newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఈ దుర్మార్గులకే ముందుగా కరోనా సోకాలి.. కేసీఆర్ ధ్వజం

01-04-202001-04-2020 09:00:16 IST
Updated On 01-04-2020 09:36:15 ISTUpdated On 01-04-20202020-04-01T03:30:16.450Z01-04-2020 2020-04-01T03:30:12.972Z - 2020-04-01T04:06:15.013Z - 01-04-2020

ఈ దుర్మార్గులకే ముందుగా కరోనా సోకాలి.. కేసీఆర్ ధ్వజం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సోషల్‌ మీడియా, ఇతర మీడియాలో కరోనా గురించి, లాక్ డౌన్ గురించి దుర్మార్గమైన ప్రచారాలు చేసే వారిని ప్రభుత్వం కఠినంగా శిక్షించడానికన్నా ముందు ఇలాంటి వారికే అందరికంటే ముందుగా కరోనా సోకాలని కోరుకుంటున్నట్లు కేసీఆర్ చెప్పారు. కరోనా గురించి రకరకాల మాధ్యమాల్లో దుర్మార్గపు ప్రచారాలు చేసేవారికి నిజంగానే చాలా భయంకరమైన శిక్షలుంటయి. ఇట్ల ఉంటయి నేను చూపిస్త. ఎంత చేస్తే దానికి 100 రెట్ల శిక్ష అనుభవిస్తరు. కానీ ఇలా చేసే వారికి అందరికంటే ముందు కరోనా సోకుతది... సోకాలి కూడా. దుర్మార్గులకు ఫస్ట్‌ కరోనా పట్టుకోవాలని నేను శాపం పెడుతున్నా అని కేసీఆర్ మండిపడ్డారు.

కరోనాపై పోరులో భారత్‌ తెలివిగా వ్యవహరించిందని ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెడికల్‌ సైన్స్‌కి సంబంధించిన మేధావులు అంతర్జాతీయ మ్యాగజైన్స్‌లో రాశారు. పేద దేశం, ఇప్పుడే అభివృద్ధి బాటలో పయనిస్తున్న మన దేశంలో ఉండాల్సిన స్థాయిలో పటిష్ట వైద్య సదుపాయాలు లేవు. లాక్‌డౌన్‌ చేయడమనే ఏకైక ఆయుధాన్ని భారత్‌ కరెక్ట్‌గా ప్రయోగించింది. 130 కోట్ల మంది ఉన్న దేశంలో సమస్య పెరగనివ్వలేదని అంతర్జాతీయ స్థాయిలో మెచ్చుకుంటున్నరు. ఈ గండం నుంచి పూర్తిగా బయటపడే వరకు ప్రజలు గుంపులుగా గుమికూడకపోవడం, స్వీయ నియంత్రణ, లాక్‌డౌన్‌ను కచ్చితంగా పాటించడం ప్రజల బాధ్యతే. 24 గంటలూ ప్రభుత్వాలు జాగ్రత్తలు చెబుతూ అభ్యర్థనలు చేస్తూ కూర్చోలేవు అని కేసీఆర్ వివరించారు.

లాక్‌డౌన్ సమయంలో నిబంధనలను పాటించకుండా ఇష్టప్రకారం జనం వ్యవహరిస్తుంటే ఏప్రిల్ 15న లాక్ డౌన్‌ని ఎలా ఎత్తేయగలమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎదురు ప్రశ్నించారు. ఏప్రిల్‌ 15న లాక్‌డౌన్‌ ఎత్తి వేసేందుకు ఉన్న అవకాశంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన తనదైన శైలిలో సమాధానమిచ్చారు. కరోనా వైరస్‌ నియంత్రణకు ప్రకటించిన లాక్‌డౌన్‌ను ఏప్రిల్‌ 15న రాష్ట్రంలో ఎత్తేసే అవకాశం అసలు లేదని సీఎం స్పష్టం చేశారు.

మనది చాలా పెద్ద దేశం. అంతా మంచిగుందని అనుకున్న తర్వాత ఒకరికి వైరస్‌ వస్తే పరిస్థితి ఏంటి మళ్లీ అంటుకొనే ప్రమాదం ఉంటది. ముందు రాష్ట్రం, తర్వాత దేశం స్థిమిత పడాలి. ఆ విషయాన్ని మన వైద్య నిపుణులు చెబుతరు. ఈ విపత్కర పరిస్థితి నుంచి తొందరగా బయటపడాలని అందరికన్నా ఎక్కువగా దేవుణ్ణి ప్రార్థిస్తున్న. బయటపడే వరకు నియంత్రణ పాటించాలి. మనకు మరో గత్యంతరం లేదు. ‘కరోనా వైరస్‌ ఎంత దూరం పోతదో మనకు తెలియదు. ఎప్పుడు విస్ఫోటనం లాగా విజృంభిస్తదో అంతు చిక్కకుండా ఉంది’ అని కేసీఆర్ తెలిపారు. 

అంతర్జాతీయ విమానాలు, పోర్టులు బంద్‌ అయ్యాయి కాబట్టి అంతర్జాతీయంగా వ్యాధి వచ్చే ప్రమాదం లేదు. లోకల్‌గా వచ్చి అంటించే అవకాశాలతోనే ప్రమాదం ఎక్కువ. దక్షిణ కోరియాలో ఒకే ఒక వ్యక్తి తనకు తెలియకుండానే 59 వేల మందికి వ్యాధిని అంటించాడు. ఒక సూది మొన మీద కొన్ని కోట్ల కరోనా క్రిములుంటయి. ఇది చాలా ప్రమాదకర వైరస్‌. ఈ గండం గట్టెక్కే వరకు ప్రజలు బాగున్నమని అనుకోవద్దు. ఏ నిమిషంలో ఏ విధమైన డెవలప్‌మెంట్‌ ఉంటదో తెల్వదు. తీవ్ర క్రమశిక్షణ అవసరం. ఇప్పటివరకు బాగా సహకరిస్తున్నారు. కదలికలు తగ్గాయి. ప్రజలు సహకరిస్తే తక్కువ నష్టంతో బయటపడవచ్చు అని కేసీఆర్ చెప్పారు.

 

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

   13 hours ago


లొంగిపోయిన కూన రవికుమార్

లొంగిపోయిన కూన రవికుమార్

   9 hours ago


రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

   11 hours ago


షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

   14 hours ago


తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

   16 hours ago


ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

   18 hours ago


బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

   19 hours ago


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

   20 hours ago


భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

   21 hours ago


ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

   a day ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle