పోయారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఖజానాపై మహమ్మారి తీవ్ర ప్రభావం చూపింది. వివిధ రకాల పన్నులు ఆగిపోవడంతో ప్రభుత్వ ఖజానాలకు గండి పడింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వోద్యోగుల జీతాల్లో తెలంగాణ ప్రభుత్వం కోత విధించిన సంగతి తెలిసిందే.

జీతంలో కోత పడటంతో... ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పబ్లిక్ సెక్టార్, పెన్షనర్లు, కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్యవేదిక తరపున ప్రతినిధులు ఆర్థిక మంత్రి హరీశ్ రావును కలిశారు. తమ సమస్యలను మంత్రికి వివరించారు. దీంతో ఆర్థికమంత్రి హరీశ్ రావు సానుకూలంగా స్పందించారు. జీతాల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 

అనంతరం ఐక్యవేదిక ప్రతినిధులు ఒక ప్రకటనను విడుదల చేశారు. అందరికీ జూన్ నెల నుంచి పూర్తి వేతనాలను చెల్లించేందుకు మంత్రి అంగీకరించారని తెలిపారు. రిటైర్డ్ ఉద్యోగులకు పూర్తి పెన్షన్లు ఇస్తామని చెప్పారని తెలిపారు. బకాయిలను జీపీఎఫ్ ఖాతాలో జమ చేయాలనుకుంటున్నట్టు తెలిపారని చెప్పారు. అయితే ఉద్యోగులు, ఉపాధ్యాయులు వేతన బకాయిలను జీపీఎఫ్ లో కాకుండా... నగదు రూపంలోనే ఇవ్వాలని మంత్రిని కోరామని తెలిపారు.

దీనిని అమలుచేసేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామన్నారని ఐక్యవేదిక ప్రతినిధులు తెలిపారు. ఈ నెలలో ఉద్యోగులకు భారీగా ఖర్చులుంటాయి. పిల్లల్ని స్కూళ్ళలో చేర్పించడం, వారికి పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు కొనడం, స్కూలు ఫీజులు వుంటాయి. కరోనా వల్ల స్కూళ్ళు ఇంకా ప్రారంభం కాకపోయినా కొన్ని తరగతుల వారికి ప్రైవేటు పాఠశాలలు ఆన్ లైన్ క్లాసుల్ని నిర్వహిస్తున్నాయి. ఫీజులు కట్టాలని తల్లిదండ్రులకు ఫోన్లు, ఎస్ఎంఎస్ లు పంపిస్తున్నాయి. ఈనేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు ఈనెల పూర్తి వేతనం అందుకోవడం వల్ల కాస్త వెసులుబాటు కలగడం ఖాయంగా కనిపిస్తోంది. 

ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ల చైర్మన్ల వేతనాల్లో 75 శాతం, అఖిల భారత సర్వీసుల ఉద్యోగుల జీతాల్లో 60 శాతం, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగుల జీతాల్లో 50 శాతం, రిటైర్డ్‌ ఉద్యోగుల పెన్షన్లను 25 శాతం, నాలుగవ, ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాల్లో 10 శాతం కోత విధిస్తూ మార్చి 30న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు కోతలు అమల్లోకి ఉంటాయని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఏప్రిల్, మే, జూన్‌ జీతాలు, పెన్షన్లలో ప్రభుత్వం కోతలను అమలు చేసిన సంగతి తెలిసిందే. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle