newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఇవాళే మునిసిపల్ ఫలితాలు..ఎన్నికల సంఘం ఏర్పాట్లు

25-01-202025-01-2020 08:12:34 IST
2020-01-25T02:42:34.381Z25-01-2020 2020-01-25T02:37:10.321Z - - 16-04-2021

ఇవాళే మునిసిపల్ ఫలితాలు..ఎన్నికల సంఘం ఏర్పాట్లు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇటీవల జరిగిన తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై అన్ని పార్టీల్లో ఉత్కంఠ ఏర్పడింది. అధికార టీఆర్ఎస్ పార్టీకి తిరుగులేదంటూ ఆ పార్టీ నేతలు ధీమాగా వుంటే. కారు జోరుకు కాంగ్రెస్ బ్రేకులు వేస్తుందని ఆపార్టీ నేతలు భావిస్తున్నారు. బీజేపీ కూడా నేను సైతం అంటోంది. 

గెలుపుపై అన్ని పార్టీలు ధీమాగా వున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై సీపీఎస్ సర్వే చేసింది.  అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే మున్సిపల్ ఎన్నికల్లో కారు జోరే కొనసాగుతోందని వెల్లడించింది. టీఆర్ఎస్ దూకుడు ఇతర పార్టీలు ఆపలేకపోయాయని సర్వే చెబుతోంది. 

తెలంగాణ ఏర్పాటయ్యాక తొలిసారి రాష్ట్ర వ్యాప్తంగా 120 మున్సిపాలిటీల్లో 104-109 స్థానాల్లో టీఆర్ఎస్ గెలిచే అవకాశముందని సీపీఎస్ సర్వే అభిప్రాయపడింది. కాంగ్రెస్‌కు 0-4, బీజేపీకి 0-2, ఎంఐఎంకు 1-2 స్థానాలు రావొచ్చని తెలిపింది. 7-10 మున్సిపాలిటీల్లో హోరాహోరీ ఫలితాలు ఉండవచ్చని పేర్కొంది. ఇదిలా వుంటే.. 120 మున్సిపాలిటీలు, 9 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో శనివారం కౌంటింగ్ ప్రారంభమయింది. ఈ మేరకు ఈసీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది.

కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు పటిష్ట భద్రత ఏర్పాటుచేసింది. మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లతో పాటు మార్గదర్శకాలను ఈసీ వెల్లడించింది. ఇవాళ సాయంత్రం వరకు అన్ని మున్సిపాలిటీల ఫలితాలు వస్తాయన్నారు సీఈసీ నాగిరెడ్డి. ఫలితాలు విడుదల చేసేంతవరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని అతిక్రమిస్తే చర్యలు తప్పవన్నారు.

9 కార్పొరేషన్లలో 325 డివిజన్లు, 120 మున్సిపాలిటీల్లో 2,727 కౌన్సిలర్ల స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. కార్పొరేషన్లలో ఒక డివిజన్‌, మున్సిపాలిటీల్లో 80 వార్డులు ఏకగ్రీవం కాగా 324 డివిజన్లు, 2,647 వార్డులకు అధికారులు పోలింగ్‌ను నిర్వహించారు. ఈసారి మునిసిపల్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిఘా వున్నా మునిసిపాలిటీలలో మద్యం, డబ్బు ప్రధాన పాత్ర పోషించాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ నేతలు పోటీపడ్డారు. ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ టీఆర్ఎస్ కాంగ్రెస్-బీజేపీ మధ్యే వుంది. 

రాజకీయ పార్టీలు మేయర్, చైర్మన్ల పేర్లను ఏ-ఫారం, బీ-ఫారం రూపంలో ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. ఈ నెల 26న 11 గంటల వరకు ఏ-ఫారం, 27న ఉదయం 10 గంటల వరకు బీ-ఫారం సమర్పించాచేందుకు గడువిచ్చింది. 

రాజకీయ పార్టీలు తమ విప్‌లను నియమించుకోవచ్చని... విప్ ఎవరన్నది పార్టీలు 26న ఉదయం 11 గంటల వరకు ఇవ్వాలి. విప్ జారీ వివరాలను 27న ఉదయం 11.30 వరకు ఇవ్వాలి.  కరీంనగర్‌ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక జనవరి 29న చేపడతారు. ఆయా మునిసిపల్ ఏరియాలో ఎక్స్ ఆఫీషియో సభ్యులు ఎక్కడ ఓటు వేయాలనుకుంటారో రేపటిలోగా వారి ఆప్షన్‌ను సంబంధిత మున్సిపల్ కమిషనర్‌కు తెలియజేయాలని అధికారులు సూచించారు. 

 

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

   11 hours ago


లొంగిపోయిన కూన రవికుమార్

లొంగిపోయిన కూన రవికుమార్

   7 hours ago


రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

   9 hours ago


షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

   12 hours ago


తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

   14 hours ago


ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

   16 hours ago


బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

   17 hours ago


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

   18 hours ago


భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

   19 hours ago


ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

   20 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle