facebooktwitteryoutubeinstagram

ముఖ్యమంత్రిగా మీ ఛాయిస్ ఫలితాలు.

{"1":1289,"2":2222,"3":1407}

nara chandrababu naidu
1665
ys jagan mohan reddy
2290
Pawan Kalyan
1423
newssting

Your PM Choice?

{"1":1046,"2":1105,"3":289,"4":33}

Narendra Modi
1060
Rahul Gandhi
1116
Mayawati
299
Mamata Banerjee
38
BITING NEWS :
*రజనీకాంత్ అభిమానులకు శుభవార్త... అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తామని రజనీకాంత్‌ ప్రకటన *రాహుల్‘న్యాయ్’ బ్యానర్లపై ఈసీ సీరియస్.. నోటీసులు జారీ* ఒకే వేదికపై బద్ధ శత్రువులు... ములాయం, మాయావతి *మే తెలంగాణలో పరిషత్ ఎన్నికలకు శనివారం నోటిఫికేషన్.. 6న మొదటి విడత, మే 10న రెండో విడత, మే 14న మూడో విడత పోలింగ్‌ *సాధ్వి ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్ వివాదాస్పద వ్యాఖ్యలు ... తన శాపం వల్లే ఐపీఎస్‌ ఆఫీసర్ హేమంత్‌ కర్కరే మరణించారన్న సాధ్వి ప్రజ్ఞాసింగ్‌ *రాహుల్‌ గాంధీపై బిహార్‌ ఉప ముఖ్యమంత్రి సుశీల్‌ కుమార్‌ మోదీ పరువునష్టం దావా * ముగిసిన రెండో విడత పోలింగ్... 68 శాతం పోలింగ్ నమోదు *హైదరాబాద్ లో ఘనంగా హనుమాన్ శోభాయాత్ర.. భారీగా తరలివచ్చిన భక్తులు

ఈవీఎంల భద్రతపై డేగకన్ను

14-04-201914-04-2019 09:00:50 IST
2019-04-14T03:30:50.960Z14-04-2019 2019-04-14T03:30:47.258Z - - 20-04-2019

ఈవీఎంల భద్రతపై డేగకన్ను
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో పోలింగ్ ముగిసింది. ఓటర్ల తీర్పు ఈవీఎంలలో భద్రంగా ఉంది. కీలకమయిన ఈవీఎంలకు మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు అధికారులు. ఈవీఎంలను వినియోగించినవి, సమస్యలు వచ్చి నిలిపివేసినవి, అసలు వినియోగించనివిగా మూడు విభాగాలుగా విభజించి భద్రపరిచినట్లు సీఈవో పేర్కొన్నారు. తొలి భద్రతా వలయానికి కేంద్ర సాయుధ బలగాలు పహారాగా ఉంటాయి. రెండో దశలో రాష్ట్ర సాయుధ దళం,  ఈ రెండంచెల తరవాత జిల్లా పోలీసులు భద్రతగా ఉంటారు. ఓట్ల లెక్కింపు జరిగే మే 23  వరకు గదుల వద్ద కనీసం ఒక ప్లటూన్‌ భద్రతా దళంతో 24 గంటలూ నిఘా ఉంటుంది.

ఎవరైనా ఆ మూడు దశల భద్రతా వలయాలను దాటి వెళ్లాలనుకుంటే ముందస్తు అనుమతి తప్పనిసరన్నారు. ఆయా వివరాలన్నింటినీ అక్కడ ఏర్పాటు చేసే లాగ్‌ బుక్‌లో నమోదు చేస్తామని సీఈవో రజత్ కుమార్ తెలిపారు. స్ట్రాంగ్‌ రూమ్‌లోని ఈవీఎంలను పరిశీలించాలనుకునే వివిధ పార్టీల ఏజెంట్లు సీసీటీవీల ద్వారా చూసేందుకు అనుమతి ఉంటుందని సీఈవో తెలిపారు.

స్ట్రాంగ్‌ రూమ్‌లకు డబుల్‌ లాక్‌ విధానాన్ని అమలు చేస్తామని.. ఒక తాళం చెవి జిల్లా ఎన్నికల అధికారి వద్ద, మరొకటి నియోజకవర్గ ఎన్నికల అధికారి వద్ద ఉంటుందన్నారు. స్ట్రాంగ్ రూం భద్రతపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదన్నారు రజత్ కుమార్.  జిల్లాల్లోని స్ట్రాంగ్‌ రూమ్‌ల భద్రత, ప్రొటోకాల్‌ వ్యవహారాలను జిల్లా కలెక్టర్‌, ఎస్పీలు చూస్తారన్నారు. ఆ ప్రాంగణంలోకి అధికారులు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధుల వాహనాలకు అనుమతి ఉండదు. 

మరోవైపు ఈవీఎంలు భద్రపరిచిన చోట ఫోటోలు దిగడం నేరమని ఈసీ అధికారులు చెబుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా మేడ్చల్‌ జిల్లా కీసర మండలం బోగారం హోలీమేరి కళాశాలలోని స్ట్రాంగ్‌ రూమ్‌లో భద్రపరిచిన ఈవీవీంలు, వీవీప్యాట్ల వద్ద ఫొటో దిగిన టీఆర్ఎస్ అభ్యర్ధి ఏజెంట్ వెంకటేష్ కీసర పోలీసులు రిమాండ్‌కు తరలించారు. హోలీమేరి కళాశాలలో మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు సెగ్మెంట్ల ఈవీఎంలను భద్రపరిచారు. అక్కడ వెంకటేశ్‌ దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండడంతో అధికారులు చర్యలు తీసుకున్నారు. 

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle