newssting
BITING NEWS :
*విషమంగానే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ఆరోగ్యం.. వెంటిలేటర్ పై చికిత్స *వనపర్తి జిల్లా నాగపూర్ లో విషాదం ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య *హైద‌రాబాద్‌: పంచాయతీ,మండల, జిల్లాప్రజా పరిషత్‌లకు 15వ ఆర్థిక సంఘం నిధుల పునరుద్ధరణ.. ఆరేళ్ల క్రితం నిలిపివేసిన ఆర్థికసంఘం.. ఈ ఏడాదికి రూ.1,847 కోట్ల నిధుల మంజూరు*ఢిల్లీ: ప్ర‌శాంత్ భూష‌ణ్ కోర్టు ధిక్క‌ర‌ణ సుమోటో కేసులో సుప్రీంకోర్టు తీర్పు... ప్ర‌శాంత్ భూష‌ణ్‌ను దోషిగా తేల్చిన జ‌స్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం.. శిక్ష‌పై ఈ నెల 20న వాద‌న‌లు వింటాం-సుప్రీం*హైద‌రాబాద్‌: కోవిడ్ కి ఉచిత చికిత్స చేయాలి.. కరోనాతో ఆదాయ మార్గం పోయింది కాబట్టి పేదలకు ఆరు నెలల పాటు రూ. 7500 చొప్పున‌ ఇవ్వాలి-ప్రొఫెస‌ర్ కోదండరాం*భార‌త్‌లో రికార్డు స్థాయిలో పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు.. గడచిన 24 గంటల్లో 64,553 కరోనా కేసులు నమోదు, 1007 మంది మృతి.. 24,61,191కు చేరుకున్న క‌రోనా పాజిటివ్ కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 48,040 మంది మృతి*తెలంగాణ‌లో 1921 పాజిటివ్ కేసులు నమోదు, 9 మంది మృతి.. 88396కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్పటి వరకు 674 మంది మృతి

ఈ నేల మీది..ఆత్మహత్యలు వద్దు.. ఒవైసీ హితవు

04-11-201904-11-2019 11:36:27 IST
Updated On 04-11-2019 17:47:11 ISTUpdated On 04-11-20192019-11-04T06:06:27.179Z04-11-2019 2019-11-04T06:06:23.672Z - 2019-11-04T12:17:11.596Z - 04-11-2019

ఈ నేల మీది..ఆత్మహత్యలు వద్దు.. ఒవైసీ హితవు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ముఖ్యమంత్రి కేసీఆర్‌ని అవసరానికి ఆదుకోవడంలో ఎప్పుడూ ముందుండే మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆర్టీసీ సమ్మె సందర్భంగా కూడా ముఖ్యమంత్రి పక్షాన నిలిచారు. తమ డిమాండ్ల సాధనకోసం సమ్మె చేస్తున్న తెలంగాణ ఆర్టీసీ కార్మికుల పట్ల  ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూనే సమ్మెలో పాల్గొంటూ మిమ్మల్ని మీరు చంపుకోవద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రతిపాదనను అంగీకరించాలని ఒవైసీ ఆర్టీసీ కార్మికులను కోరారు.

నవంబర్ 5 లోగా ఆర్టీసీ సిబ్బంది సమ్మెను విడనాడి విధుల్లో చేరకుంటే ఆర్టీసీలో సగం బస్సులను ప్రైవేట్ పరం చేస్తామంటూ కేసీఆర్ చేసిన ప్రకటన తీవ్ర వివాదానికి కారణమైంది. ప్రైవేటీకరణ పేరుతో మమ్మల్ని బెదిరించలేరని కార్మికులు సమ్మెను మరింత తీవ్రతరం చేయడానికి పూనుకున్న నేపథ్యంలో ఒవైసీ వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.

మీ బాధలను నేను అర్థం చేసుకోగలను. కానీ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు తాజాగా చేసిన ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకోవాలని కోరుతన్నాను. సమ్మె కాలంలో ఆర్టీసీ కార్మికులు కొందరు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు నిజంగా దురదృష్టకరం అంటూ ఒవైసీ విచారం వ్యక్తం చేశారు.

మీ జీవితాలను మీరు ముగించుకోవద్దు. దయచేసి కేసీఆర్ చేసిన ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వంతో చర్చలకు రండి. కాంగ్రెస్, బీజేపీ నేతల మాటలు నమ్మవద్దు. ఈ నేల మీది. తెలంగాణ మీ గడ్డ. సమ్మె విషయంలో ఏర్పడిన ప్రతిష్టంభన త్వరలో తొలగిపోతుందని ఆశిస్తున్నాను అని ఒవైసీ పేర్కొన్నారు.

అదేసమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‍‌కి కూడా ప్రత్యేకంగా ఒవైసీ అభ్యర్థించారు. ఆర్టీసీని ఒక వేళ ప్రైవేటీకరించినప్పటికీ, ఆర్టీసీ బస్సుల నంబర్ ప్లేట్లలో ఉండే జెడ్ అనే అక్షరాన్ని తొలగించవద్దని కోరుకుంటున్నాను. ఎందుకంటే అది హైదరాబాద్ చివరి నిజాం మీర్ ఉస్మాన్ ఆలీ ఖాన్ తల్లి జెహ్రా పేరును సూచిస్తుంది. ఇది హైదరాబాద్‌ చరిత్రలో భాగం అని ఒవైసీ పేర్కొన్నారు.

ఆర్టీసీకి చెందిన కొన్ని రూట్లను ప్రయివేటీకరించడం తప్పనిసరి అని 2019 మోటార్ వాహనాల చట్టం 2019 ప్రకారం ప్రభుత్వం ఆ పనిచేసి తీరుతుందని మరోవైపు కేసీఆర్ ఘంటాపథంగా చెబుతున్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క రాజకీయ పక్షమూ సమ్మె విషయంలో ప్రభుత్వ వైఖరిని సమర్థించని నేపథ్యంలో కేసీఆర్‌కి బాసటగా ఒవైసీ నిలబడటం విశేషం.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle