newssting
BITING NEWS :
*న్యూస్ స్టింగ్ వీక్షకులకు, శ్రేయోభిలాషులకు మహా శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు *మాతృభాషాదినోత్సవ శుభాకాంక్షలు *నేడు మహాశివరాత్రి... శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు.. శివనామస్మరణతో మర్మోగుతున్న ఆలయాలు *వేములవాడ రాజన్న ఆలయానికి హెలికాప్టర్ సేవలు *శ్రీశైలంలో రాత్రి 10 గంటలకు లింగోద్భవకాల మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పాగాలంకరణ, అమ్మవార్ల కల్యాణోత్సవం *పంచాయితీరాజ్ చట్టంలో సవరణలపై ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ. గత కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వ్యవధిని తగ్గించిన ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ఆర్డినెన్స్ *వైఎస్ వివేకా హత్యకేసు విచారణను సీబీఐకి ఇవ్వాలన్న పిటిషన్ పై విచారణ. సిట్ విచారణను సీల్డ్ కవర్ లో అందజేసిన ఏజీ. సిట్ విచారణ దాదాపుగా పూర్తి కాబోతుందని, ఈ సమయంలో సీబీఐ విచారణ అవసరం లేదన్న ఏజీ.కేసు జనరల్ డైరీ, కేసు డైరీ ఫైల్స్ ను సోమవారానికి సమర్పించాలని ఏజీని ఆదేశించిన ఏపీ హైకోర్టు*అమరావతి: చంద్రబాబు, లోకేష్ అత్యంత అవినీతిపరులు. సమస్యలను పక్కదారి పట్టించేందుకే ఆస్తుల ప్రకటన-ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి *తిరుపతి: రుయా హాస్పిటల్ లో ఆవరణలో సైకోల వీరంగం. రుయా సెక్యూరిటీ సిబ్బందితో సైకోల వాగ్వాదం. బ్లేడులతో గాయపరుచుకున్న నలుగురు సైకోలు. భయంతో పరుగులు తీసిన నర్సులు *నేతలపై దాడులు చేస్తే ఎవరైనా వస్తారా..? పెట్టుబడులు వస్తాయా..? రైతుల ముసుగులో టీడీపీ గుండాలు నాపై దాడి చేసే ప్రయత్నం చేశారు-వైసీపీ ఎమ్మెల్యే రోజా

ఇలాగే వ‌దిలేస్తే ఆగ‌మైన‌ట్లే..!

19-11-201919-11-2019 08:34:10 IST
Updated On 19-11-2019 10:48:38 ISTUpdated On 19-11-20192019-11-19T03:04:10.988Z19-11-2019 2019-11-19T03:02:57.830Z - 2019-11-19T05:18:38.534Z - 19-11-2019

 ఇలాగే వ‌దిలేస్తే ఆగ‌మైన‌ట్లే..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్ పార్టీలో విభేదాలు పార్టీకి తీవ్రంగా న‌ష్టం చేస్తున్నాయి. ఎన్న‌డూ లేని విధంగా అనేక నియోజ‌క‌వ‌ర్గాల్లో టీఆర్ఎస్ రెండు వ‌ర్గాలుగా చీలిపోయింది. ఇక‌, గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో టీఆర్ఎస్ నేత‌లు మ‌ధ్య విభేదాలు ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. ఎమ్మెల్యేల‌కు, కార్పొరేట‌ర్ల‌కు మ‌ధ్య స‌యోధ్య కుద‌ర‌డం లేదు.

టీఆర్ఎస్ పార్టీకి ప‌దేళ్ల క్రింది వ‌ర‌కు గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో ఏ మాత్రం బ‌లం ఉండేది కాదు. ఒక్క సికింద్రాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో త‌ప్పిస్తే మిగ‌తా ఎక్క‌డా టీఆర్ఎస్‌కు చెప్పుకోదగ్గ స్థాయిలో కూడా బ‌లం లేకుండేది. 2009 చివ‌ర్లో వ‌చ్చిన గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో అయితే టీఆర్ఎస్ పోటీ కూడా చేయ‌లేదు. కానీ, రాష్ట్రంలో టీఆర్ఎస్‌ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత గ్రేట‌ర్ రాజ‌కీయాల సీన్ మారింది.

2014 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల‌ను టీఆర్ఎస్‌లో చేర్చుకుంది. దీంతో ఆ పార్టీకి అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌లం పెరిగింది. 2016లో జ‌రిగిన జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల‌ను కేటీఆర్ ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకున్నారు.

పెద్ద ఎత్తున ప్ర‌చారం చేశారు. దీంతో ఆ పార్టీ ఏకంగా 99 కార్పొరేట‌ర్ల‌ను గెలుచుకుంది. త‌ర్వాత మ‌రో ఇద్ద‌రు కార్పొరేట‌ర్లు టీఆర్ఎస్‌లో చేరారు. దీంతో ఆ పార్టీకి ఇప్పుడు 101 మంది కార్పొరేట‌ర్లు ఉన్నారు.

గ్రేట‌ర్ ప‌రిధిలోని 22 అసెంబ్లీ స్థానాల్లో 14 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఇప్పుడు వీరికి, కార్పొరేట‌ర్ల‌కు మ‌ధ్య స‌యోధ్య కుద‌ర‌డం లేదు. ఇంచుమించు అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ఇటువంటి ప‌రిస్థితే ఉంది. ప్ర‌తీ నియోజ‌క‌వ‌ర్గంలోనూ క‌నీసం ఇద్ద‌రు, ముగ్గురు కార్పొరేట‌ర్ల‌తో ఎమ్మెల్యేల‌కు ప‌డ‌టం లేదు. త‌ర‌చూ ప్రోటోకాల్ వివాదాలు త‌లెత్తుతున్నాయి.

కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్‌లో చేరిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్ర‌స్తుత కార్పొరేట‌ర్లకు కాకుండా ఆయా డివిజ‌న్ల‌లో గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన త‌న అనుచ‌రుల‌కు ప్రాధాన్య‌త ఇస్తున్నార‌ని కార్పొరేట‌ర్లు ఆరోపిస్తున్నారు.

త‌మ‌తో స‌ఖ్య‌త లేని కార్పొరేట‌ర్లు ఉన్న డివిజ‌న్ల‌లో ఎమ్మెల్యేలు స్వంతంగా వ‌ర్గాన్ని ప్రోత్స‌హిస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కార్పొరేట‌ర్ టిక్కెట్లు ఇస్తామ‌ని త‌మ వారికి హామీలు ఇస్తున్నారు.

మ‌రో ఏడాదిలో గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ స‌మ‌యంలో రోజురోజుకూ గ్రేట‌ర్ గులాబీ నేత‌ల మ‌ధ్య విభేదాలు మ‌రింత పెరుగుతున్నాయి. దీనిపై టీఆర్ఎస్ పెద్ద‌లు ప్ర‌త్యేక దృష్టి పెట్ట‌క‌పోతే ఆ పార్టీకి న‌ష్టం భారీగానే ఉండే అవ‌కాశాలు ఉన్నాయి.

 

భారత్ ధర్మ సత్రం కాదు.. పౌరసత్వం అంగడి సరుకుకాదు: స్వామి

భారత్ ధర్మ సత్రం కాదు.. పౌరసత్వం అంగడి సరుకుకాదు: స్వామి

   5 hours ago


గ్రామాలతోనే అభివృద్ధి.. సిరిసిల్ల రోల్ మోడల్

గ్రామాలతోనే అభివృద్ధి.. సిరిసిల్ల రోల్ మోడల్

   5 hours ago


చేను మేసిన కంచె.. చిత్తూరు కో ఆపరేటివ్ బ్యాంకులో భారీ స్కాం

చేను మేసిన కంచె.. చిత్తూరు కో ఆపరేటివ్ బ్యాంకులో భారీ స్కాం

   8 hours ago


వైఎస్ వివేకా కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. విచారణ వాయిదా

వైఎస్ వివేకా కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. విచారణ వాయిదా

   8 hours ago


గ్రేటర్‌ హైదరాబాద్‌కు ముందస్తు ఎన్నికలు?

గ్రేటర్‌ హైదరాబాద్‌కు ముందస్తు ఎన్నికలు?

   9 hours ago


ఉగాదికే ముహూర్తం.. రాజధాని తరలింపు ఖాయం

ఉగాదికే ముహూర్తం.. రాజధాని తరలింపు ఖాయం

   10 hours ago


‘‘రామ మందిరానికి ట్రస్ట్.. మరి మసీదు నిర్మాణం సంగతేంటి?’’

‘‘రామ మందిరానికి ట్రస్ట్.. మరి మసీదు నిర్మాణం సంగతేంటి?’’

   12 hours ago


ట్రంప్ కోసం యమునా నదికి సొగసులు

ట్రంప్ కోసం యమునా నదికి సొగసులు

   13 hours ago


శివనామస్మరణతో మారుమ్రోగుతున్న ఆలయాలు

శివనామస్మరణతో మారుమ్రోగుతున్న ఆలయాలు

   13 hours ago


వేములవాడకు హెలికాప్టర్‌ సేవలు.. భక్తుల్లో ఆనందం

వేములవాడకు హెలికాప్టర్‌ సేవలు.. భక్తుల్లో ఆనందం

   14 hours ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle