newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఇక్క‌డ ప్ర‌తాప్‌రెడ్డి... అక్క‌డ స‌తీష్ రెడ్డి

11-03-202011-03-2020 07:34:09 IST
Updated On 11-03-2020 11:57:40 ISTUpdated On 11-03-20202020-03-11T02:04:09.645Z11-03-2020 2020-03-11T02:03:57.857Z - 2020-03-11T06:27:40.356Z - 11-03-2020

ఇక్క‌డ ప్ర‌తాప్‌రెడ్డి... అక్క‌డ స‌తీష్ రెడ్డి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏదైనా యుద్ధానికి దిగుతున్నామంటే గెలుపుపై న‌మ్మ‌కం ఉండాలి. ఒక సారి ఓడినా రెండో సారి గెలుస్తామ‌నే విశ్వాసం ఉండాలి. కానీ, అస‌లు ఓడిపోతామ‌ని తెలిసి కూడా యుద్ధం ఎక్కువ కాలం చేయ‌లేరు. పంతానికో, ప‌ట్టుద‌ల‌కో పోరాటంలో దిగినా ప‌దేప‌దే ఎదుర‌వుతున్న ఓట‌ములు అల‌స‌ట తెప్పిస్తాయి. ఇంత‌కుముందు తెలంగాణ‌లోని గ‌జ్వేల్‌లో, ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని పులివెందుల‌లో ఇదే జ‌రిగింది. ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో కీల‌క నేత‌లు పోరాటంలో అలిసిపోయి మ‌ధ్య‌లోనే ఆగిపోయారు.

పులివెందుల నియోజ‌క‌వ‌ర్గం వైఎస్ కుటుంబానికి కంచుకోట‌. 1978 నుంచి ఈ నియోజ‌క‌వ‌ర్గంలో వైఎస్ కుటుంబం చేతిలోనే ఉంది. రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ఇక్క‌డి నుంచి ఆరు సార్లు విజ‌యం సాధించారు. ఆయ‌న సోద‌రుడు వివేకానంద‌రెడ్డి రెండుసార్లు గెలిచారు.

వైఎస్సార్ మ‌ర‌ణం త‌ర్వాత కూడా పులివెందుల ప్ర‌జానికం ఆయ‌న కుటుంబానికి అండ‌గా నిలిచింది. వైసీపీ స్థాపించిన త‌ర్వాత విజ‌య‌మ్మ ఇక్క‌డ ఉప ఎన్నిక‌ల్లో భారీ మెజారిటీతో విజ‌యం సాధించింది. 2014, 2019 ఎన్నిక‌ల్లో రాష్ట్రంలోనే అత్య‌ధిక మెజారిటీల‌తో జ‌గ‌న్ పులివెందుల ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు.

ఈ లెక్క‌లే పులివెందుల నియోజ‌క‌వ‌ర్గంలో వైఎస్ కుటుంబానికి ఎంత ప‌ట్టుందో చెబుతాయి. వీరికి ఇంత బ‌లం ఉన్నా తెలుగుదేశం కూడా పోరాడుతూనే ఉంది. ఆ పార్టీ త‌ర‌పున సింగారెడ్డి స‌తీష్ రెడ్డి వైఎస్ కుటుంబంపై ఎన్నిక‌ల్లో పోటీ చేస్తూ వ‌స్తున్నారు.

వైఎస్సార్‌పై రెండు సార్లు, జ‌గ‌న్‌పై రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయారు. 2014లో ఆయ‌న ఓడినా టీడీపీ అధికారంలోకి రావ‌డంతో స‌తీష్‌రెడ్డి ధైర్యం వ‌చ్చింది. పులివెందుల‌లో జ‌గ‌న్‌ను ఎదుర్కునేందుకు చంద్ర‌బాబు కూడా స‌తీష్‌రెడ్డికి అస్త్ర‌శ‌స్త్రాల‌ను అందించారు. ఆయ‌న‌ను ఎమ్మెల్సీని చేసి శాస‌న‌మండ‌లి డిప్యూటీ ఛైర్మ‌న్ చేశారు.

దీంతో గ‌త ఐదేళ్లు స‌తీష్‌రెడ్డి నియోజ‌క‌వ‌ర్గంలో చ‌క్రం తిప్పారు. పులివెందుల‌కు నీళ్లు తెచ్చేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నించి స‌ఫ‌ల‌మ‌య్యారు. దీంతో 2019లో స‌తీష్ రెడ్డి గ‌ట్టి పోటీ ఇస్తార‌ని, జ‌గ‌న్ మెజారిటీ భారీగా త‌గ్గిపోతుంద‌ని టీడీపీ అంచ‌నా వేశారు. కానీ, అనూహ్యంగా జ‌గ‌న్‌కు గ‌తం కంటే మెజారిటీ మ‌రింత పెరిగింది. దీంతో స‌తీష్‌రెడ్డి నైరాశ్యంలోకి వెళ్లిపోయారు. ఇక్క‌డ ఎన్నిసార్లు పోటీ చేసినా ఇదే ఫ‌లితం ఉంటుంద‌ని, గెలుపు అవ‌కాశాలే ఉండ‌వ‌నే నిర్ణ‌యానికి వ‌చ్చేశారు. గెలుపు ఛాయ‌ల‌కు కూడా వెళ్ల‌కుండా చేస్తున్న ఎన్నిక‌ల పోరాటంలో ఆయ‌న అలిసిపోయి ఒక పోరాటాన్ని ఆపేయాల‌ని నిర్ణ‌యించారు.

ఆయ‌న తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. 13వ తేదీన తాను ఇంత‌కాలం పాటు ఎవ‌రిపైననైతే పోరాడారో, ఆ జ‌గ‌న్ స‌మ‌క్షంలోనే వైసీపీలో చేర‌బోతున్నారు. పులివెందుల‌లో ఏక‌గ్రీవంగా స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో గెలవాల‌ని భావిస్తున్న వైసీపీ ఆయ‌న‌ను చేర్చుకునేందుకు ఆస‌క్తిగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. దీంతో పులివెందుల‌కు ఇంఛార్జిగా బీటెక్ ర‌విని నియ‌మించింది తెలుగుదేశం పార్టీ. ఆయ‌న కూడా గ‌తంలో విజ‌య‌మ్మ‌పై పోటీ చేసి డిపాజిట్ కూడా తెచ్చుకోలేక‌పోయారు. ఆయ‌న ఎంత కాలం పులివెందుల‌లో టీడీపీ జెండా మోస్తారో చూడాలి.

పులివెందుల‌లో జ‌రిగిన‌ట్లుగానే ఇంత‌కుముందు తెలంగాణ‌లోని గ‌జ్వెల్‌లోనూ జ‌రిగింది. ఇక్క‌డ వంటేరు ప్ర‌తాప్‌రెడ్డి టీడీపీ నుంచి రెండుసార్లు, కాంగ్రెస్ నుంచి ఒక‌సారి పోటీ చేసి ఓడారు. 2014లో ఆయ‌న క‌చ్చితంగా ఎమ్మెల్యే అవుతార‌నుకున్న స‌మ‌యంలో కేసీఆర్ గ‌జ్వెల్ నుంచి పోటీ చేయ‌డంతో ఆయ‌న ఆశ‌లు నెర‌వేర‌లేదు.

ఆ ఎన్నిక‌ల్లో కేసీఆర్‌కు గ‌ట్టి పోటీ ఇచ్చారు ప్ర‌తాప్‌రెడ్డి. రెండుసార్లు ఓడిన ప్ర‌తాప్‌రెడ్డికి ప్ర‌జ‌ల్లో సానుభూతి బాగా ఉంది. దీంతో 2019లో కేసీఆర్‌ను ఓడించినా ఆశ్చ‌ర్యం లేద‌నే అంచ‌నాలు వ‌చ్చాయి. కానీ, భారీ మెజారిటీతో కేసీఆర్ గెలిచారు. ఇక కేసీఆర్‌పై గెల‌వ‌లేన‌నే నిర్ణ‌యానికి వ‌చ్చిన ప్ర‌తాప్‌రెడ్డి ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చిన నెల రోజుల‌కే కాంగ్రెస్‌ను వీడి కేసీఆర్ స‌మ‌క్షంలో టీఆర్ఎస్‌లో చేరిపోయారు. ఇలా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు ప్ర‌త్య‌ర్థుల‌నే త‌మ వైపు తిప్పుకొని పోటీ లేకుండా చూసుకున్నారు.      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle