newssting
BITING NEWS :
* భారత్-అమెరికా మధ్య కుదిరిన ఐదు ఒప్పందాలు.. ట్రంప్‌తో నాకు ఇది ఐదో సమావేశం, ట్రంప్ సకుటుంబంగా భారత్‌కు రావడం సంతోషంగా ఉంది-ప్రధాని మోడీ*మూడు బిలియన్ డాలర్ల ఒప్పందం జరిగింది, సహజవాయురంగంలో ఒప్పందం చేసుకున్నాం-డొనాల్డ్ ట్రంప్ *ఇండియాతో మాకు ప్రత్యేక అనుబంధం, ఈ టూర్ ఎప్పటికీ మర్చిపోలేను, రెండు దేశాలకు ఇది ఉపయోగకరమైన పర్యటన, ఇస్లాం తీవ్రవాదంపై కూడా చర్చించాం-ట్రంప్ * నిర్భయ దోషుల ఉరి శిక్షలో మరో ట్విస్ట్..! విచారణ 5వ తేదీకి వాయిదా *ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్‌ సస్పెన్షన్ రద్దుచేసిన క్యాట్.. కృష్ణకిషోర్‌ కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ట్రైబ్యునల్‌ అనుమతి, కృష్ణకిషోర్‌పై కేసులను ప్రభుత్వం చట్టప్రకారం పరిశీలించుకోవచ్చన్న క్యాట్ *ఢిల్లీ సర్వోదయ స్కూల్‌లో అమెరికన్ ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్... హ్యాపిసెన్ క్లాస్‌లను పరిశీలించిన మెలానియా*రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల.. నోటిఫికేషన్‌ మార్చి 6, నామినేషన్లకు చివరి తేది మార్చి 13, నామినేషన్ల పరిశీలన మార్చి 16, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది మార్చి 18, మార్చి 26న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్. సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ * సాయంత్రం మోడీ-ట్రంప్ విందుకు హాజరుకానున్న ప్రముఖులు. రాలేనని సందేశం పంపిన మాజీ పీఎం మన్మోహన్ సింగ్

ఇక హైదరాబాద్ నగర ప్రయాణం ఈజీ

07-01-202007-01-2020 08:51:41 IST
Updated On 07-01-2020 12:35:56 ISTUpdated On 07-01-20202020-01-07T03:21:41.505Z07-01-2020 2020-01-07T03:15:33.291Z - 2020-01-07T07:05:56.840Z - 07-01-2020

ఇక హైదరాబాద్ నగర ప్రయాణం ఈజీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఒకప్పుడు హైదరాబాద్ లో ప్రయాణం అంటే నరకానికి కేరాఫ్ అడ్రస్ గా వుండేది. ట్రాఫిక్ జాంలు, పాడైపోయిన రోడ్లు. రణగొణ ధ్వనులతో ప్రయాణం సాగేది. జనం అష్టకష్లాలు పడేవారు.

కానీ గడచిన ఐదేళ్ళలో నగర ప్రయాణంలో క్రియాశీలక మార్పులు చోటుచేసుకున్నాయి. మెట్రో రైలు రాకతో హైద‌రాబాద్ నగర ప్రయాణం మరింత ఈజీగా మారింది. మియాపూర్ నుంచి ఎల్ బీ నగర్ ఇప్పుడు ఎలాంటి ట్రాఫిక్ జాంలు లేకుండా సాగిపోతోంది.

అటు నాగోల్ నుంచి రాయదుర్గం రూట్లోనూ మెట్రో ప్రారంభం అయింది. దీంతో హైటెక్ సిటీ మార్గంలో ప్రయాణం నల్లేరు మీద బండి నడకలా మారింది. నాగోల్ నుంచి సికింద్రాబాద్, అక్కడినించి అమీర్ పేట, అమీర్ పేట నుంచి హైటెక్ సిటీ.. ఇలా ప్రయాణికులు ఎటు కావాలంటే అటు రయ్యిన దూసుకుపోతున్నారు. తాజాగా జేబీఎస్‌ నుంచి ఎంజీబీఎస్ వరకు మొత్తం 11 కిలోమీటర్ల మేర  మెట్రో రైలు మార్గం  త్వరలో అందుబాటులోకి రానుండడం మరింత సంతోషాన్నిస్తోంది.

ఇప్పటికే న‌గ‌రంలో 57 కిలోమీటర్ల మేర మెట్రో రైళ్ల‌ రాకపోకలు సాగిస్తుండ‌గా అదనంగా మరో 11 కిలోమీటర్లు రెడీ అయ్యాయి. దీంతో మొత్తం 68 కిలోమీటర్ల మెట్రో ప్రయాణం అందుబాటులోకి రానుంది.

మెట్రో ప్రస్థానంలో ఇది చివరి మైలురాయి కానుంది. సికింద్రాబాద్ పరేడ్‌ గ్రౌండ్‌ నుంచి అన్ని స్టేషన్ల తనిఖీలు పూర్తి కాగా గ్రీన్‌ సిగ్నల్‌ కూడా లభించింది. అతిపెద్ద ఇంటర్‌చేంజ్‌ స్టేషన్‌ ఎంజీబీఎస్‌ ఇప్పటికే సిద్ధమైన సంగతి తెలిసిందే.

ఎల్బీనగర్‌ నుంచి మియాపూర్‌ మార్గంలో ప్రయాణించే కారిడార్‌ 1కు సంబంధించిన రైళ్ల రాకపోకలు ఇంటర్‌చేంజ్‌ మెట్రోస్టేషన్‌ మొదటి, రెండో అంతస్తుల నుంచి, కారిడార్‌ 2 జేబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా మార్గంలో సాగించే రైళ్లు 3,4 అంతస్తుల ద్వారా రాకపోకలు సాగిస్తాయని మెట్రో అధికారులు తెలిపారు.

ఈ రూట్లో పరేడ్‌గ్రౌండ్‌, సికింద్రాబాద్‌ వెస్ట్‌, గాంధీ దవాఖాన, ముషీరాబాద్‌, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌, చిక్కడపల్లి, నారాయణగూడ, సుల్తాన్‌బజార్‌. ఎంజీబీఎస్‌ వంటి స్టేషన్ల వస్తాయి. ఈ రూట్ వ్యాపారస్తులకు, ఇతర రాష్ట్రాలకు బస్సుల్లో వెళ్లేవారికి అనుకూలంగా ఉంటుంది.

ఈరూట్ మొత్తం 11 కిలోమీటర్లు. 16 నిమిషాల్లో 11 కిలోమీటర్లు చేరుకునేలా జేబీఎస్‌ నుంచి ఎంజీబీఎస్ మెట్రో మార్గంలో ప్రయాణం సాగుతుంది. అదే బస్సులో ఈ రూట్లో ఎంజీబీఎస్ వెళ్లాలంటే 45 నిముషాల సమయం పడుతుంది. దీంతో అరగంట వరకూ సమయం ఆదా అవుతుంది. జేబీఎస్ నుంచి విజయవాడ, ఇతర ప్రాంతాలకు వెళ్ళాలనుకునే ప్రయాణికులు పరేడ్ గ్రౌండ్స్ దగ్గర మెట్రో ట్రైన్ ఎక్కి ఎంజీబీఎస్ లో దిగవచ్చు. అక్కడినించి బస్సులో ఇతర ప్రాంతాలకు వెళ్లే సౌలభ్యం వుంది. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle