newssting
BITING NEWS :
*గుజరాత్‌: సూరత్‌లో దారుణం.. కార్పొరేషన్ ట్రైనీ ఉద్యోగినులను గుంపులో నగ్నంగా నిలబెట్టి ఫిట్‌నెస్ పరీక్ష *నేడు తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల... ఈ నెల 25న డైరెక్టర్ పదవులకు నామినేషన్లు, 29న ఛైర్మన్, ఉపాధ్యక్ష ఎన్నికలు *అమరావతి: వైఎస్ జగన్‌ సర్కార్‌ మరో కీలక నిర్ణయం.. గత ప్రభుత్వ అక్రమాలపై విచారణకు సిట్ ఏర్పాటు.. ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామ్‌రెడ్డి నేతృత్వంలో 10 మంది సభ్యులతో సిట్ *హైదరాబాద్: బంజారాహిల్స్ లో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు.. విదేశీయుల హల్చల్, పోలీసులతో వాగ్వాదం.. పాస్ పోర్టు, వీసా పత్రాలు చూపకపోవడంతో పోలీసులకు అప్పగింత *అమరావతి: నేడు 29 గ్రామాల్లో బంద్‌కు పిలుపునిచ్చిన రైతుల జేఏసీ.. మందడంలో పోలీసుల లాఠీఛార్జ్‌కి నిరసనగా బంద్, విద్యా, వ్యాపార సంస్థలను బంద్‌ పాటించాలని కోరిన జేఏసీ

ఈటల అంత క్లోజ్ అయ్యారా..? అధినేత ప్లానేంటి?

31-12-201931-12-2019 17:11:29 IST
Updated On 31-12-2019 17:53:26 ISTUpdated On 31-12-20192019-12-31T11:41:29.863Z31-12-2019 2019-12-31T11:41:28.066Z - 2019-12-31T12:23:26.173Z - 31-12-2019

ఈటల అంత క్లోజ్ అయ్యారా..? అధినేత ప్లానేంటి?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ రాజ‌కీయంగా మంచి వ్యూహ‌క‌ర్త‌. ఎప్పుడు ఎవ‌రిని క‌లుపుకోవాలో, ఎవ‌రిని ప‌క్క‌న‌పెట్టాలో, ఎప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకుంటే రాజ‌కీయంగా క‌లిసి వ‌స‌క్తుందో ఆయ‌న‌కు బాగా తెలుసు. తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపించిన నాటి నుంచి కేసీఆర్‌కు స‌న్నిహితంగా మెలిగిన వారిలో చాలా మందిని కేసీఆర్ ప‌క్కన పెట్టారు. అలానే కొంద‌రిని అంద‌లం ఎక్కించారు.

ముందునుంచీ కేసీఆర్ వెన్నంటే ఉన్న మాజీ మంత్రులు విజ‌య‌రామారావు, ఏ.చంద్ర‌శేఖ‌ర్‌, సీనియ‌ర్ నేత‌లు ర‌వీంద‌ర్‌నాయ‌క్‌, జిట్టా బాల‌కృష్ణారెడ్డి లాంటి వారు ఇప్పుడు టీఆర్ఎస్‌ను వీడారు. నిత్యం వారు కేసీఆర్‌పై ఆరోప‌ణ‌లు గుప్పిస్తుంటారు. ఇదే స‌మ‌యంలో పార్టీ స్థాపించిన నాటి నుంచి త‌న‌కు అండ‌గా నిలిచిన కెప్టెన్ ల‌క్ష్మీకాంత‌రావు, బోయిన‌ప‌ల్లి వినోద్ కుమార్ లాంటి వారికి కేసీఆర్ త‌గు గౌర‌వం ఇస్తున్నారు.

అయితే, ఇటీవ‌ల టీఆర్ఎస్ సీనియ‌ర్ నేత‌, మంత్రి ఈటెల రాజేంద‌ర్ కూడా కేసీఆర్‌కు దూర‌మ‌వుతున్నారా అనే అనుమానాలు వ్య‌క్త‌మ‌య్యాయి. కొన్ని రోజుల క్రితం ముఖ్య‌మంత్రి స‌మావేశ వివ‌రాల‌ను బ‌య‌ట‌కు వెల్ల‌డించారని, ఆయ‌న‌పై ముఖ్య‌మంత్రి ఆగ్ర‌హంగా ఉన్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి.

ఒకే రోజు రెండు ప‌త్రిక‌ల్లో ఒకే ర‌క‌మైన వార్తలు రావ‌డంతో ఈటెల రాజేంద‌ర్‌కు ఎర్త్ పెట్టే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌నే ప్ర‌చారం జ‌రిగింది. దీంతో ఆయ‌న‌కు బీసీ సంఘాలు పెద్ద ఎత్తున మ‌ద్ద‌తు ఇచ్చాయి. ఈటెల రాజేంద‌ర్‌పై కుట్ర జ‌రుగుతోంద‌ని అప్ప‌ట్లో ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఇందుకు త‌గ్గ‌ట్లుగానే ఈటెల రాజేంద‌ర్ కూడా గులాబీ జెండాకు తాము ఓన‌ర్లం అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

దీంతో ఒక్కసారిగా పార్టీలో క‌ల‌క‌లం రేగింది. ఒక ద‌శ‌లో ఈటెల టీఆర్ఎస్ నుంచి బ‌య‌ట‌కు వెళ‌తారా అనే అనుమానాలు కూడా వ‌చ్చాయి. మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో ఆయ‌న‌ను మంత్రి ప‌ద‌వి నుంచి తొల‌గించ‌డం ఖాయ‌మ‌న్నారు.

కానీ, కేసీఆర్ మాత్రం ఆయ‌న‌ను మంత్రిప‌ద‌విలో కొనసాగిస్తున్నారు. అంతేకాదు, గ‌తంలో లాగానే ఈటెల రాజేంద‌ర్ ప‌ట్ల ఆయ‌న ఆప్యాయ‌త చూపిస్తున్నారు. తాజాగా వేములవాడుకు వెళుతున్న స‌మ‌యంలో కేసీఆర్ త‌న‌తో పాటు బ‌స్సులో ఈటెల రాజేంద‌ర్ కుటుంబాన్ని తీసుకెళ్లారు. మేడ్చ‌ల్‌లోని ఈటెల ఇంటి వ‌ద్ద ఆగి మ‌రీ వారి కుటుంబ‌స‌భ్యుల‌ను వేముల‌వాడకు తీసుకెళ్లారు. ఈ సంఘ‌ట‌న‌తో ఒక్క‌సారిగా రాజ‌కీయ‌వ‌ర్గాలు ఆశ్చ‌ర్య‌పోయాయి.

నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు పార్టీ పెద్ద‌ల‌తో ఈటెల‌కు పొస‌గ‌డం లేద‌ని, ఈటెల‌ను ఏ క్ష‌ణ‌మైనా ప‌క్క‌న‌పెట్టేసే ఛాన్స్ ఉంద‌ని భావించిన వారంతా షాక్ తిన్నారు. సీనియ‌ర్ నేత‌గా ఆది నుంచీ త‌న వెన్నంటే ఉన్న ఈటెలను దూరం చేసుకోవ‌డానికి కేసీఆర్ ఇష్ట‌ప‌డ‌నట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఒక‌వేళ ఈటెల నిజంగానే టీఆర్ఎస్‌కు దూర‌మైతే ఆ ప్ర‌భావం పార్టీపైన ఎక్కువ‌గానే ప‌డేది.

 

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

   4 hours ago


‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

   5 hours ago


మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

   6 hours ago


బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

   7 hours ago


రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

   8 hours ago


రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

   8 hours ago


ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

   10 hours ago


మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

   10 hours ago


పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

   10 hours ago


కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

   11 hours ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle