newssting
BITING NEWS :
*అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పర్యటన.. ఘనంగా స్వాగతం..సబర్మతి ఆశ్రమంలో మహాత్మాగాంధీ వినియోగించిన చరఖా తిప్పిన ట్రంప్ పంపతులు *సబర్మతి ఆశ్రమంలో ట్రంప్ దంపతులు... గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ట్రంప్, మోడీ *నేడు విజయనగరం జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన.. జగనన్న వసతి దీవేన కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం*సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు బాంబు బెదిరింపు.. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో పోలీసుల తనిఖీలు.. ప్లాట్ ఫామ్‌లతో పాటు రైళ్లలోనూ క్షుణ్ణంగా తనిఖీ, పేలుడు పదార్థాలు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు *చిత్తూరు జిల్లాలో గుప్త నిధుల తవ్వకాల కలకలం..శ్రీ చౌడేశ్వరి ఆలయం వెనకాల ప్రాంతంలో తవ్వకాలు *ఆదిలాబాద్‌ గుడిహత్నూర్‌లో దారుణం....బాలికపై ఇద్దరు కామాంధుల అత్యాచారం* చైనాలో కొనసాగుతున్న కరోనా మరణమృదంగం....ఇప్పటివరకు 2వేల 460కి చేరిన కొవిడ్-19 మృతుల సంఖ్య*ఒడిశా : పూరీ జిల్లా పిప్పిలి ప్రాంతంలో ఏనుగుల బీభత్సం...ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి.., ఐదుగురికి గాయాలు *గుజరాత్‌లోని వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం..ట్రక్కు- టెంపో ఢీ, 11మంది మృతి *68వ రోజు కొనసాగుతున్న రాజధాని రైతుల ఆందోళన

ఈటల మాటల తూటాలు.. టార్గెట్ కేసీయారేనా?

08-01-202008-01-2020 12:33:11 IST
Updated On 08-01-2020 12:36:25 ISTUpdated On 08-01-20202020-01-08T07:03:11.787Z08-01-2020 2020-01-08T07:02:30.199Z - 2020-01-08T07:06:25.809Z - 08-01-2020

ఈటల మాటల తూటాలు.. టార్గెట్ కేసీయారేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితిలో సీఎం కేసీఆర్ ను ఎదిరించి మాట్లాడే దమ్ము.. అయన మాటను దాటి ముందుకెళ్లే పరిస్థితి గులాబీ పార్టీలో లేదు. ఆ మాటకొస్తే ఆ ఆలోచన కూడా ఎవరికీ రాదు. పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ ఇప్పుడు కేసీఆర్ ను గాడ్ ఫాదర్ గానే చూస్తున్నారు. మరికొందరు మంత్రులైతే కాళేశ్వరం పూర్తి చేసి తెలంగాణ రైతులని తలెత్తుకొనేలా చేస్తున్న మగాడు అంటూ కీర్తిస్తున్నారు.

అయితే, ఒక్క మంత్రి మాత్రం అప్పుడప్పుడు మాటలతోనే సంచలనం రేపుతున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న ఈటెల రాజేందర్ ఇప్పటికే పలుమార్లు సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ మధ్య టీఆర్ఎస్ పార్టీకి అసలైన ఓనర్లం తామే అంటూ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనం అయ్యాయి. ఆ తర్వాత వాటికి సర్దుబాట్లు జరిగిపోయాయి.

ఇక గత వారం అయితే పార్టీలో కొందరు తనను ఓడించడానికి ప్రయతించి విఫలమయ్యారని మరోసారి సంచలనం అయ్యారు. తన నియోజకవర్గంలో ఎన్నికల సమయంలో ఓ వర్గం తన ఓటమి కోసమే పనిచేసిందని.. ప్రజలు కూడా పొరపడి ఉంటే తానూ గెలిచేవాడినే కాదని.. వెన్నుపోటు పొడిచిన వాళ్ళు ఊరికే పోరని.. అన్నిటికీ ఆ దేవుడే ఉన్నదంటూ శాపనార్ధాలు కూడా పెట్టారు.

ఇక ఇప్పుడు మరోసారి మాటల తూటాలు పేల్చారు. అది కూడా ఏకంగా సీఎం కేసీఆర్ కి సూటిగా పెంచిన ఈ తూటాలు ఇప్పుడు రాష్ట్రంలో మరోసారి సంచలన అయ్యాయి. సంగారెడ్డి జిల్లాలో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో ఈటెల యూనియ‌న్ల గురించి మాట్లాడి సీఎం కేసీఆర్ కి విరుద్ధంగా మాట్లాడారు. యూనియ‌న్లు ఉండాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌నీ, కొన్ని వ‌ర్గాల ప‌ట్ల చిన్న‌చూపు అణ‌చివేత ధోర‌ణి ఇప్ప‌టికీ కొన‌సాగుతోంద‌న్నారు.

అంతేకాదు, యూనియ‌న్ల‌తో ప‌నేముంద‌ని కొంత‌మంది మాట్లాడుతున్నార‌నీ, అన్నీ ఉన్నోడికి వాటితో ప‌నిలేద‌నీ, అణ‌చివేత‌కు గురౌతున్న‌వారికి యూనియ‌న్లు అవ‌స‌ర‌మ‌న్నారు. అన్ని రంగాల్లో కొంత‌మంది మీద వివ‌క్ష ఉంద‌నీ, అలాంటివారి హ‌క్కుల్ని కాపాడాల్సి ఉంద‌న్నారు. విలువ‌ల గురించి మాట్లాడుతున్న‌వారే, వాటిని తీసేలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్నారు.

పీఎంలు, సీఎంలు మారుతున్నా అణ‌గారిన వ‌ర్గాల‌కు రాజ్యాంగం అందించిన ఫ‌లాలు ద‌క్క‌డం లేద‌ని.. అణ‌గారిన వ‌ర్గాలు ఉన్నంత‌కాలం రిజ‌ర్వేష‌న్లు ఉండాల‌ని.. పోరాడితే త‌ప్ప హ‌క్కులు ద‌క్క‌వ‌ని చ‌రిత్ర చెబుతుంద‌న్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి పార్టీలో తీవ్ర చర్చకు దారితీసింది. సీఎం కేసీఆర్ యూనియన్లను వ్యతిరేకించారు. ఆర్టీసీ సమ్మె సమయంలో అయితే యూనియన్లపై అంతెత్తున లేచారు.

దిక్కుమాలిన యూనియన్ల వలనే కార్మికులు, ఉద్యోగులు చెడిపోతున్నారని.. యూనియన్లు లేని వ్యవస్థ కావాలన్నారు. అంతేకాదు, ఇకపై ఆర్టీసీలోనే కాదు దాదాపు అన్ని రంగాలలో ఈ యూనియన్ల వ్యవస్థను రూపుమాపేలా చర్యలు తీసుకుంటామని కూడా వెల్లడించారు. మరి ఈటెల అందుకు విరుద్ధంగా.. అన్ని ఉన్నోడికి వాటితో పనిలేదు కానీ అణచివేసే కార్మికులకి కావాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి ఈ వ్యాఖ్యలు ఎలా దారితీస్తాయో.. పార్టీలో ఎలాంటి పరిస్థితిలు వస్తాయో చూడాల్సిఉంది.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle