newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఈసారి భక్తులు లేకుండానే రాముడి కళ్యాణం

21-03-202021-03-2020 17:29:32 IST
2020-03-21T11:59:32.930Z21-03-2020 2020-03-21T11:59:29.106Z - - 17-04-2021

ఈసారి భక్తులు లేకుండానే రాముడి కళ్యాణం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా దెబ్బకు ప్రపంచం అల్లాడిపోతోంది. ఏటా అంగరంగ వైభవంగా జరిగే భద్రాచలం రాములోరి కళ్యాణానికి కరోనా ఆటంకం కలిగిస్తోంది. ఈసారి ఉగాదితో పాటు శ్రీరామనవమి వేడుకలు కూడా నిరాడంబరంగా జరగనున్నాయి. కరోనా వైర‌స్ క‌ట్ట‌డి ముంద‌స్తు చ‌ర్య‌ల్లో భాగంగా ఈ ఏడాది ఉగాది వేడుక‌ల‌ను నిరాడంబ‌రంగా నిర్వ‌హిస్తున్న‌ట్లు దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి తెలిపారు. భద్రాద్రిలో జరిగే శ్రీరామనవమి వేడుకలకు కూడా భక్తులకు అనుమ‌తి లేద‌న్నారు. ఉగాది పంచాంగ శ్ర‌వ‌ణం, శ్రీరామన‌వ‌మి వేడుక‌లు, ఆల‌యాల్లో ద‌ర్శ‌నాల ర‌ద్దుపై మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. పరిమిత సంఖ్యలో భక్తులు, అధికారులు శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొంటారని మంత్రి తెలిపారు. 

కరోనా వైరస్‌ విస్తరిస్తున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా  సీఎం కేసీఆర్ ఆదేశాల‌తో  రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు, ఆలయాల్లో ద‌ర్శ‌నాల‌ను ర‌ద్దు చేసిన సంగతి తెలిసిందే. కరోనా ప్రమాదం నేపథ్యంలో ఉగాది వేడుక‌ల‌తో పాటు శ్రీరామ‌న‌వ‌మి వేడుక‌ల‌ను నిర్వ‌హించ‌వ‌ద్ద‌ని ముఖ్య‌మంత్రి కే.చంద్ర‌శేఖ‌ర్ రావు ఆదేశించిన నేప‌థ్యంలో ఎటువంటి ఆడంబ‌రాల‌కు తావు లేకుండా పంచాంగ శ్రవ‌ణం, శ్రీరామ‌న‌వ‌మి ఉత్స‌వాల‌ను  నిర్వ‌హించ‌నున్నారు. ఈ నెల 25 ఉగాది ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని దేవాదాయశాఖ కార్యాలయంలోనే  ఉదయం 10 గంటలకు పంచాంగ శ్ర‌వ‌ణ కార్య‌క్రమం ప్రారంభ‌మవుతుంది.

ప్రజలు ఇళ్లలోనే ఉండి లైవ్ ద్వారా టీవీల్లో ఉగాది పంచాంగ శ్ర‌వ‌ణాన్ని వీక్షించవచ్చు. భద్రాద్రిలో యథావిధిగా శ్రీరామనవమి వేడుకలు నిర్వహిస్తారు. ఆలయ ప్రాంగణంలో మాత్రమే శ్రీరామనవమి వేడుకలు జ‌రుగుతాయి.

రాష్ట్ర ప్రభుత్వం త‌ర‌పున స్వామివారికి ప‌ట్టువ‌స్త్రాలు, త‌లంబ్రాలు స‌మ‌ర్పిస్తామ‌ని చెప్పారు. ఈసారి కల్యాణ ఆహ్వాన పత్రికలు కూడా ముద్రించలేదు. భక్తులు తాజా రిస్థితిని అర్థం చేసుకుని తమకు సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న వారికి డోర్ డెలీవ‌రి ద్వారా శ్రీసీతారాముల స్వామివారి తలంబ్రాలు పంపిస్తామ‌ని చెప్పారు. మ‌రోవైపు క‌రోనా వ్యాప్తి నివార‌ణ‌కు దేవాదాయ శాఖ ఆద్వ‌ర్యంలో సుద‌ర్శ‌న‌, మృత్యుంజ‌య‌ హోమాల‌ను నిర్వ‌హించ‌నున్నామన్నారు. ఇటు రాష్ట్రవ్యాప్తంగా శ్రీరాముడి ఆలయాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. భక్తులు విరివిగా రావద్దని ఆలయ కమిటీలు కోరుతున్నాయి. 

ఇటు ఏపీలో ఏప్రిల్ నెల 14న ఒంటిమిట్ట కోదండరామ స్వామి ఆలయంలో జరిగే సీతారాముల కళ్యాణానికి విచ్చేసే భక్తుల విషయంలో పరిమితి విధించనున్నట్టు తెలుస్తోంది. టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ మీడియాతో మాట్లాడుతూ.. శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా ఒంటిమిట్ట కోదండరామ ఆలయంలో భక్తులను నియంత్రిస్తామన్నారు.  ఉత్సవాలకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోందని, ప్రభుత్వం తరఫున స్వామివారికి ముఖ్యమంత్రి వైస్ జగన్‌మోహన్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. 

Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు

Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు

   an hour ago


తిరుపతి ఉప ఎన్నికను వెంటనే నిలిపేయాలి

తిరుపతి ఉప ఎన్నికను వెంటనే నిలిపేయాలి

   an hour ago


తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

   2 hours ago


తిరుపతి పార్లమెంట్  ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

   3 hours ago


తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

   5 hours ago


మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

   4 hours ago


hi Prends.. ఎలా ఉన్నారు. ఊరికే చేశా.. స‌రే Prends ఉంటా

hi Prends.. ఎలా ఉన్నారు. ఊరికే చేశా.. స‌రే Prends ఉంటా

   20 minutes ago


స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

   7 hours ago


టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

   20 hours ago


ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

   16-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle