ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని సెటిల్ చేసుకుంటారా..?
26-05-202026-05-2020 08:22:59 IST
Updated On 26-05-2020 09:44:25 ISTUpdated On 26-05-20202020-05-26T02:52:59.181Z26-05-2020 2020-05-26T02:52:51.722Z - 2020-05-26T04:14:25.697Z - 26-05-2020

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య ఉన్న అనుబంధానికి పోతిరెడ్డిపాడు వివాదం బ్రేకులు వేసింది. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు, రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలతో రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వివాదం ఏర్పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ వివాదం అపెక్స్ కమిటీకి చేరింది. అపెక్స్ కమిటీ ఛైర్మన్, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి షేకావత్ త్వరలోనే అపెక్స్ కమిటీలో సభ్యులుగా ఉండే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కావాలని నిర్ణయించారు. 2014లో రెండు రాష్ట్రాల మధ్య జలవివాదం వచ్చినప్పుడు అప్పటి కేంద్ర మంత్రి ఉమాభారతి సమక్షంలో అప్పటి ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు నాయుడు మధ్య మొదటిసారి, ఏకైక సారి ఇటువంటి సమావేశం జరిగింది. ఆ తర్వాత రెండు రాష్ట్రాల మధ్య ఎటువంటి వివాదాలు లేకుండా సాఫీగా సాగింది. ఇక, ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చాక కేసీఆర్తో ఉన్న సత్సంబంధాల కారణంగా ఇక రెండు రాష్ట్రాల మధ్య ఎటువంటి వివాదాలూ ఉండవని అంతా అనుకున్నారు. బేసిన్లు, బేషజాలు ఉండవని, కలిసి ఉభయ రాష్ట్రాలకు మంచి చేసే విధంగా వ్యవహరిస్తామని ఇద్దరు ముఖ్యమంత్రులు పలుమార్లు సమావేశమయ్యారు. గోదావరి జలాలను కృష్ణా తరలించి రెండు రాష్ట్రాల్లో కరువు పీడిత ప్రాంతాలకు నీరందించేందుకు ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి ఓ ఉమ్మడి ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించారు. అయితే, ఈ ప్రాజెక్టు విషయమై మొదట సానుకూలంగా వ్యవహరించిన జగన్ తర్వాత ఎందుకో వెనక్కు తగ్గారు. దీంతో ఈ ప్రాజెక్టు ఆలోచనల వరకే పరిమితమైంది. ఇప్పుడు పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచడం, రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణంపై జగన్ నిర్ణయం తీసుకోవడం ఇద్దరి మధ్య దూరం పెంచింది. తెలంగాణ ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే జగన్ ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకోవడం వివాదాస్పదమైంది. తెలంగాణ ప్రభుత్వం కంటే ముందే తెలంగాణ ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ ఈ విషయంపై స్పందించి గళమెత్తాయి. ఈ విషయంపై ఏపీ ప్రభుత్వం నిర్ణయాలను ఆపాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కేంద్రానికి వినవించడంతో కేంద్రమంత్రి అపెక్స్ కమిటీ భేటీకి నిర్ణయించారు. అయితే, అపెక్స్ కమిటీ ముందుకు వెళ్లి మాట్లాడుకోవడం కంటే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరోసారి కూర్చొని ఈ విషయంలో ఓ సానుకూల పరిష్కారానికి చొరవ తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అపెక్స్ కమిటీ భేటీ గురించి రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇంకా స్పందించడం లేదు. జగన్తో తమకు ఇంకా మంచి సంబంధాలే ఉన్నాయని ఇటీవల కేసీఆర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో కేంద్రం వద్ద పంచాయితీ పెట్టే కంటే తామిద్దరమే కూర్చొని మాట్లాడుకుంటే వివాదం సామరస్యంగా కొలిక్కి వస్తుంది అనే ఆలోచనలో ఇద్దరు ముఖ్యమంత్రులు ఉన్నారని చెబుతున్నారు. త్వరలోనే వీరి భేటీ కూడా జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జగన్ ప్రతిపాదించిన ప్రాజెక్టులకు కేంద్రం, నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ బ్రేకులు వేయడంతో ఇప్పుడంతలో ముందుకు వెళ్లే పరిస్థితి లేదు. దీంతో కొన్ని రోజుల్లో ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి మాట్లాడుకొని వివాదాన్ని పరిష్కరించుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఇదిలా ఉండగా తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ఏపీ ప్రభుత్వ నిర్ణయాలు, తెలంగాణ ప్రభుత్వ వైఖరికి నిర్లక్ష్యంగా జూన్ 2న తెలంగాణ ఆవిర్భావన దినోత్సవం నుంచి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. జూన్ 2న మహబూబ్నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు చెందిన నేతలు నిరాహార దీక్షలు చేయనున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో ప్రధాన పార్టీలూ మాత్రం ఈ విషయంపై నోరు విప్పడం లేదు. ప్రధాన ప్రతిపక్షం చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమ వైఖరి ఏంటనేది చెప్పడం లేదు.

ఏపీ, తెలంగాణలో ఉత్కంఠ.. ఈ ఒక్కరోజు చాలా ఇంపార్టెంట్
an hour ago

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్
2 hours ago

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత
2 hours ago

ఎమ్మెల్యేల డ్రగ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు
4 hours ago

కేటీఆర్ కి అంత సీన్ లేదులే
5 hours ago

పెద్ద నాయకుడికి ఇబ్బందులు అంటూ స్వరూపానందేంద్ర సరస్వతి వ్యాఖ్యలు..!
6 hours ago

కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్న టీడీపీ
21 hours ago

వివేకానంద రెడ్డి హత్యపై మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు..!
20 hours ago

ఆ వీడియో వార్తలపై అచ్చెన్న ఫైర్..!
21 hours ago

గత సావాసంతో టీఆర్ఎస్ కు కమ్యూనిస్టుల సపోర్ట్
19 hours ago
ఇంకా