newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఈసారి గోల్కొండ కాదు.. ప్రగతి భవన్‌లో పంద్రాగస్తు వేడుకలు

13-08-202013-08-2020 11:09:42 IST
Updated On 13-08-2020 11:24:15 ISTUpdated On 13-08-20202020-08-13T05:39:42.988Z13-08-2020 2020-08-13T05:39:27.499Z - 2020-08-13T05:54:15.799Z - 13-08-2020

ఈసారి గోల్కొండ కాదు.. ప్రగతి భవన్‌లో పంద్రాగస్తు వేడుకలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్ కారణంగా ప్రముఖంగా జరిగే ప్రభుత్వ కార్యక్రమాలు తీరు కూడా మారుతోంది. తెలంగాణలో ఈసారి పంద్రాగస్టు వేడుకలు గోల్కొండ కోటలో కాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక నివాసమైన ప్రగతి భవన్‌లోనే జరగనున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతి నుంచి కేసీఆర్ గోల్కొండ కోటలో జెండాను ఎగరవేసిన అనంతరం స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనడం ఆనవాయితీగా వస్తోంది. 

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఈసారి వేడుకలను ప్రగతి భవన్‌కే పరిమితం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాల్సిన ది. కాగా, జిల్లా స్థాయిలో మంత్రులు ఈ వేడుకల్లో పాల్గొననున్నారు.రాష్ట్రంలోని 32 జిల్లాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించనున్న ముఖ్య అతిథుల జాబితాను ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ ‌కుమార్‌ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. 

మంత్రులు కొప్పుల ఈశ్వర్‌ (జగిత్యాల), పువ్వాడ అజయ్‌కుమార్‌(ఖమ్మం), గంగుల కమలాకర్‌ (కరీంనగర్‌), వి.శ్రీనివాస్‌గౌడ్‌ (మహబూబ్‌నగర్‌), సత్యవతిరాథోడ్‌ (మహబూబాబాద్‌), తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ (మెదక్‌), చామకూర మల్లారెడ్డి (మేడ్చల్‌ మల్కాజ్‌గిరి), ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి (నిర్మల్‌), వేముల ప్రశాంత్‌రెడ్డి (నిజా మాబాద్‌), ఈటల రాజేందర్‌ (పెద్దపల్లి), కె.తారకరామారావు (రాజన్న సిరిసిల్ల), రంగారెడ్డి (పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి), ఎండీ మహమూద్‌ అలీ (సంగారెడ్డి), టీ హరీశ్‌రావు (సిద్దిపేట), గుంటకండ్ల జగదీష్‌రెడ్డి (సూర్యాపేట), సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి (వనపర్తి), ఎర్రబెల్లి దయాకర్‌రావు (వరంగల్‌ రూరల్‌) జెండా ఆవిష్కరణ చేస్తారు. 

అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి (కామారెడ్డి), డిప్యూటీ స్పీకర్‌ పద్మారావుగౌడ్‌ (వికారాబాద్‌), మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి(నల్లగొండ), మండలి డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌ (నారాయణపేట), చీఫ్‌ విప్‌లు బోడకుంటి వెంకటేశ్వర్లు (జనగామ), దాస్యం వినయభాస్కర్‌ (వరంగల్‌ అర్బన్‌), ప్రభుత్వ విప్‌లు గంప గోవర్దన్‌ (ఆదిలాబాద్‌), రేగల కాంతారావు (భద్రాద్రి కొత్తగూడెం), టీ భానుప్రసాదరావు (జయశంకర్‌భూపాలపల్లి), కె.దామోదర్‌రెడ్డి (జోగులాంబ గద్వాల), అరికెపుడి గాంధీ (కుమ్రంభీం ఆసిఫాబాద్‌), బాల్క సుమన్‌ (మంచిర్యాల), ఎంఎస్‌ ప్రభాకర్‌రావు (ములుగు), గువ్వల బాలరాజు (నాగర్‌కర్నూల్‌), గొంగిడి సునీత (యాదాద్రి భువనగిరి) జిల్లా స్థాయిలో జరిగే స్వాతంత్య్ర దినోత్సవంలో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. స్థానిక ఎమ్మెల్యేలు, మేయర్లు, జడ్పీ చైర్‌పర్సన్లు, డీసీసీబీ/డీసీఎంఎస్‌ చైర్‌పర్సన్లు, మున్సిపల్‌ చైర్‌పర్సన్లు, ఇతర జిల్లాస్థాయి అధికారులు జిల్లాస్థాయిలో జరిగే ఉత్సవాల్లో పాల్గొనాలని ప్రభుత్వం కోరింది.

ఆగస్టు 15వ తేదీ ఉదయం 9.30 గంటలకు వీరంతా తమ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించాలని సూచించింది. మండల స్థాయిలో ఎంపీపీలు, గ్రామస్థాయిలో సర్పంచ్‌లు జాతీయను జెండాను ఆవిష్కరించాలని స్పష్టం చేసింది. కరోనా మమహ్మరి నేపథ్యంలో అందరూ మాస్కులు ధరించడంతో పాటు భౌతికదూరం పాటించాలని, శానిటైజర్లను వినియోగించాలని ఆదేశించింది. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle