ఈ రైతు ఎందరికో ఆదర్శం
28-03-202028-03-2020 11:34:28 IST
Updated On 28-03-2020 11:55:52 ISTUpdated On 28-03-20202020-03-28T06:04:28.340Z28-03-2020 2020-03-28T06:04:18.442Z - 2020-03-28T06:25:52.603Z - 28-03-2020

మనదేశంలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 150 వరకూ కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో శనివారం ఉదయానికి కరోనా బాధితుల సంఖ్య 834కు చేరింది. అదేవిధంగా మరణాల సంఖ్య కూడా 19కి చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కరోనా అందరినీ కదిలిస్తోంది. చిన్నా పెద్దా తేడాలేదు. కరోనా కట్టడికి ప్రభుత్వం లాక్ డౌన్ అమలుచేస్తోంది. కరోనాపై పోరు కొనసాగుతున్న వేళ ఓ అన్నదాత పెద్ద మనసు చాటుకున్నారు. 50 వేల రూపాయలు విరాళంగా ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వ సహాయ కార్యక్రమాలకు అండగా నిలిచారు. సన్నకారు రైతే అయినా తనకు దేశం ముఖ్యం అని అలాగని.. ఆయనేదో మోతుబరి రైతు అనుకుంటే పొరపాటే. కేవలం నాలుగంటే నాలుగు ఎకరాల భూమి కలిగిన అతి సామాన్య రైతు. చదువుకోకపోయినా.. ప్రపంచానికి వచ్చిన కష్టాన్ని చదివారు. తన కుమారుల ద్వారా విషయం తెలుసుకున్నారు. ప్రాణాల కంటే డబ్బు ముఖ్యమా అంటూ ముందుకొచ్చారు. ఆదిలాబాద్ జిల్లా లాండసాంగి గ్రామానికి చెందిన మోర హన్మాండ్లు తన వంతుగా ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ దేవసేనను కలిశారు. సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఆయన50 వేల రూపాయల చెక్కును జిల్లా కలెక్టర్ కు అందచేశారు. తనను చూసి మరింత మంది ముందుకొస్తారనే ఆశతోనే ఇలా చేసినట్లు వివరించారు. ఆ కరోనాకు ప్రపంచమే వణికిపోతోంది. డబ్బులు ఉండి ఏం జేస్తయి.. సార్ పనికొస్తయా? మనం చచ్చిపోతే.. డబ్బులు ఏం జేస్తయ్.. నా లాంటోళ్లు ఇంకా ఎందరో సాయం చేయడానికి ముందుకు రావాలని కోరుతూ తనకు తోచింది సహాయం చేసినట్లు తెలిపారు రైతు హన్మాండ్లు. రైతు ఔదార్యానికి కలెక్టర్ ప్రశంసలు కురిపించారు. కరోనావైరస్ నివారణకు చేపట్టే చర్యల్లో ప్రజలు సహకరించాలని వైరస్ వ్యాప్తి చెందకుండా చూడాలన్నారు కలెక్టర్ దేవసేన. సినిమా తారలు, పారిశ్రామిక వేత్తలు భారీగా విరాళాలు అందిస్తున్నారు. తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల సతీమణి అనుపమ రూ. 2 కోట్లు, హీరో నితిన్ ఏపీ, తెలంగాణకు రూ.10 లక్షల రూపాలయ చొప్పున, తెలంగాణ ఉద్యోగ సంఘాల ఐకాలస రూ.48 కోట్లు.. హీరో ప్రభాస్, పవన్ కళ్యాణ్, రాంచరణ్ ఇలా విరాళాలు పెద్ద ఎత్తున వస్తున్నాయి.

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే
13 hours ago

పీకేకి ఏమైంది.. మమతాను కావాలనే దెబ్బ కొట్టాడా
10 hours ago

కేసీఆర్ కు సాగర్ భయం.. రెండోసారీ హాలియాలో సభ
12 hours ago

ఆశగా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడర్లు
16 hours ago

దొరపై జెండా ఎగరేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం
19 hours ago

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!
20 hours ago

షర్మిల మాటలతో చాలా క్లారిటీస్
09-04-2021

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వచ్చింది రెండువేలేనా
09-04-2021

పేర్ని నాని పవన్ ఫ్యానా.. వకీల్ సాబ్ కి ఫుల్ ప్రమోషన్
09-04-2021

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత
09-04-2021
ఇంకా