ఇక క్యాంపు రాజకీయాలు షురూ.. రిసార్ట్‌లకు గిరాకీ!
25-01-202025-01-2020 09:55:39 IST
Updated On 25-01-2020 12:30:10 ISTUpdated On 25-01-20202020-01-25T04:25:39.006Z25-01-2020 2020-01-25T04:25:19.948Z - 2020-01-25T07:00:10.975Z - 25-01-2020

స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు విజేతలకు గిరాకీ పెంచుతుంది. మునిసిపాలిటీలు, కార్పోరేషన్లలో గెలిచిన కౌన్సిలర్లు, కార్పోరేటర్లను పార్టీలు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాయి. హైదరాబాద్ నగరశివారులోని కొత్తగా ఏర్పడిన మునిసిపాలిటీలలో పాగావేయడానికి పార్గీలు తెగ ప్రయత్నాలు చేశాయి. ఇవాళ ఫలితాలు రానుండడంతో తమ పార్టీ విజేతలను క్యాంపులకు తరలించేందుకు సిద్ధమవుతున్నాయి. మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో ఏడు కార్పొరేషన్లు, 21 మున్సిపాలిటీల ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. గెలుపొందిన అభ్యర్థులను వెంటనే క్యాంపులకు తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ఈ నెల 27న కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో మేయర్, చైర్మన్‌తోపాటు డిప్యూటీ మేయర్, వైస్ చైర్మన్ల ఎన్నిక జరగనున్న నేపథ్యంలో టీఆర్ఎస్ రిసార్ట్ రాజకీయాలకు రంగం సిద్ధం చేసింది. సకల సౌకర్యాలు కల్పిస్తోంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో లాగానే మున్సిపల్ ఎన్నికల్లోనూ తమ సత్తా చాటాలని టీఆర్ఎస్ భావిస్తోంది. అందుకే మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలుపొందిన వారంతా అధిష్టానం నిర్ణయించిన మేయరు, ఛైర్మన్ అభ్యర్థులకు ఓటు వేసేలా క్యాంపులు నిర్వహించటానికి సన్నద్ధమైనట్టు సమాచారం. నగర శివారుల్లోని రిసార్టులు, గెస్ట్ హౌస్ లను యజమానులు సిద్ధం చేశారు. సీసీటీవీలు కూడా ఏర్పాటు చేశారు. రెండు జిల్లాల్లో ఎన్నికలకు ముందే తొమ్మిది వార్డులను ఏకగ్రీవం చేసుకున్న అధికార పార్టీ కౌంటింగ్ పూర్తి కాగానే, గెలుపొందిన టీఆర్ఎస్ అభ్యర్థులను క్యాంపులకు తరలించేందుకు నగర శివారు ప్రాంతాల్లో రిసార్టులకు వాహనాలు కూడా సిద్ధంచేశారు. దావోస్ పర్యటన నుంచి మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీయార్ హైదరాబాద్ చేరుకున్నారు. దీంతో మ్యాజిక్ ఫిగర్ రాని కార్పొరేషన్ లేదా మున్సిపాలిటీలో ఎవరైనా స్వతంత్రులు గెలిస్తే వారిని కూడా తమకే మద్దతు ఇచ్చేలా ప్రయత్నాలు సాగుతున్నాయి. మునిసిపల్ ఎన్నికల్లో గతంలో కంటే ఖర్చు విపరీతంగా పెట్టారు. తాయిలాలతో ఓటర్లను ఆకట్టుకున్నారు. తెలంగాణ భవన్‌కు చేరుకున్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటిఆర్ ఫలితాల గురించి వాకబు చేస్తున్నారు. వర్థన్నపేట మున్సిపాలిటీని టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఫలితాలు వెల్లడికాకముందే ఉమ్మడి నిజామాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థులను క్యాంపులకు తరలిస్తున్నారు. వీరిని హైదరాబాద్ శివారుల్లోని రిసార్ట్స్ లకు తరలించేందుకు టీఆర్ఎస్ నేతలు సిద్ధమయ్యారు. మొత్తం మునిసిపల్ ఎన్నికల అనంతరం హార్స్ ట్రేడింగ్ షురూ కానుంది.

వెంట వెంటనే ఎన్నికలు.. మంచికేనట
10 hours ago

లొంగిపోయిన కూన రవికుమార్
6 hours ago

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు
8 hours ago

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు
11 hours ago

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!
13 hours ago

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్
15 hours ago

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం
16 hours ago

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!
17 hours ago

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?
18 hours ago

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ
19 hours ago
ఇంకా