ఈ నెల 29న సీఎం కేసీఆర్ కొండపోచమ్మ సాగర్ టూర్ షెడ్యూల్
28-05-202028-05-2020 11:56:52 IST
Updated On 28-05-2020 17:14:28 ISTUpdated On 28-05-20202020-05-28T06:26:52.375Z28-05-2020 2020-05-28T06:18:41.629Z - 2020-05-28T11:44:28.411Z - 28-05-2020

దశాబ్దాల కల నెరవేరే సమయం ఆసన్నమయింది. మీటనొక్కడమే తరువాయి గోదావరి జలాలు కొండపోచమ్మ రిజర్వాయర్ లోకి చేరనున్నాయి. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో చివరిదైన కొండపోచమ్మ రిజర్వాయర్ కి మర్కుక్ గ్రామం దగ్గర ఏర్పాటుచేసిన నీటిని ఎత్తి పోసే పంప్ హౌస్ శుక్రవారం లాంఛనంగా ప్రారంభించనున్నారు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్.
గోదావరి జలాలు కొండపోచమ్మను చేరితే సముద్రమట్టానికి అత్యంత ఎత్తైన ప్రదేశానికి చేరినట్లే. కాళేశ్వరం వద్ద 85 మీటర్ల ఎత్తులో ఉండగా కొండపోచమ్మ 690 మీటర్ల ఎత్తులో ఉంది. గోదావరి నీరు కొండపోచమ్మను చేరడం ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్యం పూర్తవుతుంది. దీని ద్వారా ఇతర చెరువు కుంటలు, చిన్న చిన్న రిజర్వాయర్లను నింపుకోవాల్సి ఉంది. ఎనిమిది ప్రధాన కాలువల ద్వారా ఈ నీరు ఐదు జిల్లాలకు చేరుతుంది.

ఈ నెల 29న కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చండీయాగం, సుదర్శన యాగం, గంగమ్మకు పూజలు నిర్వహిస్తారు. 29వ తేదీ ఉదయం 4 గంటలకు ఏక కాలంలో కొండ పోచమ్మ దేవాలయంలో చండీయాగం, కొండపోచమ్మ సాగర్ పంపుహౌజ్ (మర్కూక్) వద్ద సుదర్శన యాగం పూజలు జరగనున్నాయి. ఉదయం 7.45 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు ప్రాజెక్టు నుంచి 30 కిలో మీటర్ల దూరంలో ఉండే కొండ పోచమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
చండీయాగంలో భాగంగా నిర్వహించే పూర్ణాహుతిలో సీఎం కేసీఆర్ దంపతులు పాల్గొంటారు. తీర్థ ప్రసాదాలు, వేద పండితుల ఆశీర్వాదాలు తీసుకుంటారు. అక్కడి నుంచి ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రానికి చేరుకుంటారు. ఉదయం 9 గంటల తర్వాత ఎర్రవల్లి, మర్కూక్ గ్రామాల్లో నిర్మించే రైతు వేదికలకు సీఏం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారు. అనంతరం మర్కూక్ వద్ద గల కొండ పోచమ్మ సాగర్ కు నీటిని లిఫ్టు చేసే పంపు హౌజు వద్దకు చేరుకుంటారు.
10 గంటల సమయంలో పంపుహౌస్ వద్దకు చేరుకునే చినజీయర్ స్వామికి కేసీఆర్ స్వాగతం పలుకుతారు. అక్కడ నిర్వహించే సుదర్శన యాగం పూర్ణాహుతిలో పాల్గొంటారు. చినజీయర్ స్వామిని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు కలిశారు. బుధవారం సాయంత్రం శంషాబాద్‌లోని ముచ్చింతల్ ఆశ్రమానికి వెళ్లిన సీఎం.. కొండపోచమ్మ సాగర్ జలాశయం ప్రారంభోత్సవానికి చినజీయర్ స్వామిని ఆహ్వానించారు. కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా కేసీఆర్ అక్కడ యాగాలు చేయనున్నారు.
అనంతరం పంపుహౌజ్ స్విచ్ ఆన్ చేసి (ప్రారంభం) చేస్తారు. అక్కడి నుంచి ప్రాజెక్టు డిశ్చార్జి కెనాల్ (నీరు చేరుకునే ప్రాంతం) వద్దకు వచ్చి గోదావరి జలాలకు సీఎం స్వాగతం పలుకుతారు. అనంతరం కార్యక్రమానికి ఆహ్వానించిన కొద్ది మంది అతిథులకు అక్కడే మద్యాహ్న భోజనం ఏర్పాటు చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు
an hour ago

తిరుపతి ఉప ఎన్నికను వెంటనే నిలిపేయాలి
42 minutes ago

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్
2 hours ago

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!
2 hours ago

తిరుపతిలో కొనసాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్
5 hours ago

మీదో పార్టీ.. ఆ పార్టీకో సెపరేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేనట్లే
3 hours ago

hi Prends.. ఎలా ఉన్నారు. ఊరికే చేశా.. సరే Prends ఉంటా
a few seconds ago

సభ్య సమాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామని అక్కా
6 hours ago

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!
20 hours ago

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు
16-04-2021
ఇంకా