ఉత్తమ్ మోకాలికి గాయం.. త్వరగా కోలుకోవాలని ట్వీట్లు
02-08-202002-08-2020 11:00:41 IST
Updated On 02-08-2020 13:31:58 ISTUpdated On 02-08-20202020-08-02T05:30:41.447Z02-08-2020 2020-08-02T05:29:25.578Z - 2020-08-02T08:01:58.609Z - 02-08-2020

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆస్పత్రి పాలయ్యారు. ఆయన మోకాలికి గాయమైంది. ఈ విషయాన్ని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ట్విటర్ ద్వారా తెలిపింది. ఈ మేరకు ‘మోకాలికి తీవ్ర గాయమైన పీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి త్వరగా కోలుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం కోరుకుంటుంది’ అంటూ ఓ ఫోటోను ట్వీట్ చేసింది. ఆ చిత్రంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మోకాలి పట్టీని ధరించారు. నడవటానికి కష్టంగా ఉండటంతో వాకర్ పట్టుకొని నెమ్మదిగా నడుస్తున్నారు. తమ అధ్యక్షుడు ఉత్తమ్ త్వరగా కోలుకోవాలని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు డాక్టర్ జే గీతా రెడ్డి ఆకాంక్షించారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. ‘యుద్ధ విమానాలు నడిపే మాజీ పైలట్ మాత్రమే కాదు. పుట్టుకతోనే పోరాటయోధుడు. ఉత్తమ్ గారు త్వరగా కోలుకోవాలని మేం కోరుకుంటున్నాం’ అని గీతారెడ్డి ట్వీట్ చేశారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో మెట్లపై నుంచి జారి పడ్డారని, దీంతో మోకాలికి బలమైన గాయం తగిలిందని గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. 15 రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని తెలిపాయి. మాజీ ఎమ్మెల్యేలు టి.రామ్మోహన్‌రెడ్డి, చల్లా వంశీచంద్‌రెడ్డి ఉత్తమ్‌ను కలిసి పరామర్శించారు. మోకాలికి పెద్ద బ్యాండేజ్ తో, వాకింగ్ క్రచెస్ సాయంతో నడుస్తున్న ఫొటోను కాంగ్రెస్ సోషల్ మీడియా వింగ్ పంచుకుంది.

కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత
3 hours ago

మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!
4 hours ago

ఆదుకుంటున్న ఆంధ్రప్రదేశ్.. ప్రశంసలు
an hour ago

గచ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 కరోనా చావులు.. లెక్క చేయని హైదరాబాదీలు
3 hours ago

ఇద్దరూ ఇద్దరే సరిపోయారు
5 hours ago

కరోనా పేషెంట్లకి సంజీవని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా
6 hours ago

కరోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కారణం తెలుసా
6 hours ago

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు
a day ago

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!
22-04-2021

నిరాహార దీక్షలపై షర్మిలక్కయ్య నిర్ణయం
22-04-2021
ఇంకా