newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఇక తెలంగాణ యాపిల్స్.. కొమురం భీం అడవుల్లో సాగు సక్సెస్

12-05-202012-05-2020 11:13:54 IST
Updated On 12-05-2020 11:48:22 ISTUpdated On 12-05-20202020-05-12T05:43:54.173Z12-05-2020 2020-05-12T05:43:40.764Z - 2020-05-12T06:18:22.452Z - 12-05-2020

ఇక తెలంగాణ యాపిల్స్.. కొమురం భీం అడవుల్లో సాగు సక్సెస్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
యాపిల్ పేరు చెప్పగానే కశ్మీర్, సిమ్లా గుర్తుకువస్తాయి. అక్కడ సాగయ్యే యాపిల్ పండ్లు దేశమంతా సప్లయ్ అవుతాయి. ఒక్కోసారి యాపిల్ చాలా చౌకగా లభిస్తుంది. తెలంగాణ జిల్లాలోనూ యాపిల్ సాగు చేస్తున్నారు. రైతులు ఆసిఫాబాద్ జిల్లా లో ఆపిల్ సాగు చేసి చూపించారు. ఆసిఫాబాద్ కొమురంభీం జిల్లా అడవుల్లో ఆపిల్  సాగు విజయవంతం కావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

రైతు బాలాజీ  వ్యవసాయ క్షేత్రంలో  రెండెకరాల్లో ఏపుగా పెరిగిన 400 యాపిల్ మొక్కలు కనువిందు చేస్తున్నాయి. ప్రస్తుతం ఒక్కోచెట్టుకు 40 వరకు కాయలు కాచాయి. మరో నెలలో మార్కెట్లోకి రానున్నాయి తెలంగాణ యాపిల్స్. తెలంగాణ అనగానే ఠక్కున గుర్తొచ్చే బతుకమ్మ, బోనాలు, బిర్యానీ పక్కన కొత్తగా యాపిల్‌ పండు చేరింది. 

కొమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా లోని కెరమెరి అటవీప్రాంతంలో తెలంగాణ యాపిల్‌ నెలరోజుల్లో కోతకు రానున్నది! ఏడాదిలో ఎక్కువకాలం కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఈ ప్రాంతం యాపిల్‌సాగుకు అనుకూలంగా ఉంది. ఔత్సాహిక రైతు బాలాజీ ప్రయోగాత్మకంగా చేసిన యాపిల్‌సాగు విజయవంతం అయింది. చల్లని ప్రదేశాల్లో కొత్తరకం సాగుకు ఈ ప్రయత్నం దారిచూపింది. ఆదివాసి ప్రాంతంలో మారుమూల అటవీ ప్రాంతంలో ఆపిల్ సాగు చేస్తున్న రైతు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. 

తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా మన యాపిల్‌ మార్కెట్‌లోకి రానుంది. త్వరలో ఈ ఫలాల రుచిని ఆస్వాదించే అవకాశముంది. సర్కారు సహకారంతో కొమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కెరమెరి మండలం ధనోరాకు చెందిన రైతు కేంద్రె బాలాజీ 400 మొక్కలు నాటగా, మరో నెలరోజుల్లో పంట చేతికందనుంది. మొదటల్లో బాలాజీ 15 ఎకరాల్లో పత్తి తదితర వాణిజ్యపంటలు వేయగా నష్టాలు వచ్చాయి. దీంతో పెట్టుబడి తక్కువగా ఉండే ఆహార పంటలు సాగుచేయాలని నిర్ణయించుకున్నాడు. 

మార్కెట్లోకి పండ్లు కొనడానికి వెళ్ళినప్పుడు నిగనిగ లాడే ఆపిల్ పండ్లను చూసి ఆపిల్ సాగును స్వయంగా ఎందుకు సాగు చేయకూడదు కాశ్మీర్ ఆపిల్ కు ధీటుగా పండించి మన రాష్ట్రానికి ఆపిల్ అందించాలని ఒక గట్టి సంకల్పంతో తన ఆలోచన తన స్నేహితుడికి చెప్పి స్నేహితుడి సలహాతో రాజమండ్రిలోని కడియం నర్సరీ నుంచి బాలాజీ పది యాపిల్‌ మొక్కలు తీసుకొచ్చి నాటాడు. తనకున్న పరిజ్ఞానంతో వాటికి అనుకూలమైన వాతావరణం కల్పించగా ఏపుగా పెరిగాయి. ఉష్ణ మండల ప్రాంతాల్లో యాపిల్‌ సాగుపై పరిశోధన చేస్తున్న హైదరాబాద్‌లోని సీసీఎంబీ శాస్త్రవేత్తలకు ఈ విషయం తెలిసింది. 

బాలాజీ యాపిల్‌సాగు చేస్తున్న భూమిని అక్కడి వాతావరణాన్ని అధ్యయనం చేశాడు. 2014లో ఈ భూమిలో సాగుకు అనుకూలమైన హరిమన్‌ రకానికి చెదిన 150 మొక్కలను ఇచ్చి ప్రోత్సహించారు. వారి సలహాలతో మొక్కల చుట్టూ ఏడాది పొడవునా తేమ ఉండేలా ఏర్పాట్లుచేశాడు. 50 మొక్కలు చనిపోగా 100 మొక్కలు పెరిగాయి. రెండో ఏట పూతవచ్చి కాయలు కాశాయి. 2016లో వ్యవసాయశాఖ మరో 300 మొక్కలు ఇవ్వగా నాటాడు. మూడేండ్లుగా పూత,కాతా దశలో తుంచేస్తు కాయలను కోయకుండా చెట్టుకు అలాగే వదిలేశాడు. ప్రస్తుతం కాయలు 200 గ్రాముల పరిమాణానికి చేరాయి. ఇవి ఎర్రగా కశ్మీర్‌ యాపిల్‌ను తలపిస్తున్నాయి. 

రెండెకరాల్లో 400 చెట్లలో ఒక్కోదానికి 20 నుంచి వరకు 40 కాయలున్నాయి. మరో నెలలో కోతకు వచ్చేసరికి ఒక్కొక్కటి 250 గ్రాముల బరువు వచ్చే అవకాశం ఉన్నది. ఒక్కో చెట్టుకు నాలుగు నుంచి ఆరు కిలోల వరకు దిగుబడి వస్తుందని బాలాజీ తెలిపారు. ధనోరా పరిసరాల్లో సాగవుతున్న యాపిల్‌ క్షేత్రం చుట్టూ గుట్టలు ఉన్నాయి. నవంబర్‌, డిసెంబర్‌ నెలలో ఈ ప్రాంతంలో 4 డిగ్రీ ల ఉష్ణోగ్రతలు నమోదవుతుండడం వల్ల యాపిల్‌ సాగుకు అనుకూలమని శాస్త్రవేత్తలు తెలిపారు. సరైన ఊష్ణోగ్రత నమోదవడంతో చెట్టుకు పూత నిలిచి ఉంటుంది. ఆ తర్వాత ఉష్ణోగ్రత పెరిగనా యాపిల్‌ మొక్క తట్టుకుంటుంది. ఒక్కసారి నాటిన యాపిల్‌ మొక్కలు, నేల స్వభావాన్ని బట్టి 25 నుంచి 30 ఏండ్ల వరకు బతికి ఉంటాయి.

మొదట్లో తాను నాటిన యాపిల్‌ మొక్కలు బాగా పెరిగాయని ఇక్కడి అధికారులు హైదరాబాద్‌లో ఉండే శాస్త్రవేత్తలకు చెప్పారు. వాళ్లు వచ్చి భూమిని పరిశీలించి తగిన సలహాలిచ్చారని రైతు బాలాజీ తెలిపారు. సర్కారు ఉచితంగా మొక్కలు ఇచ్చిందని, శాస్త్రవేత్తలు,అధికారులు ఎప్పటికప్పుడు సూచనలు చేశారని, వారి సహకారం మరువలేనిదని బాలాజీ చెప్పారు. ప్రస్తుతం 400 యాపిల్‌ చెట్లకు కాయలు కాశాయి. ఈ నెలాఖరులోగా కోతకు వచ్చే అవకాశం ఉంది ఈ ఆపిల్ పండ్లను చూసి తన ఆనందానికి అవధులు లేకుండా పోయాయన్నారు.  మొదటిసారి కోతకోశాక ఆయాపిల్ పండ్లను ముఖ్యమంత్రి కేసీయార్ కు అందిస్తానన్నాడు బాలాజీ. తెలంగాణ యాపిల్ రుచి ఎలా వుంటుందో చూడాలంటే కొంతకాలం ఆగాల్సిందే. 

కోవిడ్  వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

   an hour ago


మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

   3 hours ago


గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

   2 hours ago


ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

   4 hours ago


క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

   4 hours ago


క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

   5 hours ago


 సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

   21 hours ago


ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

   22-04-2021


నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

   22-04-2021


మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

   22-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle