newssting
BITING NEWS :
*గుజరాత్‌: సూరత్‌లో దారుణం.. కార్పొరేషన్ ట్రైనీ ఉద్యోగినులను గుంపులో నగ్నంగా నిలబెట్టి ఫిట్‌నెస్ పరీక్ష *నేడు తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల... ఈ నెల 25న డైరెక్టర్ పదవులకు నామినేషన్లు, 29న ఛైర్మన్, ఉపాధ్యక్ష ఎన్నికలు *అమరావతి: వైఎస్ జగన్‌ సర్కార్‌ మరో కీలక నిర్ణయం.. గత ప్రభుత్వ అక్రమాలపై విచారణకు సిట్ ఏర్పాటు.. ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామ్‌రెడ్డి నేతృత్వంలో 10 మంది సభ్యులతో సిట్ *హైదరాబాద్: బంజారాహిల్స్ లో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు.. విదేశీయుల హల్చల్, పోలీసులతో వాగ్వాదం.. పాస్ పోర్టు, వీసా పత్రాలు చూపకపోవడంతో పోలీసులకు అప్పగింత *అమరావతి: నేడు 29 గ్రామాల్లో బంద్‌కు పిలుపునిచ్చిన రైతుల జేఏసీ.. మందడంలో పోలీసుల లాఠీఛార్జ్‌కి నిరసనగా బంద్, విద్యా, వ్యాపార సంస్థలను బంద్‌ పాటించాలని కోరిన జేఏసీ

ఈసారి రెడ్డి నేత‌కు వ‌ద్దు బాబోయ్‌..!

30-10-201930-10-2019 12:31:45 IST
Updated On 30-10-2019 16:11:27 ISTUpdated On 30-10-20192019-10-30T07:01:45.302Z30-10-2019 2019-10-30T07:01:37.657Z - 2019-10-30T10:41:27.248Z - 30-10-2019

ఈసారి రెడ్డి నేత‌కు వ‌ద్దు బాబోయ్‌..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ కాంగ్రెస్‌లో కాబోయే పీసీసీ చీఫ్ గురించి పెద్ద ఎత్తున చ‌ర్చ ప్రారంభమైంది. ప్ర‌స్తుత అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ఈ ప‌ద‌వి నుంచి త‌ప్పుకోవాడానికి సిద్ధంగా ఉండ‌టం, ఏ క్ష‌ణ‌మైనా ఆయ‌న స్థానంలో కొత్త పీసీసీ అధ్య‌క్షుడిని నియ‌మించే అవ‌కాశం ఉండ‌టంతో ఎవ‌రికి ఈ అవ‌కాశం వ‌స్తుంద‌నే చ‌ర్చ నేత‌ల్లో, క్యాడ‌ర్‌లో మొద‌లైంది.

ముఖ్యంగా పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌విని ఆశిస్తున్న రేవంత్ రెడ్డి, కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి అనుచ‌రులు త‌మ నేత‌ల‌కే పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి వ‌స్తుంద‌ని ప్ర‌చారం చేసుకుంటున్నారు. ఇద్ద‌రూ పార్టీ నేత‌ల మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్ట‌డంతో పాటు అధిష్ఠానాన్ని ఒప్పించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. రాష్ట్ర పార్టీ నేత‌ల్లో కూడా ఓ వ‌ర్గం రేవంత్ రెడ్డి వైపు, మ‌రో వ‌ర్గం మొద‌టి నుంచి కాంగ్రెస్‌లో ఉన్న నేత‌కు పీసీసీ ప‌గ్గాలు ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తోంది.

ఈ నేప‌థ్యంలో కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి ముందునుంచీ కాంగ్రెస్‌లో ఉండ‌టంతో పాటు కొంద‌రు సీనియ‌ర్ల మ‌ద్ద‌తు ఉండ‌టంతో ఆయ‌న ఈ ప‌ద‌విని ఆశిస్తున్నారు. అయితే, అస‌లు ఈసారి రెడ్డి సామాజ‌క‌వ‌ర్గానికి చెందిన నేత‌కే ఈ ప‌ద‌వి ఇవ్వ‌వ‌ద్ద‌ని, బీసీ లేదా ఎస్సీకి పీసీసీ ప‌గ్గాలు అప్ప‌గించాల‌నే డిమాండ్ రాష్ట్ర కాంగ్రెస్‌లో తెర మీద‌కు వ‌చ్చింది.

రెడ్డి నాయ‌క‌త్వాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం ఇన్నిరోజులుగా ప్రోత్స‌హించినా ఫెయిల్ అయ్యింద‌ని కొంద‌రు నేత‌లు వాదిస్తున్నారు. పీసీసీ చీఫ్‌గా ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత‌గా జానారెడ్డిని పెట్టి వెళ్లిన ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ గ‌తం కంటే త‌క్కువ సీట్లు గెలుచుకున్న అంశాన్ని తెర‌పైకి తీసుకువ‌స్తున్నారు. పైగా ఎమ్మెల్యేల‌ను కాపాడుకోవ‌డంలోనూ ఫెయిల్ అయ్యార‌ని ఆరోపిస్తున్నారు.

రెడ్ల‌కే అవ‌కాశాలు ఇవ్వ‌డం ద్వారా పార్టీకి బ‌డుగు, బ‌ల‌హీన‌వ‌ర్గాలు దూరం అవుతున్నాయ‌నే వాద‌న‌ను తెర‌పైకి తీసుకువ‌చ్చారు. ఇప్ప‌టికే పార్టీ సీనియ‌ర్ నేత వి.హ‌నుమంత‌రావు బీసీకి పీసీసీ ప‌గ్గాలు ఇవ్వాల‌ని డిమాండ్ చేయ‌గా తాజాగా మ‌రో సీనియ‌ర్ నేత మ‌ధు యాష్కి గౌడ్ కూడా రెడ్ల‌కు మ‌ళ్లీ నాయ‌క‌త్వం ఇవ్వొద్దని వ్యాఖ్యానించారు.

రెడ్ల‌కు నాయ‌క‌త్వం ఇస్తే ఫెయిల్ అయినందున ఈసారి బీసీకో, ఎస్సీకో ఇవ్వాల‌ని, త‌ద్వారా పార్టీకి ఆయా వ‌ర్గాలు ద‌గ్గ‌ర‌వుతాయ‌నేది వీరి వాద‌న‌. దీంతో ఈ కొత్త వాద‌న పీసీసీ రేసులో ప్ర‌స్తుతం ఉన్న నేత‌ల‌కు మింగుడు ప‌డ‌కుండా త‌యారైంది. కాంగ్రెస్ అధిష్ఠానం క‌నుక వీరి వాద‌న‌తో ఏకీభ‌విస్తే పీసీసీ ప‌గ్గాల‌పై రెడ్డి సామాజ‌క‌వ‌ర్గ నేత‌లు ఆశ‌లు వ‌దులుకోవాల్సిందే.

అయితే, రెడ్ల‌ను బ‌ల‌మైన నాయ‌కులుగా చూడ‌టం కాంగ్రెస్ పార్టీలో ముందునుంచీ ఓ అనవాయితీగా వ‌స్తోంది. ఎక్కువ శాతం రెడ్డి నేత‌లే పార్టీకి నాయ‌క‌త్వం వ‌హించారు. ఇప్పుడు ఈ సంప్ర‌దాయాన్ని, ఆలోచ‌న‌ను ప‌క్క‌న పెట్టి బీసీ లేదా ఎస్సీ నేత‌కు ప‌గ్గాలు ఇస్తే ఆయా వ‌ర్గాల‌ను ఆక‌ట్టుకునే అవ‌కాశాలు అయితే ఉన్నాయి.

 

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

   2 hours ago


‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

   3 hours ago


మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

   4 hours ago


బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

   5 hours ago


రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

   5 hours ago


రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

   6 hours ago


ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

   7 hours ago


మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

   8 hours ago


పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

   8 hours ago


కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

   9 hours ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle