newssting
BITING NEWS :
*విషమంగానే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ఆరోగ్యం.. వెంటిలేటర్ పై చికిత్స *వనపర్తి జిల్లా నాగపూర్ లో విషాదం ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య *హైద‌రాబాద్‌: పంచాయతీ,మండల, జిల్లాప్రజా పరిషత్‌లకు 15వ ఆర్థిక సంఘం నిధుల పునరుద్ధరణ.. ఆరేళ్ల క్రితం నిలిపివేసిన ఆర్థికసంఘం.. ఈ ఏడాదికి రూ.1,847 కోట్ల నిధుల మంజూరు*ఢిల్లీ: ప్ర‌శాంత్ భూష‌ణ్ కోర్టు ధిక్క‌ర‌ణ సుమోటో కేసులో సుప్రీంకోర్టు తీర్పు... ప్ర‌శాంత్ భూష‌ణ్‌ను దోషిగా తేల్చిన జ‌స్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం.. శిక్ష‌పై ఈ నెల 20న వాద‌న‌లు వింటాం-సుప్రీం*హైద‌రాబాద్‌: కోవిడ్ కి ఉచిత చికిత్స చేయాలి.. కరోనాతో ఆదాయ మార్గం పోయింది కాబట్టి పేదలకు ఆరు నెలల పాటు రూ. 7500 చొప్పున‌ ఇవ్వాలి-ప్రొఫెస‌ర్ కోదండరాం*భార‌త్‌లో రికార్డు స్థాయిలో పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు.. గడచిన 24 గంటల్లో 64,553 కరోనా కేసులు నమోదు, 1007 మంది మృతి.. 24,61,191కు చేరుకున్న క‌రోనా పాజిటివ్ కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 48,040 మంది మృతి*తెలంగాణ‌లో 1921 పాజిటివ్ కేసులు నమోదు, 9 మంది మృతి.. 88396కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్పటి వరకు 674 మంది మృతి

ఈచ్ వన్.. టీచ్ వన్.. సీఎం కేసీఆర్ సరికొత్త సవాల్!

02-01-202002-01-2020 10:02:44 IST
Updated On 02-01-2020 14:33:30 ISTUpdated On 02-01-20202020-01-02T04:32:44.813Z02-01-2020 2020-01-02T04:32:36.840Z - 2020-01-02T09:03:30.309Z - 02-01-2020

ఈచ్ వన్.. టీచ్ వన్.. సీఎం కేసీఆర్ సరికొత్త సవాల్!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కొత్త ఏడాది వస్తే ఏమవుతుంది.. మహా అయితే కొత్త క్యాలెండర్ వస్తుంది.. ఏడాది మారుతుంది అనుకుంటారు చాలామంది. కానీ వచ్చే ప్రతి ఏడాదిని మార్పు కోసం వచ్చిన ఒక అవకాశంగా మార్చుకొని ముందుకు వెళ్లాలన్నది మేధావుల అభిప్రాయం. గడిచిన ఏడాదిలో చేసిన తప్పులను కొత్త ఏడాదిలో సరిదిద్దుకొని.. ఆ సంవత్సరంతో పాటే చెడుని వదిలేసి మంచి కోసం దారులు వెతికేందుకు ముందడుగు వేస్తే మారిన ఏడాదికి నిజమైన అర్ధం.

ఇలానే ఏడాది మారేకొద్దీ కొంతమంది కొత్త ఏడాదికి ఏదో ఒకటి సాధించాలనే తపనతో స్వాగతం చెప్తారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా అలాంటి ఓ సవాల్ తోనే కొత్త ఏడాదిని మొదలు పెట్టాలని ప్రకటించారు. అదే ఈచ్ వన్ టీచ్ వన్. తెలంగాణను వంద శాతం అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా నూతన సంవత్సర ప్రారంభంలో ప్రతిజ్ఞ తీసుకోవాలని పిలుపు ఇచ్చారు.

ఆయన ప్రకటించిన ‘ఈచ్ వన్ - టీచ్ వన్'’ నినాదం అందుకుని.. చదువుకున్న ప్రతి ఒక్కరూ నిరక్షరాస్యుడైన మరొకరిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. తద్వారా తెలంగాణను సంపూర్ణ అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా చేయాలన్నది సీఎం సంకల్పం. ఈ ప్రకటన చేసేప్పుడు సీఎం కేసీఆర్ మరికొన్ని వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ఆరేళ్ళ కాలంలో తెలంగాణ అభివృద్ధి, సంక్షేమం, రైతాంగంలో ఎంత ముందుకు వెళ్ళామో.. అక్షరాస్యతలో అడుగు ముందుకు పడడం లేదని.. అందుకే ఇకపై ఈచ్ వన్ టీచ్ వన్ నినాదంతో ముందుకు వెళ్లాలని కేసీఆర్ సంకల్పించారు. కాగా, సీఎం నినాదం అయితే గొప్పగానే ఉంది. మరి ఆచరణలో ఎంతవరకు సక్సెస్ అవుతారన్నదే ఆసక్తిగా మారింది.

రాష్ట్రంలో ఇప్పటికీ గిరిజన తండాలు.. గూడేలలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా పరిస్థితి ఉంది. అంతెందుకు ఉదాహరణకు హైదరాబాద్ మహానగరానికి పక్కనే ఉన్న వికారాబాద్, తాండూర్, నల్గొండ జిల్లాలో కొంత భాగం కూడా ఈ నిరక్ష్యరాస్యత తిష్ట వేసి కూర్చొని ఉంది. ఈ జాడ నుండి ప్రజలను బయటకి తీసుకురావడం నిజంగా సవాల్ తో కూడుకున్నదే.

ముందుగా నిరక్ష్యరాస్యతను రూపుమాపాలంటే ప్రభుత్వం చర్యలు తీసుకొనే ముందు అందుకు గల కారణాలను అన్వేషించాలి. ఇక్కడ అక్షరాస్యతకు గల ముఖ్య కారణాలలో ఉపాధి లేకపోవడంగా చెప్పుకోవాలి. తల్లిదండ్రులకు సరైన ఉపాధి లేకపోవడంతో పిల్లలను వాళ్ళతో పనిలో పెట్టడం.. ముస్లిం మైనార్టీ వర్గాలలో విద్యపై అవగాహనా లేకపోవడం వంటి సాంకేతిక కారణాలు కూడా ఉన్నాయి. మరి ప్రభుత్వం వీటిని అధిగమించి నినాదాన్ని సార్ధకం చేసుకుంటుందా? లేక ప్రకటనలకే పరిమితమవుతుందా? చూడాల్సి ఉంది.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle