newssting
BITING NEWS :
* భారత్ లో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు 1, 45, 380.. మరణాలు 4167*ఏపీలో 2719 మృతులు 57, తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1920 * కరోనా వైరస్ మహమ్మారిపై పోరులో భారత్ కు చైనా సహకారం యథాతథం * మహారాష్ట్రలో 1695 కోవిడ్ మరణాలు.. కేసులు 17,082*భారత్ లో వారం రోజుల్లో 45 వేల కేసులు *ఏపీలో భారీగా పట్టుబడుతున్న తెలంగాణా మద్యం*హైకోర్టుకు చేరిన ఏపీ వికేంద్రీకరణ, సీఆర్డీఏ సవరణ బిల్లు వ్యవహారం*సిద్దిపేట:కొండపోచమ్మ సాగర్‌ ప్రారంభోత్సవం ముహూర్తం ఖరారు..ఈనెల 29న ఉ. 11:30 గంటలకు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ *జార్ఖండ్ లో ఘోర ప్రమాదం ఐదుగురి మృతి

ఉద్యమానికి ఊపిరులూదిన పార్టీ... అభివృద్ధిలోనూ ప్రధాన భూమిక

28-04-202028-04-2020 08:12:23 IST
Updated On 28-04-2020 09:22:29 ISTUpdated On 28-04-20202020-04-28T02:42:23.357Z28-04-2020 2020-04-28T02:42:18.470Z - 2020-04-28T03:52:29.071Z - 28-04-2020

ఉద్యమానికి ఊపిరులూదిన పార్టీ... అభివృద్ధిలోనూ ప్రధాన భూమిక
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
2001 ఏప్రిల్ 27.. హైద‌రాబాద్‌లోని జ‌ల‌దృశ్యం. అప్ప‌టికే తెలంగాణ మ‌లి ద‌శ ఉద్య‌మానికి శ్రీకారం చుట్టాల‌ని, తెలంగాణ ప్ర‌జ‌ల స్వ‌రాష్ట్ర ఆకాంక్షను నెర‌వేర్చేందుకు రాజ‌కీయ పోరాటం చేయాల‌ని కె.చంద్ర‌శేఖ‌ర్‌రావు ఒక నిర్ణ‌యానికి వ‌చ్చారు. కేసీఆర్ నిర్ణ‌యానికి ప్రొ.జ‌య‌శంక‌ర్‌, కొండా ల‌క్ష్మ‌ణ్ బాపూజీ వంటి మేధావులు మ‌ద్ద‌తునిచ్చారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాల‌నే ప‌ట్టుద‌ల ఉన్న కొంద‌రు నేత‌లు కేసీఆర్ వెంట న‌డిచేందుకు ముందుకొచ్చారు. అలా జ‌ల‌దృశ్యంలో స‌రిగ్గా ఇర‌వై ఏళ్ల క్రితం 27వ తేదీ టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భ‌వించింది.

ఉద్య‌మ పార్టీగా పుట్టి ప్ర‌త్యేక తెలంగాణ సాధించి రెండు సార్లు అధికారంలోకి వ‌చ్చిన టీఆర్ఎస్ ప్ర‌స్థానం సాదాసీదాగా జ‌ర‌గ‌లేదు. ఈ ప్ర‌స్థానంలో అనేక‌ ఎదు‌రుదెబ్బ‌లు, వెన్నుపోట్లు, ఫిరాయింపులు, ఆరోప‌ణ‌లు, ఆత్మ‌స్థైర్యాన్ని దెబ్బ తీసే ప్ర‌య‌త్నాలు, అవ‌హేళ‌నలు, ఓట‌ములు ఎన్నో ఎదురయ్యాయి. బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్థుల‌తో పోరాడాల్సి వ‌చ్చింది. అయినా, కేసీఆర్ త‌న వ్యూహాల‌తో, న‌మ్మిత సిద్ధాంతాల‌తో పార్టీని ముందుకు న‌డిపించారు. ఒకానొక స‌మ‌యంలో ఇక టీఆర్ఎస్ ప‌ని ఖ‌తం అనుకున్న సంద‌ర్భంలోనూ త‌న వ్యూహాల‌తో మ‌ళ్లీ పార్టీని నిల‌బెట్టారు.

పార్టీ స్థాపించిన నెల రోజుల్లోపే జ‌రిగిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లోనే టీఆర్ఎస్ త‌న ఉనికిని చాటుకుంది. సిద్ధిపేట‌తో పాటు ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో చెప్పుకోద‌గ్గ స్థాయిలో విజ‌యాలు న‌మోదు చేసుకుంది. రాజ‌కీయ పోరాటం వ‌ల్లే తెలంగాణ ఏర్పాటు సాధ్య‌మ‌ని కేసీఆర్ బ‌లంగా న‌మ్మారు. పొత్తులు పెట్టుకున్నారు. విలీనాలు చేసుకున్నారు. 2001లోనే కేసీఆర్‌లానే ఆలోచించి స్వ‌రాష్ట్ర సాధ‌న‌కు ఆలె న‌రేంద్ర నేతృత్వంలో తెలంగాణ సాధ‌న స‌మితి ఏర్ప‌డింది. ఈ పార్టీ ల‌క్ష్యం కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే. ఇద్ద‌రిదీ ఒకే ల‌క్ష్య‌మైనందున ఆలె న‌రేంద్ర త‌న పార్టీని టీఆర్ఎస్‌లో విల‌నీం చేశారు.

కానీ ఎప్పుడూ ఈ పొత్తులు టీఆర్ఎస్‌కు క‌లిసి రాలేదు. 2004లో ప్ర‌త్యేక రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నామ‌ని చెప్పిన కాంగ్రెస్ పార్టీతో టీఆర్ఎస్ జ‌త‌క‌లిసి ఎన్నిక‌ల‌కు వెళ్లింది. 54 స్థానాల్లో పోటీ చేసి 26 స్థానాలు గెలిచి తెలంగాణ ప్ర‌జ‌ల్లో ఉన్న స్వ‌రాష్ట్ర కాంక్ష‌ను చాటి చెప్పింది. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్‌తో క‌లిసి అధికారం పంచుకుంది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌, పార్టీలో నెంబ‌ర్ 2గా ఉన్న ఆలె న‌రేంద్ర  అయితే, రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ ఆస‌క్తిగా లేక‌పోవ‌డం, ముఖ్యంగా ఆనాటి ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ప్ర‌త్యేక తెలంగాణ‌కు వ్య‌తిరేకంగా ఉండ‌టంతో ఇక లాభం లేద‌ని మంత్రివ‌ర్గం నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చింది.

జాతీయ స్థాయిలో ప్ర‌త్యేక రాష్ట్రానికి మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్ట‌డంలో కేసీఆర్ చాలా క‌ష్ట‌ప‌డి స‌ఫ‌ల‌మ‌య్యారు. ఎన్నో పార్టీల నేత‌ల‌ను క‌లిసి ప్ర‌త్యేక తెలంగాణ‌కు మ‌ద్ద‌తు ప‌లికేలా చేశారు. అయితే, రాష్ట్రంలోనే టీఆర్ఎస్‌కు ఎదురుదెబ్బ‌లు త‌గిలాయి.

టీఆర్ఎస్‌ను బ‌ల‌హీనం చేసే వ్యూహంతో అప్ప‌టి ముఖ్య‌మంత్రి వైఎస్సార్ 10 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌ను త‌న వైపు తిప్పుకున్నారు. తెలంగాణ ఉద్య‌మం లేద‌నే నిరూపించే ప్ర‌య‌త్నం చేశారు. కానీ, వైఎస్ వంటి బ‌ల‌మైన నాయ‌కుడి వ్యూహాల‌కు కేసీఆర్ ప్ర‌తివ్యూహాలు ప‌న్నారు. ఉద్య‌మం బ‌ల‌హీన‌ప‌డింద‌నే ప్ర‌చారం మొద‌లైన 2006, 2008లో క‌రీంన‌గ‌ర్ ఎంపీగా రాజీనామా చేసి ఉప ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి ప్ర‌జ‌ల్లో స్వ‌రాష్ట్ర ఆకాంక్ష ఉంద‌ని నిరూపించారు.

2009లో టీడీపీ, సీపీఐ, సీపీఎంతో క‌లిసి మ‌హాకూట‌మిగా ఏర్పడి టీఆర్ఎస్ ఎన్నిక‌ల‌కు వెళ్లింది. కానీ, ఈ ఎన్నిక‌లు టీఆర్ఎస్‌కు క‌లిసి రాలేదు. 45 స్థానాల్లో పోటీ చేసి కేవ‌లం 10 స్థానాల‌నే గెలుచుకుంది. రెండు ఎంపీ సీట్ల‌కే టీఆర్ఎస్ ప‌రిమితమైంది. ఉద్య‌మం లేద‌ని అప్ప‌టి అధికార కాంగ్రెస్ నిరూపించే ప్ర‌య‌త్నం చేసింది. కానీ, కేసీఆర్ మ‌రోసారి నిరాహార దీక్ష అనే అస్త్రంతో ఉద్య‌మాన్ని, టీఆర్ఎస్ పార్టీని నిల‌బెట్టారు. వైఎస్సార్ మ‌ర‌ణం త‌ర్వాత కేసీఆర్ మ‌రోసారి తెలంగాణ ఉద్య‌మాన్ని ఉవ్వెత్తున ఎగిసేలా చేశారు. జేఏసీ ఏర్పాటులో, స‌బ్బండ వ‌ర్గాల‌ను ఉద్య‌మంలో క‌లుపుకొని పోవ‌డంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు.

2014లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ‌ను ఏర్పాటు చేసినా అది కేసీఆర్ 13 ఏళ్ల పాటు చేసిన ఉద్య‌మ ఫ‌లిత‌మే అన‌డంలో సందేహం లేదు. కేసీఆర్ ఉద్య‌మాన్ని స‌జీవంగా నిల‌బెట్టడ‌మే ఇందుకు కార‌ణం. స్వ‌రాష్ట్రం కోసం కొట్లాడిన టీఆర్ఎస్‌కే తెలంగాణ‌లో జ‌రిగిన మొద‌టి ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు మ‌ద్ద‌తు ప‌లికారు. ఉద్య‌మ నేత‌నే ముఖ్య‌మంత్రిగా ఎన్నుకున్నారు. అప్ప‌టి నుంచి టీఆర్ఎస్‌ను తిరుగులేని రాజ‌కీయ శ‌క్తిగా మార్చారు కేసీఆర్‌. టీఆర్ఎస్ ఇప్పుడు ఉద్య‌మ పార్టీ కాద‌ని, ఫ‌క్తు రాజ‌కీయ పార్టీ అని ప్ర‌క‌టించిన ఆయ‌న రాజ‌కీయ పున‌రేకీక‌ర‌ణ ద్వారా పెద్ద ఎత్తున ఇత‌ర పార్టీల నేత‌ల‌ను టీఆర్ఎస్‌లో చేర్చుకునే ప్ర‌త్య‌ర్థి పార్టీల‌ను దెబ్బ తీశారు.

2019లో రెండోసారి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ముఖ్య‌మంత్రి అయ్యారు. నీళ్లు, నిధులు, నియామ‌కం, స్వ‌ప‌రిపాల‌న అనే ఆకాంక్ష‌‌తో స్వ‌రాష్ట్ర కోసం ఉద్య‌మించిన కేసీఆర్ ఇప్పుడు ఈ ఆకాంక్ష‌ల‌ను నెర‌వేర్చే దిశ‌గా ప‌ని చేస్తున్నారు. కరోనా వైరస్ సంక్షోభంలోనూ కేసీయార్ వెరవక రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారు. కఠిన నిర్ణయాలతో లాక్ డౌన్ అమలుచేసి కేసులను అదుపులోకి తెచ్చారు. వలస కార్మికులు కూడా పస్తులు ఉండకుండా చర్యలు తీసుకుంటున్నారు. 

ఏపీలో మాల్స్, జ్యూయలరీ, ఫుడ్ టేక్ అవేలకు అనుమతి

ఏపీలో మాల్స్, జ్యూయలరీ, ఫుడ్ టేక్ అవేలకు అనుమతి

   an hour ago


రమణదీక్షితులు సంచలన వ్యాఖ్యలు

రమణదీక్షితులు సంచలన వ్యాఖ్యలు

   2 hours ago


ఆన్ లైన్లో మహానాడు.. జూమ్ యాప్ ద్వారా 14వేలమందికి అవకాశం

ఆన్ లైన్లో మహానాడు.. జూమ్ యాప్ ద్వారా 14వేలమందికి అవకాశం

   2 hours ago


కరువు సీమకు నీటిని ఇస్తామంటే ఇంతవివాదమా.. జగన్ ప్రశ్న

కరువు సీమకు నీటిని ఇస్తామంటే ఇంతవివాదమా.. జగన్ ప్రశ్న

   2 hours ago


లాక్ డౌన్‌పై కేసీయార్ కీలక నిర్ణయం

లాక్ డౌన్‌పై కేసీయార్ కీలక నిర్ణయం

   3 hours ago


కన్నాపై మంత్రి వెల్లంపల్లి హాట్ కామెంట్స్

కన్నాపై మంత్రి వెల్లంపల్లి హాట్ కామెంట్స్

   3 hours ago


ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై బండి సంజ‌య్ ఆశ‌లు నెర‌వేరేనా..?

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై బండి సంజ‌య్ ఆశ‌లు నెర‌వేరేనా..?

   3 hours ago


హైకోర్టు ఆగ్రహం.. 49 మంది వైసీపీ నేతలకు నోటీసులు!

హైకోర్టు ఆగ్రహం.. 49 మంది వైసీపీ నేతలకు నోటీసులు!

   5 hours ago


తెలంగాణలో వైరస్ ఉధృతి.. టెస్టులు తక్కువ.. కేసులు ఎక్కువ!

తెలంగాణలో వైరస్ ఉధృతి.. టెస్టులు తక్కువ.. కేసులు ఎక్కువ!

   5 hours ago


ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

   17 hours ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle