newssting
BITING NEWS :
*గుజరాత్‌: సూరత్‌లో దారుణం.. కార్పొరేషన్ ట్రైనీ ఉద్యోగినులను గుంపులో నగ్నంగా నిలబెట్టి ఫిట్‌నెస్ పరీక్ష *నేడు తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల... ఈ నెల 25న డైరెక్టర్ పదవులకు నామినేషన్లు, 29న ఛైర్మన్, ఉపాధ్యక్ష ఎన్నికలు *అమరావతి: వైఎస్ జగన్‌ సర్కార్‌ మరో కీలక నిర్ణయం.. గత ప్రభుత్వ అక్రమాలపై విచారణకు సిట్ ఏర్పాటు.. ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామ్‌రెడ్డి నేతృత్వంలో 10 మంది సభ్యులతో సిట్ *హైదరాబాద్: బంజారాహిల్స్ లో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు.. విదేశీయుల హల్చల్, పోలీసులతో వాగ్వాదం.. పాస్ పోర్టు, వీసా పత్రాలు చూపకపోవడంతో పోలీసులకు అప్పగింత *అమరావతి: నేడు 29 గ్రామాల్లో బంద్‌కు పిలుపునిచ్చిన రైతుల జేఏసీ.. మందడంలో పోలీసుల లాఠీఛార్జ్‌కి నిరసనగా బంద్, విద్యా, వ్యాపార సంస్థలను బంద్‌ పాటించాలని కోరిన జేఏసీ

ఉత్తమ్ పదవీ వైరాగ్యం.. కారణమేంటి?

01-01-202001-01-2020 14:09:03 IST
Updated On 02-01-2020 16:35:51 ISTUpdated On 02-01-20202020-01-01T08:39:03.504Z01-01-2020 2020-01-01T08:38:55.039Z - 2020-01-02T11:05:51.885Z - 02-01-2020

ఉత్తమ్ పదవీ వైరాగ్యం.. కారణమేంటి?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కొంతకాలంగా పార్టీలో దూకుడుగా లేరన్నది రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న మాట. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పార్లమెంటుకి వెళ్లడంతోనే నేతలు తనను లెక్కచేయడం లేదన్న అభిప్రాయం తనకు ఉందన్న విషయాన్ని కూడా సన్నిహితుల వద్ద బయటపెట్టారని కాంగ్రెస్ వర్గాలలో వినిపించింది.

కాగా, తాను వదులుకున్న హుజూర్ నగర్ స్థానంలో తన భార్యను నిలబెట్టినా ఓడిపోవడంతో ఉత్తమ్ నెమ్మదించారని అభిప్రాయాలూ వినిపించాయి. ఆ తర్వాత హుజూర్ నగర్ ఓటమికి బాధ్యతగా పీసీసీ పదవి వదులుకుంటారని కథనాలు వచ్చాయి. కొత్త పీసీసీ అధ్యక్షుడుగా ఎవరు ఉండాలన్నదిపై కూడా ఆ పార్టీలో కుమ్ములాటలు కనిపించాయి. ఇప్పటికీ అవే గ్రూపు తగాదాలు కొనసాగుతున్నట్లే కనిపిస్తుంది.

అయితే తాజాగా ఉత్తమ్ పీసీసీ అధ్యక్షుడిగా రాజీనామా చేస్తానని ప్రకటించారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. మంగళవారం హుజూర్ నగర్‌లో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేసినట్లుగా తెలుస్తుంది. మున్సిపల్ ఎన్నికల తరువాత టీ పీసీసీ చీఫ్ పదవి వదులుకుని హుజూర్ నగర్, కోదాడ ప్రజలకు అందుబాటులో ఉండబోతున్నట్టు ఆయన తెలిపారు.

తన పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు త్వరలో పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటానని ఆయన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరికొద్ది రోజుల్లోనే మున్సిపల్ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

నిజానికి హుజూర్ నగర్ ఉపఎన్నికల అనంతరమే ఉత్తమ్ పీసీసీ పదవి నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నారని చెప్పినట్లుగా తెలుస్తుంది. అయితే త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు జరగనుండగా ఈ సమయంలో పీసీసీ పదవి మార్పు పార్టీలో కొత్త తలనొప్పులు తెచ్చే అవకాశం ఉందని అధిష్టానం నాన్చుతూ వస్తున్నట్లుగా తెలుస్తుంది.

పీసీసీ పదవిపై మార్పుపై ఇప్పటికే ఆ పార్టీలో సీనియర్ల నుండి జూనియర్ల వరకు పోటీనెలకొన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో మార్పు ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉండడంతో వాయిదా వేస్తూ వస్తుంది. అయితే మున్సిపల్ ఎన్నికల అనంతరం ఉత్తమ్ పదవి నుండి తప్పుకోవడం ఖరారైనట్లుగా ఆయనే ప్రకటించడంతో ఇప్పుడు మరోసారి కాంగ్రెస్ పార్టీలో చీఫ్ పదవిపై చర్చ మొదలైంది.

 

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

   41 minutes ago


‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

   2 hours ago


మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

   3 hours ago


బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

   4 hours ago


రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

   4 hours ago


రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

   5 hours ago


ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

   6 hours ago


మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

   7 hours ago


పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

   7 hours ago


కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

   8 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle