newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఈనెల 25న కేసీఆర్, జగన్ భేటీ... జలజగడాలు తీరేనా?

20-08-202020-08-2020 13:18:49 IST
Updated On 20-08-2020 17:02:06 ISTUpdated On 20-08-20202020-08-20T07:48:49.355Z20-08-2020 2020-08-20T07:48:44.735Z - 2020-08-20T11:32:06.626Z - 20-08-2020

ఈనెల 25న కేసీఆర్, జగన్ భేటీ... జలజగడాలు తీరేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య జలజగడాలు కాకరేపుతున్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్, జగన్ భేటీకి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 25న ఇద్దరు ముఖ్యమంత్రులు కేంద్రజలవనరుల శాఖా మంత్రి గజేంద్రసింగ్ షేకావత్ సమక్షంలో సమావేశం కానున్నారు. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ.. రెండు రాష్ట్రాలు, కేంద్ర జలసంఘం ఛైర్మన్, కృష్ణా, గోదావరి బోర్డుల ఛైర్మన్లకు సమాచారం అందించింది. అయితే, ఈ భేటీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరగబోతోంది. 

పోతిరెడ్డిపాడు సహా వివిధ వాటర్ ప్రాజెక్టుల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదం నెలకొంది. దీంతో రెండురాష్ట్రాలు కలిసి కూర్చుని చర్చించుకోవాలని కేంద్రం సూచించింది. ఈనెల 25 ఉదయం 11 గంటల 30 నిమిషాలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో  కృష్ణా, గోదావరి నదులపై రెండు రాష్ట్రాలు తలపెట్టిన ప్రాజెక్టులపై చర్చించే అవకాశం ఉంది. 

జగన్ ఏపీలో అధికారంలోకి వచ్చాక తెలంగాణతో సఖ్యంగానే వున్నారు. ఈమధ్యే జగన్ ప్రభుత్వం కొత్తగా రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు కోసం ఉత్తర్వుల జారీ చేయడంతో మళ్లీ రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు ఊపందుకున్నాయి. కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల సమావేశాల్లోనూ పరస్పరం భిన్న వాదనలు వినిపించాయి. పొరుగు రాష్ట్ర ప్రాజెక్టుల వల్ల తమ ప్రయోజనాలకు భంగం కలుగుతుందని వాదించాయి. రాయలసీమ ఎత్తిపోతలపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు కూడా వెళ్లిన సంగతి తెలిసిందే.

కొత్త ప్రాజెక్టుల పనులు ఆపాలని, ఫిర్యాదులు వచ్చిన ప్రాజెక్టుల పూర్తి ప్రాజెక్ట్ నివేదికలు ఇవ్వాలని రెండు బోర్డులు ఇరు రాష్ట్రాలను కోరాయి. డీపీఆర్‌లను ఇవ్వాలని గతంలోనే పలుమార్లు సూచించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అవి అందడం లేదని బోర్డులు చెప్పాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత జరగుతున్న రెండో అపెక్స్ కమిటీ సమావేశం ఇదే కావడం విశేషం. అపెక్స్ భేటీ మొదటిసారి 2016 సెప్టెంబర్ 21న అప్పటి కేంద్ర మంత్రి ఉమాభారతి అధ్యక్షతన జరిగిన సమావేశంలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. అనేక అంశాలు చర్చకు వచ్చాయి. 

రెండురోజుల క్రితమే పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి కేటాయించిన 9 టీఎంసీలను మించి నీటిని వాడుతున్నారంటూ ఆంధ్రప్రదేశ్‌కు కృష్ణా బోర్డు లేఖ రాసింది. కోటా ముగిసినందున తక్షణమే నీటి విడుదల అపేయాలని అందులో ఆదేశించింది. సోమవారం నాటికి 9.517 టీఎంసీలను ఏపీ వాడుకుందని.. పొరుగు రాష్ట్రం నుంచి ఫిర్యాదులు రాక ముందే .. తన ఆదేశాలను పాటించాలని బోర్డు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రెండురాష్ట్రాలు ఏం చర్చిస్తాయో అని ఆసక్తి నెలకొంది. 

 

కోవిడ్  వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

   2 hours ago


మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

   3 hours ago


గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

   3 hours ago


ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

   4 hours ago


క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

   5 hours ago


క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

   5 hours ago


 సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

   a day ago


ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

   22-04-2021


నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

   22-04-2021


మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

   22-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle