newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఇవాళ్టినుంచే ఆన్ లైన్ తరగతులు

01-09-202001-09-2020 09:33:49 IST
Updated On 01-09-2020 10:03:54 ISTUpdated On 01-09-20202020-09-01T04:03:49.373Z01-09-2020 2020-09-01T04:03:38.717Z - 2020-09-01T04:33:54.539Z - 01-09-2020

ఇవాళ్టినుంచే ఆన్ లైన్ తరగతులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్ కారణంగా ఈఏడాది విద్యాసంవత్సరం ముగిసిపోయింది. పదవ తరగతికి పరీక్షలు లేవు. పిల్లలు పరీక్షలు రాయకుండానే ఇతర తరగతులకు ప్రమోట్ అయిపోయారు. విద్యార్ధులు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు వెతికింది. విద్యార్థులకు ఆన్‌లైన్‌ పద్ధతిలో పాఠాలు బోధించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇవాళ్టి నుంచి తెలంగాణలో ఆన్‌లైన్‌ ద్వారా విద్యార్థులకు స్కూల్‌ పాఠాలు బోధించనున్నారు. టీశాట్‌, ఆన్‌లైన్‌ ద్వారా ఈ విద్యాబోధన కార్యక్రమం జరగనుంది. 

ఆన్ లైన్ తరగతుల కోసం ఇప్పటికే జూబ్లీహిల్స్‌ టీ శాట్‌ టీవీ స్టూడియోలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా టీ శాట్‌ సీఈఓ శైలేష్‌ రెడ్డి మాట్లాడుతూ సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 10 తరగతిలోపు విద్యార్థులకు ఆన్‌లైన్‌, టీవీల ద్వారా పాఠాలు బోధిస్తామని వెల్లడించారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. అన్ని సర్వీస్ ప్రొవైడర్లకు ప్రభుత్వం ఆదేశించిందని తెలిపారు. విద్యార్థులు డిజిటల్‌ విధానంలో పాఠాలు నేర్చుకునేందుకు వీలుగా షెడ్యూల్‌ రూపొందించామన్నారు.

15 రోజులకు సంబంధించిన టైం టేబుల్‌ను ముందుగానే ఫిక్స్ చేశామన్నారు. షెడ్యూల్ టైమ్‌ వివరాలను వెబ్ సైట్ , యూట్యూబ్‌లో పెడుతున్నామని అన్నారు. మిస్ అయిన క్లాసులను కూడా టి శాట్ యూట్యూబ్, వెబ్‌సైట్‌‌లో మళ్ళీ చూడొచ్చని తెలిపారు. భవిష్యత్ మొత్తం ఆన్‌లైన్‌పై ఆధారపడిన నేపథ్యంలో పిల్లలకు ఇప్పుడే అవగాహన రావడం మంచి పరిణామమేనని పేర్కొన్నారు.

ఇక విద్యార్థుల సందేహాలు నివృత్తి చేయడానికి పాఠాలను సాయంత్రం వేళల్లో తిరిగి ప్రసారం చేస్తామని తెలిపారు. ఎక్కడ ఇబ్బందులు అనేవి ఉండవని, పవర్ కట్ ప్రాంతాల్లో మళ్ళీ పాఠ్యంశాలను తిరిగి ప్రసారం చేస్తామని, ప్రభుత్వం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ప్రసారాలు ఉంటాయని తెలిపారు.

విద్యార్ధులు ఆన్ లైన్ తరగతులు వింటూ తమ విద్యాసంవత్సరం కొంతకాలం కొనసాగించవచ్చన్నారు. అన్ లాక్ నిబంధనల్లో భాగంగా కేంద్రం ఈనెలాఖరు వరకూ స్కూల్స్ తెరవడానికి అవకాశం లేదని పేర్కొన్న సంగతి తెలిసిందే. 

 

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   13 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   9 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   11 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   16 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   18 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   19 hours ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   09-04-2021


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle