newssting
BITING NEWS :
*ఢిల్లీ వెళ్లనున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌..రాష్ట్రపతి భవన్‌ లో విందుకు హాజరుకానున్న సీఎం కేసీఆర్‌ *రెండవ రోజు భారత్‌లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పర్యటన *దేవరకొండలో మంత్రి కేటీఆర్‌ పర్యటన. పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొని సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేయనున్న కేటీఆర్‌ *తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎన్‌ ఎన్నికల్లో నేడు నామినేషన్ల స్వీకరణ * కుప్పంలో రెండోరోజు పర్యటించనున్న చంద్రబాబు* ఏపీ స్థానికల రిజర్వేషన్లపై తీర్పు వెల్లడించనున్న ఏపీ హైకోర్టు ఫాలో అప్ *వివేకా హత్యకేసుపై తీర్పు రిజర్వు చేసిన హైకోర్టు *ఇవాళ హైదరాబాద్ హౌస్ లో మోదీతో ట్రంప్ ద్వైపాక్షిక చర్చలు *ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్‌ గా రామ్‌ నివాస్‌ గోయల్ ఏకగ్రీవ ఎన్నిక*అమరావతి: 70వ రోజుకు చేరిన అమరావతి రైతుల ఆందోళనలు, మందడం, వెలగపూడి, తుళ్లూరులో రైతుల ధర్నాలు*వికారాబాద్: కొడంగల్ సమీపంలో రోడ్డు ప్రమాదం. బీజాపూర్ - హైదరాబాద్ హైవేపై కారును ఢీకొట్టిన లారీ. భార్యాభర్తలకు తీవ్రగాయాలు. హాస్పిటల్ కు తరలింపు*భారతీయ సినిమాలు గ్రేట్.. దిల్‌వాలే దుల్హనియా, షోలే చిత్రాలు గొప్పవి-డొనాల్డ్ ట్రంప్

ఇక జెట్ స్పీడ్‌లో పాలన.. భారీగా బదిలీలు అందుకేనా?

03-02-202003-02-2020 07:29:12 IST
2020-02-03T01:59:12.935Z03-02-2020 2020-02-03T01:59:03.808Z - - 25-02-2020

ఇక జెట్ స్పీడ్‌లో పాలన.. భారీగా బదిలీలు అందుకేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో వరుస ఎన్నికలతో అధికారులు బిజీగా వున్నారు. ఈ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో పాలనపై ఫోకస్ పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో  అధికారుల బదిలీలు షురూ అయ్యాయి. 21 జిల్లాలకు కొత్త కలెక్టర్లు నియమించింది ప్రభుత్వం. ఒకేసారి 50 మంది ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేయడం చర్చనీయాంశంగా మారింది. రజత్‌కుమార్‌కు నీటిపారుదల శాఖ, జనార్దన్‌రెడ్డికి వ్యవసాయ శాఖ అప్పగించింది.

2018 డిసెంబరులో జరిగిన ముందస్తు ఎన్నికల అనంతరం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాష్ట్రంలో రెండోసారి అధికారం చేపట్టింది. అనంతరం ఇంత భారీ సంఖ్యలో ఐఏఎస్‌ అధికారుల బదిలీలు జరగడం ఇదే తొలిసారి.  ఇక బదిలీల్లో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌ కుమార్‌కు కీలకమైన నీటిపారుదల శాఖ బాధ్యతలు అప్పగించింది.  కేంద్ర ఎన్నికల సంఘం విధుల నుంచి రిలీవ్‌ చేస్తూ ప్రభుత్వం ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించింది.

సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్‌ సిన్హాను ప్రాధాన్యత లేని పశుసంవర్థక, పాడి అభివృద్ధి, మత్స్య శాఖకు బదిలీ చేయడం చర్చకు దారితీస్తోంది. గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్‌కు  విద్యాశాఖ ,  వికాస్‌రాజ్‌ను మరో కీలకమైన  సాధారణ పరిపాలన శాఖకు బదిలీ చేసింది. విద్యాశాఖ కార్యదర్శి బి.జనార్దన్‌రెడ్డికి వ్యవసాయ శాఖ, సీఎం కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియాకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖలు లభించాయి.

పురపాలక శాఖ డైరెక్టర్‌ టీకే శ్రీదేవి, మహబూబ్‌నగర్‌ జిల్లా కలెక్టర్‌ డి.రొనాల్డ్‌ రాస్‌లను ఆర్థిక శాఖ కార్యదర్శులుగా నియమించింది. చాలా జిల్లాలకు కలెక్టర్లుగా యువ ఐఏఎస్‌ అధికారులను ప్రభుత్వం నియమించడం విశేషం. జిల్లాల్లో వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తున్న కలెక్టర్లు కొత్త జిల్లాలకు వెళుతున్నారు. ఆర్థికశాఖ అధికారులు బడ్జెట్ రూపకల్పనకు సన్నాహాలు చేస్తున్నారు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle