newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఉదారత చాటుకున్న ఎమ్మెల్యే క్రాంతి కిరణ్

26-03-202026-03-2020 14:56:13 IST
Updated On 26-03-2020 14:56:07 ISTUpdated On 26-03-20202020-03-26T09:26:13.301Z26-03-2020 2020-03-26T09:14:55.515Z - 2020-03-26T09:26:07.862Z - 26-03-2020

ఉదారత చాటుకున్న ఎమ్మెల్యే క్రాంతి కిరణ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా మహమ్మారి వ్యాపించకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో ఇళ్ళకు పరిమితం కావాలని ఆయన సూచించారు.లాక్ డౌన్ అమలవుతున్న తీరుని ఆయన పర్యవేక్షించారు. ఈ నేపథ్యంలో చౌటకుర్ జాతీయ రహదారి ప్రక్కన  కొందరు ప్రజలు ఉండడం గమనించి, వారి సమస్యలను అడిగి తెలుసుకుని వారికి తగిన సహాయం చేసారు ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్.

Image may contain: one or more people, child, shoes, tree and outdoor

తాము హైదరాబాద్ నుంచి నాయణఖేడ్ వెళ్ళాలని.. రెండురోజులుగా వెళ్ళేందుకు బస్సులు లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నామన్నారు. కాలినడకన వెళుతున్నామని, ఆహారం కూడా లేదని తమ బాధలు చెప్పుకున్నారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే అందుకు తగిన ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ మానవత దృక్పదంతో వెంటనే వాళ్ళకు అవసరమైన వాహనాన్ని, అలాగే జోగిపేట్ లో వారికి ఆహారాన్ని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే సాయంపై వారు సంతోషం వ్యక్తం చేశారు. 

Image may contain: one or more people, people standing, tree, child and outdoor

ప్రజాప్రతినిధులు రోడ్లమీదకు రావాలని, ప్రజల ఇబ్బందులు తెలుసుకుని లాక్ డౌన్ విజయవంతం చేయాలని సీఎం కేసీయార్ ఆదేశించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఎమ్మెల్యే క్రాంతికిరణ్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. కరోనా వైరస్ ను ఎదుర్కోవడానికి మనమందరం కలిసికట్టుగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. జోగిపేట పట్టణంలోని కూరగాయల దుకాణాలను బహిరంగ ప్రాంతంలో ఏర్పాటు చేయించారు.

సామాజిక దూరం పాటించాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరు కూడా స్వీయ నిర్బంధం లో ఉండాలని ఆయన కోరారు. రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందని ఎమ్మెల్యే క్రాంతికిరణ్ అన్నారు. పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు అని కొందరు ఫిర్యాదుచేయగా,..  పోలీసులు మన క్షేమం కోసమే కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

సుదీర్ఘకాలం జర్నలిస్టుగా పనిచేసిన క్రాంతికిరణ్ కేసీయార్ పిలుపుమేరకు రాజకీయాల్లోకి వచ్చారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న క్రాంతికిరణ్ కి ఆందోల్ టికెట్ ఇచ్చారు కేసీయార్. 2018 ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ నేత, డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, మాజీ ఎమ్మెల్యే బాబూమోహన్ లను ఓడించారు క్రాంతి కిరణ్. ప్రజాప్రతినిధికంటే ముందు ఆయన పాత్రికేయుడు కాబట్టి ప్రజా సమస్యలపై మంచి అవగాహన వుండడంతో రాజకీయాల్లో దూసుకుపోతున్నారు. 

 

 

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

   11 hours ago


లొంగిపోయిన కూన రవికుమార్

లొంగిపోయిన కూన రవికుమార్

   7 hours ago


రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

   9 hours ago


షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

   12 hours ago


తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

   14 hours ago


ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

   16 hours ago


బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

   17 hours ago


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

   18 hours ago


భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

   19 hours ago


ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

   20 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle