newssting
BITING NEWS :
*విషమంగానే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ఆరోగ్యం.. వెంటిలేటర్ పై చికిత్స *వనపర్తి జిల్లా నాగపూర్ లో విషాదం ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య *హైద‌రాబాద్‌: పంచాయతీ,మండల, జిల్లాప్రజా పరిషత్‌లకు 15వ ఆర్థిక సంఘం నిధుల పునరుద్ధరణ.. ఆరేళ్ల క్రితం నిలిపివేసిన ఆర్థికసంఘం.. ఈ ఏడాదికి రూ.1,847 కోట్ల నిధుల మంజూరు*ఢిల్లీ: ప్ర‌శాంత్ భూష‌ణ్ కోర్టు ధిక్క‌ర‌ణ సుమోటో కేసులో సుప్రీంకోర్టు తీర్పు... ప్ర‌శాంత్ భూష‌ణ్‌ను దోషిగా తేల్చిన జ‌స్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం.. శిక్ష‌పై ఈ నెల 20న వాద‌న‌లు వింటాం-సుప్రీం*హైద‌రాబాద్‌: కోవిడ్ కి ఉచిత చికిత్స చేయాలి.. కరోనాతో ఆదాయ మార్గం పోయింది కాబట్టి పేదలకు ఆరు నెలల పాటు రూ. 7500 చొప్పున‌ ఇవ్వాలి-ప్రొఫెస‌ర్ కోదండరాం*భార‌త్‌లో రికార్డు స్థాయిలో పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు.. గడచిన 24 గంటల్లో 64,553 కరోనా కేసులు నమోదు, 1007 మంది మృతి.. 24,61,191కు చేరుకున్న క‌రోనా పాజిటివ్ కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 48,040 మంది మృతి*తెలంగాణ‌లో 1921 పాజిటివ్ కేసులు నమోదు, 9 మంది మృతి.. 88396కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్పటి వరకు 674 మంది మృతి

ఇక అమిత్ షానే దిక్కు.. ఆర్టీసీ జేఏసీ ఢిల్లీ పయనం

03-11-201903-11-2019 11:18:13 IST
2019-11-03T05:48:13.980Z03-11-2019 2019-11-03T05:47:55.070Z - - 15-08-2020

ఇక అమిత్ షానే దిక్కు.. ఆర్టీసీ జేఏసీ ఢిల్లీ పయనం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ ఆర్టీసీ కార్మికుల భవితవ్యం కేంద్ర హోమంత్రి అమిత్ షా చేతుల్లోనే ఉందా? గత నెలరోజులుగా సమ్మెచేస్తున్నా కనికరించని తెలంగాణ సీఎం శనివారం కేబినెట్ సమావేశంలో ఆర్టీసీ విలీనానికి వ్యతిరేకంగా, ఆర్టీసీ ప్రైవేటీకరణకు అనుకూలంగా కీలక నిర్ణయాలు ప్రకటించిన నేపథ్యంలో తమ సమస్యల పరిష్కారం కోసం నేరుగా కేంద్ర హోమంత్రి అమిత్ షా వద్దకే వెళతామని ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. 

విద్యానగర్‌లోని ఎంప్లాయిస్‌ యూనియన్‌లో ఆర్టీసీ జేఏసీ, విపక్ష నేతలతో శనివారం సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశం ముగిసిన అనంతరం ఆ‍ర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ.. ఆర్టీసీ సమ్మెను రాష్ట్ర వ్యాప్తంగా మరింత ఉధృతం చేస్తామని ప్రకటించారు. ఆర్టీసీ సమ్మెపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాను కలువనున్నట్లు తెలిపారు. కార్మికులపై టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి గురించి ఆయనతో చర్చిస్తామని వెల్లడించారు. 

ఆర్టీసీ జేఏసీ నేతలతో కలిసి ఈనెల 4 లేదా 5వ తేదీలలో అమిత్‌ షాతో భేటీ అవుతున్నట్లు అశ్వత్థామరెడ్డి తెలిపారు. అలాగే ఆర్టీసీ విభజనపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్న అది చెల్లుబాటు కాదని అన్నారు. సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని అన్నారు. రూట్లను వేరుచేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ఆర్టీసీ కార్మికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. అలాగే ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు.

ఆర్టీసీ సమ్మెను మరింత తీవ్రతరం చేయడానికి వారంరోజుల ప్రణాళికను కూడా ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. నవబర్ 3న అన్ని డిపోల వద్ద, గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తర్వాత 4న రాజకీయ పార్టీలతో డిపోల దగ్గర దీక్ష నిర్వహిస్తారు. 5న సడక్ బంద్ రహదారుల దిగ్బంధానికి పూనుకుంటారు. 6న రాష్ట్ర వ్యాప్తంగా డిపోల ముందు నిరసన కార్యక్రమం ఉంటుంది. 7న ఆర్టీసీ కార్మికుల కుటుంబసభ్యులు, రాజకీయ పార్టీలతో డిపోల ముందు దీక్ష చేస్తారు. 8న ఛలో ట్యాంక్ బండ్ సన్నాహక కార్యక్రమాలు, 9న ట్యాంక్ బండ్ పై దీక్ష, నిరసన కార్యక్రమాలు ఉంటాయి

ఆర్టీసీ డ్రైవర్ విషాద మరణం నేపథ్యంలో ఆయన అంత్యక్రియల సందర్భంగా బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై రాష్ట్ర పోలీసులు ప్రదర్సించిన అత్యుత్సాహం, సీనియర్ నాయకులను కూడా తోసివేయడం, దూషించడం వంటి చర్యలు కేంద్రప్రబుత్వ దృష్టికి వచ్చాయి. ఈ ఘటనలతో హుటాహుటిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ని డిల్లీ పిలిపించుకున్న కేంద్ర ప్రభుత్వం, బీజేపీ అగ్రనాయకత్వం తెలంగాణలో పరిణామాలను అడిగి తెలుసుకుంది.

కేంద్రం అనుమతి లేకుండా తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీని ఎలా ప్రయివేటీకరింస్తుందో తామూ చూస్తామని బీజేపీ నేతలు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ వ్యవహారాలు శ్రుతిమించకుండా అడ్డుకునే మార్గాలను కేంద్రం అన్వేషిస్తోందని సమాచారం.

 

 

స్వదేశీ అంటే విదేశీ వస్తు బహిష్కరణ కాదు.. ఆరెస్సెస్ చీఫ్ భగవత్

స్వదేశీ అంటే విదేశీ వస్తు బహిష్కరణ కాదు.. ఆరెస్సెస్ చీఫ్ భగవత్

   18 minutes ago


ఏపీలో తగ్గిన కేసుల తీవ్రత.. కోలుకున్న లక్షా 80వేలమంది

ఏపీలో తగ్గిన కేసుల తీవ్రత.. కోలుకున్న లక్షా 80వేలమంది

   12 hours ago


కరోనానుంచి కోలుకున్న అమిత్ షా

కరోనానుంచి కోలుకున్న అమిత్ షా

   14 hours ago


 ఏపీలో ఎంసెట్ ఎంట్రన్స్ ఎప్పుడంటే...?

ఏపీలో ఎంసెట్ ఎంట్రన్స్ ఎప్పుడంటే...?

   15 hours ago


కోవిడ్ నుంచి కోలుకున్నవారు ప్లాస్మా దానం చేయండి.. గవర్నర్ పిలుపు

కోవిడ్ నుంచి కోలుకున్నవారు ప్లాస్మా దానం చేయండి.. గవర్నర్ పిలుపు

   16 hours ago


ఉప్పొంగెలే గోదావరి... జోరుమీదున్న శబరి

ఉప్పొంగెలే గోదావరి... జోరుమీదున్న శబరి

   18 hours ago


కరోనా ఎలా పోతుందంటే... బీజేపీ ఎంపీ వింత చిట్కా

కరోనా ఎలా పోతుందంటే... బీజేపీ ఎంపీ వింత చిట్కా

   18 hours ago


కేసీయార్‌‌‌ని జగన్ లైట్ తీసుకుంటున్నారా?

కేసీయార్‌‌‌ని జగన్ లైట్ తీసుకుంటున్నారా?

   20 hours ago


కాంగ్రెస్‌లో ముదురుతున్న వివాదాలు.. రేవంత్ రెడ్డి‌పై వీహెచ్ నారాజ్

కాంగ్రెస్‌లో ముదురుతున్న వివాదాలు.. రేవంత్ రెడ్డి‌పై వీహెచ్ నారాజ్

   a day ago


తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ.. కేటీఆర్ భూమి పూజ

తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ.. కేటీఆర్ భూమి పూజ

   a day ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle