newssting
BITING NEWS :
*కరోనా కట్టడిలో అన్ని వర్గాల కృషిని ప్రశంసించిన ప్రధాని మోడీ. మన్ కీ బాత్ లో పలు అంశాలను ప్రస్తావించిన మోడీ ఆత్మనిర్భర భారత్ ద్వారా ఆర్థికవ్యవస్థకు ఊతం *తెలంగాణలో పెరుగుతున్న కేసులు.. కొత్తగా 74, మరణాలు 77, మొత్తం కేసులు 2499 * జూన్ 30 వరకూ ఐదవ విడత లాక్ డౌన్.. పలు సడలింపులు *దేశ వ్యాప్తంగా జూన్ 30 వరకు లాక్ డౌన్ పొడిగింపు..కొత్త మార్గదర్శకాలు రిలీజ్ చేసిన కేంద్రం..ఈ సారి లాక్ డౌన్ లో మరిన్ని సడలింపులు..కేవలం కంటైన్మెంట్ జోన్లకే లాక్ డౌన్ పరిమితం*మాల్స్, రెస్టారెంట్లు జూన్ 8 వ తేదీ నుంచి పునఃప్రారంభం..కర్ఫ్యూ సమయం కుదింపు..దేశ వ్యాప్తంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ*ఆదివారం మన్ కీ బాత్ లో పలు వివరాలు వెల్లడించనున్న ప్రధాని మోడీ * మాల్స్, రెస్టారెంట్ల, దేవాలయాలు, చర్చిలు జూన్ 8 నుంచి ప్రారంభం *పాఠశాలలు, కాలేజీలు, విద్యాసంస్థలు ప్రారంభంపై రాష్ట్రాలకు నిర్ణయాధికారం *విద్యాసంస్థల ప్రారంభంపై జూలైలో నిర్ణయం*నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామక ఉత్తర్వులు వెనక్కి *ఏపీలో మొత్తం కేసులు 3461

ఇలా అయితే కరోనా గ్యారంటీ.. మంత్రుల ముందే హడావిడి

22-05-202022-05-2020 11:00:34 IST
Updated On 22-05-2020 11:23:47 ISTUpdated On 22-05-20202020-05-22T05:30:34.775Z22-05-2020 2020-05-22T05:29:15.864Z - 2020-05-22T05:53:47.770Z - 22-05-2020

ఇలా అయితే కరోనా గ్యారంటీ.. మంత్రుల ముందే హడావిడి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో కరోనా వీరవిహారం చేస్తూనే వుంది. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు 1699కి చేరాయి.  రాష్ట్రంలో గురువారం ఒక్కరోజే కరోనాతో ఐదుగురు మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు ఈ వైరస్‌ కారణంగా చనిపోయినవారి సంఖ్య 45కి చేరింది. కొత్తగా 38 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గురువారం 23 మంది కోలుకోగా, ఇప్పటివరకు 1036 మంది డిశ్చార్జి అయ్యారని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం 618 మంది చికిత్స పొందుతున్నారని తెలిపారు.

14 రోజులుగా కేసులు నమోదుకాని జిల్లాలు 25 ఉన్నాయన్నారు. కాగా, హైదరాబాద్‌లోని ఓల్డ్‌ మలక్‌పేట శంకర్‌నగర్‌లో ఒకే కుటుంబంలోని ఏడుగురికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో వారిని గాంధీ ఆస్పత్రికి తరలించారు.  మరోవైపు గాంధీ ఆస్పత్రిలో వార్డు బాయ్‌గా విధులు నిర్వహిస్తున్న ఓ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగికి కరోనా పాజిటివ్‌ బారిన పడ్డాడు.

ర్యాపిడ్‌ కిట్స్‌ మీద నమ్మకం లేదని మొదటి నుంచి చెబుతున్నామని, ఇప్పుడు ఐసీఎంఆర్‌ కూడా అదే చెప్పిందని మంత్రి ఈటల అన్నారు. తెలంగాణలో కరోనా ఏదో ఒక రూపంలో వచ్చిపడుతూనే వుంది.  ఒక వ్యక్తి కి పాజిటివ్‌ అనితేలితే వారి కుటుంబ సభ్యులు, పాజిటివ్‌ వ్యక్తిని కలిసిన వారందరినీ ట్రేస్‌ చేసి తీసుకువచ్చి పరీక్షలు చేయిస్తున్నామని పేర్కొన్నారు. అవసరమైతే క్వారంటైన్‌ చేస్తున్నామని, ఇవన్నీ ప్రైవేట్‌ వ్యక్తులు చేయగలరా అని ప్రశ్నించారు.

నిత్యం కేసులు బయటపడుతూనే వున్నాయి. అయితే నేతలు మాత్రం ఈ పరిస్థితిని సీరియస్ గా తీసుకోవడం లేదనిపిస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, మునిసిపల్, కార్పొరేషన్ ప్రజాప్రతినిధులు విందు, వినోదాలకు సామూహికంగా హాజరవుతున్నారు. అసలే కరోనా కాలం .. జనాలు ఇళ్ళనుండి బయటికి రావాలంటేనే భయపడుతున్నారు . మన చుట్టుపక్కల వ్యక్తులకు కరోనా ఉన్నా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు.

ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని సూచనలు పాటించాలని హెచ్చరిస్తూనే వుంది . కానీ తాజాగా జవహర్ నగర్ లో జరిగిన సంఘటనను చూస్తే మాత్రం ఇందుకు పూర్తి భిన్నం గా కనిపిస్తుంది . పైగా అదంతా వైద్య శాఖ మంత్రి ఆధ్వర్యంలో జరగటం మరింత ఆశ్చర్యాన్ని కలిగించకమానదు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జవహర్ నగర్ పరిధిలో విప్రో ట్రస్ట్ నిత్యావసర వస్తువుల పంపిణీ చేసింది . దీనికి ముఖ్య అతిధులుగా మంత్రి మల్లారెడ్డి , మంత్రి ఈటెల రాజేందర్ వచ్చారు.

నిత్యావసరాలు పంపిణి చేస్తున్న సమయంలో దాదాపు 2000 మంది వరకు సామాజిక దూరం పాటించకుండా ఒకరినొకరు నెట్టుకున్నారు. తోపులాడుకోవటం కనిపించింది. కనీస జాగ్రత్తలు చెప్పాల్సిన మంత్రి చూస్తూ ఉండిపోవటం , ఇదంతా ఈటెల ఆధ్వర్యంలోనే జరగటం శోచనీయం గా మారింది. కనీసం మంత్రి అనుచరులు  స్థానిక నాయకుల హడావుడి తో ఇది ఇంకాస్త గందరగోళ గా మారింది. ఇలాంటి కార్యక్రమాలు, ఇంతమందితో జరిపితే కరోనా రాకుండా ఎలా ఉంటుంది. 

సీఎం కెసిఆర్ పిలుపు మేరకు వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామని వారీ సందర్భంగా చెప్పారు. సొంత ఊర్లకు వెడతామన్న వారిని ప్రత్యేక రైల్ లు ,బస్ లు ఏర్పాటు చేసి ఉచితంగా పంపించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని ఏర్పాట్లూ చేశారని, ఇక్కడ ఉన్న వారందరినీ ఆదుకుంటామని వారు చెప్పారు. వలస కార్మికులు   అభివృద్ధి లో భాగస్వామ్యులు అని ప్రకటించిన రాష్ట్రం తెలంగాణ  అని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.

మరోవైపు పోలీసు శాఖలో తొలి కరోనా మరణం చోటుచేసుకోవడంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. కరోనా బారినపడిన కొందరు పోలీసులు చికిత్స అనంతరం కోలుకోగా కుల్సుంపురా పోలీసు కానిస్టేబుల్‌ 33 ఏళ్ళ దయాకర్‌రెడ్డి చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందాడు. దీంతో పోలీసు శాఖలో ఒక్కసారిగా ఆందోళన మొదలైంది. 

తెలంగాణలో కంటైన్మెంట్ జోన్లలోనే లాక్‌డౌన్ ... అక్కడ షరతులు వర్తిస్తాయ్!

తెలంగాణలో కంటైన్మెంట్ జోన్లలోనే లాక్‌డౌన్ ... అక్కడ షరతులు వర్తిస్తాయ్!

   7 hours ago


తెలంగాణలో కరోనా విజృంభణ.. ఒకేరోజు 6 గురు మృతి!

తెలంగాణలో కరోనా విజృంభణ.. ఒకేరోజు 6 గురు మృతి!

   12 hours ago


భక్తులకు శుభవార్త.. జూన్ 8 నుంచి తిరుమలలో దర్శనాలు

భక్తులకు శుభవార్త.. జూన్ 8 నుంచి తిరుమలలో దర్శనాలు

   15 hours ago


మోడీ మన్ కీ బాత్.. కరోనాపై యుద్ధానికి కొత్త దారులు వెతుకుదాం

మోడీ మన్ కీ బాత్.. కరోనాపై యుద్ధానికి కొత్త దారులు వెతుకుదాం

   15 hours ago


నిమ్మగడ్డ  ఎపిసోడ్‌లో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు

నిమ్మగడ్డ ఎపిసోడ్‌లో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు

   15 hours ago


మోడీ సరే.. మరి తెలంగాణ సీఎం వైఖరేంటో?

మోడీ సరే.. మరి తెలంగాణ సీఎం వైఖరేంటో?

   17 hours ago


యడ్డీ మెడపై రెబెల్స్ కత్తి.. వణుకుతున్న బీజేపీ

యడ్డీ మెడపై రెబెల్స్ కత్తి.. వణుకుతున్న బీజేపీ

   18 hours ago


‘‘ఓ తల్లి ఉసురు మీకు తగలక మానదు’’

‘‘ఓ తల్లి ఉసురు మీకు తగలక మానదు’’

   18 hours ago


తండ్రిని మించిన ఫైర్‌బ్రాండ్‌.. తెర‌పైకి జ‌యారెడ్డి

తండ్రిని మించిన ఫైర్‌బ్రాండ్‌.. తెర‌పైకి జ‌యారెడ్డి

   18 hours ago


డాక్టర్ సుధాకర్ కేసులో సీబీఐ ఏం తేల్చబోతోంది?

డాక్టర్ సుధాకర్ కేసులో సీబీఐ ఏం తేల్చబోతోంది?

   30-05-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle