newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఇప్పుడు కారు.. రేపు సర్కారు.. సారథి కేటీయారేనా?

08-01-202008-01-2020 09:26:57 IST
Updated On 08-01-2020 12:07:02 ISTUpdated On 08-01-20202020-01-08T03:56:57.136Z08-01-2020 2020-01-08T03:56:27.934Z - 2020-01-08T06:37:02.337Z - 08-01-2020

ఇప్పుడు కారు.. రేపు సర్కారు.. సారథి కేటీయారేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో ఇప్పుడు కేటీయార్ హాట్ టాపిక్. త్వరలో ప్రభుత్వ పగ్గాలు తారకరాముడి చేతిలోకి రానున్నాయని చర్చ సాగుతోంది. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ కారు పగ్గాలు ఆయన చేతిలోనే వున్నాయి. ఇక సర్కారు పగ్గాలు ఎప్పుడు ఆయనకు అందుతాయోనని గులాబీ శ్రేణులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. తాజాగా మరోమారు వరంగల్ పర్యటన సందర్భంగా కేటీయార్ వార్తల్లో నిలిచారు.

మంత్రి కేటీఆర్‌ స్వయంగా కారు నడిపి అందరినీ అశ్చర్యపరిచారు. సైయెంట్‌ చైర్మన్‌ బీవీఆర్‌ మోహన్‌రెడ్డి, టెక్‌ మహేంద్రా సీఈవో సీపీ గుర్నానీ, ప్రతినిధి అశోక్‌రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి హెలికాప్టర్‌లో నిట్‌ ప్రాంగణంలో దిగారు మంత్రి కేటీయార్.

అయితే మడికొండ ఐటీ పార్క్‌కు వెళ్లేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లుచేసినా కేటీయార్ మాత్రం తన ప్రత్యేకతను చాటుకున్నారు. అందరికీ అభివాదం చేసిన మంత్రి కేటీఆర్‌ ఐటీ ప్రతినిధులు కూర్చున్న బెంజ్‌కారు వద్దకు వెళ్లారు.

ఆ కారు డ్రైవర్‌ను మరో వాహనంలో రావాలని చెప్పి. తానే స్వయంగా డ్రైవింగ్‌ సీట్లో కూర్చోవడం అందరూ ఆశ్చర్యపోయారు. నిట్‌నుంచి మడికొండ వరకు స్వయంగా డ్రైవింగ్‌చేస్తూ వెళ్ళడంతో దారిపొడవునా టీఆర్ఎస్ శ్రేణులు కూడా ఉత్సాహంగా ముందుకు వెళ్లారు. అక్కడ ఐటీ కంపెనీల క్యాంపస్‌లను ప్రారంభించిన అనంతరం హన్మకొండ బాలసముద్రంలోని ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ ఇంటికి కూడా కారు నడుపుకుంటూ వెళ్లడం కనిపించింది. 

కారు నడపడం అంటే కేటీఆర్‌కు ఎంతో ఇష్టం. అవకాశం వచ్చినప్పుడల్లా కేటీయారే కారు నడుపుతున్నారు. గతంలో సీఎం కేసీఆర్‌ కూడా కారు నడిపేవారు. రవాణా శాఖమంత్రిగా పనిచేసిన కేసీయార్ తెలంగాణ ఉద్యమం సమయంలో అనేకసార్లు కారు నడిపారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి వంటి వారు సైతం త్వరలో కేటీయారే సీఎం అంటూ వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. మొత్తం మీద వరంగల్ పర్యటనలో కేటీయార్ తన ప్రత్యేకతను చాటుకున్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle