newssting
BITING NEWS :
*గుజరాత్‌: సూరత్‌లో దారుణం.. కార్పొరేషన్ ట్రైనీ ఉద్యోగినులను గుంపులో నగ్నంగా నిలబెట్టి ఫిట్‌నెస్ పరీక్ష *నేడు తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల... ఈ నెల 25న డైరెక్టర్ పదవులకు నామినేషన్లు, 29న ఛైర్మన్, ఉపాధ్యక్ష ఎన్నికలు *అమరావతి: వైఎస్ జగన్‌ సర్కార్‌ మరో కీలక నిర్ణయం.. గత ప్రభుత్వ అక్రమాలపై విచారణకు సిట్ ఏర్పాటు.. ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామ్‌రెడ్డి నేతృత్వంలో 10 మంది సభ్యులతో సిట్ *హైదరాబాద్: బంజారాహిల్స్ లో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు.. విదేశీయుల హల్చల్, పోలీసులతో వాగ్వాదం.. పాస్ పోర్టు, వీసా పత్రాలు చూపకపోవడంతో పోలీసులకు అప్పగింత *అమరావతి: నేడు 29 గ్రామాల్లో బంద్‌కు పిలుపునిచ్చిన రైతుల జేఏసీ.. మందడంలో పోలీసుల లాఠీఛార్జ్‌కి నిరసనగా బంద్, విద్యా, వ్యాపార సంస్థలను బంద్‌ పాటించాలని కోరిన జేఏసీ

ఈరోజే ఎంఐఎం సభ.. మళ్ళీ బీజేపీ విసుర్లు!

25-01-202025-01-2020 10:52:13 IST
Updated On 25-01-2020 12:20:49 ISTUpdated On 25-01-20202020-01-25T05:22:13.114Z25-01-2020 2020-01-25T05:22:10.294Z - 2020-01-25T06:50:49.594Z - 25-01-2020

ఈరోజే ఎంఐఎం సభ.. మళ్ళీ బీజేపీ విసుర్లు!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఈరోజు ఎంఐఎం పార్టీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సిఏఏకి వ్యతిరేకంగా మరో ర్యాలీ, సభ తెలపెడుతుంది. సహజంగానే మరోసారి తెలంగాణ బీజేపీ విసుర్లు మొదలుపెట్టింది. కేంద్రం పౌరసత్వ సవరణ చట్టం తీసుకొచ్చిన తరవాత ఎంఐఎం ఇప్పటికే మూడు కార్యక్రమాలను చేపట్టింది. ర్యాలీలు, సభలు, జెండా వందనాలు అంటూ హైదరాబాద్ నగరం నుండి నిజామాబాద్ వరకు భారీ హంగామా చేసింది.

కేంద్రం చట్టం తీసుకొచ్చిన సమయానికే రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు ఉండడంతో ఎంఐఎం అధికార టీఆర్ఎస్ పార్టీతో కలిసి గేమ్ స్టార్ట్ చేసింది. మైనార్టీల వ్యతిరేకిగా బీజేపీపై ముద్ర వేసేందుకు టీఆర్ఎస్-ఎంఐఎం పార్టీలకి పౌరసత్వ చట్టం రూపంలో ఆయుధం దొరికినట్లయింది. ముందుగా బీజేపీకి పట్టున్నదని భావించే నిజామాబాద్లో ర్యాలీని చేపట్టింది.

అక్కడ నుండి హైదరాబాద్ నగరంలో మరో రెండు ర్యాలీలు, సభలు చేపట్టి ప్రతి ముస్లిం ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసి తాము కూడా భారతీయులమే అంటూ కేంద్రానికి చురకలు వేశారు. అయితే అదంతా అధికార టీఆర్ఎస్ పార్టీ అండతోనే జరిగిందని బీజేపీతో పాటు కాంగ్రెస్ నేతలు విమర్శలు చేశారు. ప్రభుత్వం కూడా ఒక్క ఎంఐఎం పార్టీకి తప్ప మిగతా పార్టీల ర్యాలీలను అనుమతులు ఇచ్చేందుకు నిరాకరించింది.

కాంగ్రెస్ పార్టీ కూడా కేంద్రం తీసుకొచ్చిన చట్టానికి వ్యతిరేకంగానే ర్యాలీ తలపెట్టేందుకు అనుమతి కోరినా ప్రభుత్వం నిరాకరించింది. అదంతా మున్సిపల్ ఎన్నికల ముందు జరిగిపోయిన అంశం కాగా ఈరోజే మున్సిపల్ ఫలితాలు కూడా రానున్నాయి. అయినా ఎంఐఎం మాత్రం మరో ర్యాలీ, సభ సిద్ధమైంది. అయితే ప్రభుత్వం, హైకోర్టులు ర్యాలీని వద్దని సభకు అనుమతులు ఇచ్చేశాయి.

కాగా, శనివారం ఎంఐఎం కార్యక్రమాలకు అనుమతులు ఇవ్వవద్దని శుక్రవారమే బీజేపీ నేతలు మరోసారి హైదరాబాద్‌ ‌నగర పోలీస్‌ ‌కమిషనర్‌ అం‌జనీకుమార్‌కు విజ్ఞప్తి చేశారు. సిఏఏ వ్యతిరేక ర్యాలీ పేరుతో ఎంఐఎం రాష్ట్రంలో మతకలహాలు రెచ్చగొట్టాలని చూస్తున్నదని ఆరోపిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.లక్ష్మణ్‌ ‌నేతృత్వంలోని ప్రతినిధుల బృందం పోలీస్‌ ‌కమిషనర్‌ను కలసి వినతిపత్రం అందజేసింది.

కానీ కోర్టు మాత్రం సభకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడంతో ఎంఐఎం భారీ ఏర్పాట్లు చేసుకుంది. ఎంఐఎం సభ ఏర్పాటుపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. బీజేపీ చేపట్టే నిరసనలు, ర్యాలీలకు అనుమతివ్వని పోలీసులు ఎంఐఎంకు మాత్రం అనుమతులు ఇవ్వడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ ‌రెడ్డి పాల్గొనే కార్యక్రమాలకు కూడా అనుమతులు ఇవ్వకపోవడం దారుణమైన విషయమని మండిపడుతున్నారు.

 

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

   4 hours ago


‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

   5 hours ago


మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

   6 hours ago


బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

   7 hours ago


రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

   8 hours ago


రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

   8 hours ago


ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

   10 hours ago


మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

   10 hours ago


పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

   10 hours ago


కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

   11 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle