newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఉద్యమం నుంచి ప్రభుత్వం వరకూ.. టీఆర్ఎస్‌కు 20 ఏళ్ళు

27-04-202027-04-2020 09:02:35 IST
Updated On 27-04-2020 09:21:23 ISTUpdated On 27-04-20202020-04-27T03:32:35.851Z27-04-2020 2020-04-27T03:32:29.593Z - 2020-04-27T03:51:23.934Z - 27-04-2020

ఉద్యమం నుంచి ప్రభుత్వం వరకూ..  టీఆర్ఎస్‌కు 20 ఏళ్ళు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ సాధించి, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు దోహదపడిన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితికి ఇరవై ఏళ్ళు నిండాయి. ఇవాళ  20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, టీఆర్‌ఎస్‌ శ్రేణులకు పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంతోపాటు, సాధించుకున్న తెలంగాణలో అన్నిరంగాల్లో టీఆర్‌ఎస్‌పార్టీ గొప్ప విజయాలను సాధించిందని సంతృప్తి వ్యక్తంచేశారు. 

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు నిరాడంబరంగా పార్టీ ఆవిర్భావ వేడుకలు నిర్వహించుకోవాలన్నారు. ‘టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గడిచిన ఆరేండ్లలో అనేక అద్భుతాలు సాధించింది. సంక్షేమం, విద్యుత్‌, తాగునీరు, సాగునీరు, వ్యవసాయం, పరిశ్రమలు తదితర రంగాల్లో గొప్ప విజయాలు నమోదుచేసింది. ప్రజలు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పరిష్కరించింది.

దేశానికే ఆదర్శంగా నిలిచేలా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు, కార్యక్రమాలు అమలుచేస్తున్నది. ఇది పార్టీ శ్రేణులకు, రాష్ట్ర ప్రజలకు ఎంతో గర్వకారణం’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కరోనానుంచి బయటపడ్డాక మరోసారి పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుందాం. ఈసారికి మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు ఎవరికివారు తమ ప్రాంతాల్లో అత్యంత నిరాడంబరంగా పతాకావిష్కరణ చేయాలి. తెలంగాణ అమరువీరులకు నివాళులర్పించాలి. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు కచ్చితంగా ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలి’ అని కేసీఆర్‌ పిలుపునిచ్చారు.

పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేళ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రక్తదానంచేశారు. ప్రగతిభవన్‌లో ఐపీఎం డైరెక్టర్‌ డాక్టర్‌ శంకర్‌ ఆధ్వర్యంలో వైద్య బృందం కేటీఆర్‌ రక్తాన్ని సేకరించింది. కరోనా నేపథ్యంలో రక్తం కొరత ఏర్పడిందని, ఈ నేపథ్యంలో రక్తదానాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రక్తదానం చేస్తున్నట్లుగా కేటీఆర్‌ తెలిపారు.  జలదృశ్యం నుంచి ప్రారంభమైన టీఆర్‌ఎస్‌ ఈరోజు తెలంగాణలో సుజల దృశ్యాన్ని ఆవిష్కరించే స్థాయికి ఎదిగిందని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే తారకరామారావు అన్నారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన నీళ్లు, నిధులు, నియామకాలు నినాదాన్ని సీఎం కేసీఆర్‌ ఆచరణలో అమలుచేస్తున్నారని చెప్పారు. తెలంగాణ దేశానికి రోల్‌మోడల్‌గా మారిందన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఐదు విప్లవాలు రాబోతున్నాయని వెల్లడించారు.

కేటీయార్ ట్వీట్ 

ఒక్క పిడికిలి బిగిస్తే బిగుసుకున్నయ్ కోట్ల పిడికిల్లు

ఒక్క గొంతు జైకొడితే జంగు సైరనయ్యింది

స్పూర్తి ప్రదాతా వందనం ...ఉద్యమ సూర్యుడా వందనం Folded hands

20 వసంతాలను పూర్తి చేసుకున్న సందర్భంగా ఉద్యమ బిడ్డలందరికీ 

ఆవిర్భావ దినోత్సావ శుభాకాంక్షలు

జై తెలంగాణా ! జై జై KCR !!

కరోనాపై సీఎం కేసీఆర్‌ ప్రెస్‌మీట్‌ పెడితే తెలుగువారు ప్రపంచంలో ఎక్కడున్నా చూస్తున్నారన్నారు. కేసీఆర్‌ మాటల్లో విశ్వాసం, విషయ పరిజ్ఞానం, విషయాన్ని ఆకళింపు చేసుకొనే పద్ధతికానీ ప్రపంచంలోని తెలుగువారందరినీ టీవీలకు హత్తుకుపోయేలా చేస్తాయని చెప్పారు. ‘కేసీఆర్‌ ఏది చెప్తే అది చేస్తున్నారు. చికెన్‌ తినాలంటే తింటున్నారు. బత్తాయిలు తినాలంటే తింటున్నారు. ఆయన పట్ల, కేసీఆర్‌ నాయకత్వం పట్ల ప్రజలకు అంత విశ్వాసం ఉందని మంత్రి కేటీఆర్‌ అన్నారు.   

పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా లాక్‌డౌన్‌ ముగిసే మే 7 నాటి వరకు వరుసగా పార్టీ కార్యకర్తలు, నాయకులు రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. అందరు ఒకేసారి కాకుండా బ్లడ్‌బ్యాంకులు, దవాఖానలతో మాట్లాడి రక్తదానం చేపట్టాలని సూచించారు. నిర్ణీత దూరం పాటిస్తూ రక్తదానం చేయాలన్నారు. మంత్రి కేటీఆర్‌తోపాటు జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ రక్తదానంచేశారు. జిల్లాలలో టీఆర్ఎస్ నేతలు అత్యవసర వైద్యసేవలు అవసరం అయినవారికి రక్తదానం చేయాలన్నారు.  మరోవైపు ఆర్థికమంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు. గౌరవ శ్రీ కేసీఆర్ గారికి, టిఆర్ఎస్ కార్యకర్తలకు పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ స్పూర్తి కలకాలం నిలవాలి. ఉద్యమ దీప్తి ఇలాగే వెలుగొందుతూ ఉండాలన్నారు


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle