newssting
Radio
BITING NEWS :
ఓ ఆసుపత్రిలో మహిళా రోగిపై ఉద్యోగి అత్యాచారం. గురుగ్రామ్ నగరంలో వెలుగుచూసిన దారుణం. ప్రైవేటు ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో 21 ఏళ్ల యువతి క్షయ వ్యాధితో చికిత్స కోసం చేరగా వెంటిలేటరుపై చికిత్స పొందుతూ స్పృహ లేని స్థితిలో ఉన్నపుడు ఆసుపత్రి ఉద్యోగి ఒకరు తనపై అత్యాచారం చేశాడని తన చేత్తో రాసిన నోట్ ద్వారా తండ్రికి తెలిపిన బాధితురాలు * నలుగురు ఆమ్ ఆద్మీ పార్టీ శాసనసభ్యులపై కేసులు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు. ఢిల్లీలో పారిశుద్ధ్య పనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమించిన నలుగురు ఆప్ ఎమ్మెల్యేలపై పోలీసులు కేసులు. పారిశుద్ధ్య పనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆప్ నాయకుడు దుర్గేష్ పాథక్ 1500మంది ప్రజలతో పౌరకేంద్రం ముందు నిరసన కార్యక్రమం చేపట్టగా..అనుమతి లేకుండా నిరసన చేపట్టారని కేసులు నమోదు * 317వ రోజుకు చేరుకున్న అమరావతి రైతు నిరసనలు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు, మహిళలు చేపట్టిన నిరసనలు. అమరావతి గ్రామాల్లోని శిబిరాల్లో కొనసాగుతున్న రైతుల ఆందోళనలు. కరోనా సూచనలు పాటిస్తూ సాగుతున్న అమరావతి ఉద్యమం * ఉత్తర తమిళనాడుకు ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని, మిగిలినచోట్ల పొడి వాతావరణం కొనసాగుతుందని తెలిపిన వాతావరణ శాఖ. కాగా ఈశాన్య గాలులు ప్రారంభం కావడంతో అనేకచోట్ల, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో కురుస్తున్న మంచు. పగటిపూట మాత్రం కొనసాగుతున్న ఎండ * గ్రేటర్‌ ఎన్నికలకు పడిన మరో ముందడుగు. వార్డుల వారీగా రిటర్నింగ్‌, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులను నియమిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ. గ్రేటర్‌లో 150 వార్డులకు తహసీల్దార్‌, ఎంపీడీఓ తదితర కేడర్‌ అధికారులను రిటర్నింగ్‌, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ ఆఫీసర్లుగా జీహెచ్‌ఎంసీ సూచించిన వారిని నియమిస్తున్నట్లుగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఆమోదం * బేగంపేట మెట్రో స్టేషన్‌ పై నుంచి పడి యువకుడు మృతి. ఈ నెల 26న జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. చార్టెడ్‌ అకౌంటెన్సీ కోర్స్‌ చేస్తున్న కర్నూల్‌ జిల్లా మంత్రాలయం రామచంద్రనగర్‌కు చెందిన జీ మంజునాథ్‌ (23) ఈ నెల 14న నగరానికి రాగా ఆత్మహత్య చేసుకున్నట్లుగా సీసీ కెమెరాలలో రికార్డు * గురువారం నుంచి అందుబాటులోకి వచ్చిన తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న ధరణి ఫోర్టల్‌ సేవలు. మేడ్చల్‌ జిల్లా మూడుచింతలపల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభం. ధరణి సేవలు మొదలైతే తాసిల్దార్‌ కార్యాలయాల్లో రోజుకు16 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేసే వెసులుబాటు * చెన్నై నగరాన్ని అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు. గత రాత్రి నుంచి మహానగరంలో ఎడతెరపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలు. తిరువాన్మియూర్, మైలాపూర్, రాయపెట్ట, అడయార్‌లలో వర్షాలు కురుస్తున్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాలకు పలు కాలనీలు నీట మునిగగా వర్షపు నీటిని తొలగించడానికి అధికారులు అన్ని చర్యలు చేపట్టారు * మంచిర్యాల జిల్లాలోని హజీపూర్ మండలం నర్సింగ పూర్ శివారులో పెద్ద పులి సంచారం . ఎల్లంపల్లి ప్రాజెక్టు దిగువన పులి సంచారాన్ని గుర్తించిన గ్రామస్థులు. విషయం తెలిసిన అటవీ శాఖ అధికారులు అక్కడకు చేరుకుని అడుగుల ద్వారా పులి సంచారాన్ని నిర్ధారించారు. దీంతో సమీప అటవీ ప్రాంతాలకు ప్రజలు వెళ్ళొద్దని అధికారులు సూచనలు జారీ.

ఇకపై తెలంగాణ బీజేపీకి సిఏఏనే ప్రచారాస్త్రం!

30-12-201930-12-2019 13:11:11 IST
Updated On 30-12-2019 13:23:40 ISTUpdated On 30-12-20192019-12-30T07:41:11.315Z30-12-2019 2019-12-30T07:41:09.585Z - 2019-12-30T07:53:40.768Z - 30-12-2019

ఇకపై తెలంగాణ బీజేపీకి సిఏఏనే ప్రచారాస్త్రం!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కేంద్రంలో మోడీ సర్కార్ తీసుకొచ్చిన  సిఏఏ చట్టం, ఎన్నీఆర్సీ బిల్లులపై దేశవ్యాప్తంగా భిన్నవాదనలే వినిపించాయి. సీఏఏ వ్యతిరేక ప్రదర్శనలతో ఉత్తరభారతం రగిలిపోతోంది. ఇక ఎన్డీయే మిత్రపక్షాలు కూడా కొన్ని ఈ చట్టాన్ని వ్యతిరేకించాయి. అదంతా దేశంలో రాజకీయం. ఇక మన తెలుగు రాష్ట్రల విషయానికి వస్తే ఏపీలో ఎన్నార్సీ చట్టం వర్తించదని సీఎం ప్రకటించగా తెలంగాణ ప్రభుత్వం అయితే అసలు ఈ బిల్లులనే ప్రచారాస్త్రంగా వాడేసుకుంటుంది.

ఇప్పటికే ఈ అంశాలపై తెలంగాణలో అన్ని పార్టీలు ఒకే మాట మీద ఉన్నాయి. బీజేపీ పనిగట్టుకొని భారత లౌకిక వాదాన్ని దెబ్బతీస్తున్నాయని తీవ్రంగా మండిపడుతున్నాయి. ఇక ఎంఐఎం పార్టీ అయితే నిజామాబాద్ లో ఏకంగా భారీ సభ పెట్టి దుమ్మెత్తిపోశాయి. ఇక కాంగ్రెస్, తెరాస ఒకరిపై మరొకరు తిట్టుకుంటూనే ఇద్దరూ కలిసి కేంద్రం తెచ్చిన చట్టాలు, బిల్లులను వ్యతిరేకించాయి.

త్వరలోనే రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు రానుండడంతో కేంద్రం తెచ్చిన ఈ బిల్లు, చట్టాలను ఇక్కడ రాజకీయ కోసం వాడేసుకుంటున్నారన్నది విశ్లేషకుల వాదన. అందులో భాగమే పార్లమెంట్ ఎన్నికల సమయంలో తెరాస పార్టీకి నష్టం తెచ్చి.. బీజేపీ ఎంపీ గెలిచిన నిజామాబాద్ స్థానంలో ఎంఐఎం సభ ఏర్పాటు చేసిందని కథనాలు వినిపించాయి. కాగా ఇప్పుడు బీజేపీ వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు సన్నాహాలు సిద్ధం చేసుకుంటోంది.

ఇప్పటికే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్.. కేంద్రం తెచ్చిన బిల్లులపై నిజానిజాలను ప్రజలకు వెల్లడించాలని.. తెరాస, కాంగ్రెస్ పార్టీలు చేస్తున్న విషప్రచారాన్ని తిపికొట్టాలని దిశానిర్ధేశం చేశారు.మున్సిపల్ ఎన్నికలే లక్ష్యంగా కార్యాచరణతో ముందుకెళ్లాలని నిర్ణయించారు. దీనికి ఈరోజు నుండే కార్యాచరణ మొదలుపెట్టారు. మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో దీన్నొక పాజిటివ్ అంశంగా చేసుకోవాలని బీజేపీ ప్రయత్నాలను మొదలుపెట్టింది.

సోమవారం హైద‌రాబాద్, క‌రీంన‌గ‌ర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో పెద్దఎత్తున సీఏఏ అనుకూల ర్యాలీల‌ను నిర్వహిస్తున్నారు. పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతుగా హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ప్రజాప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రజా ప్రదర్శనకు పెద్ద ఎత్తున జనం, బీజేపీ నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. ఈ ప్రదర్శనలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి, జితేంద్రసింగ్,  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.కె. లక్ష్మణ్, రాజ్యసభ ఎంపీ గరికపాటి మోహనరావు, మాజీ ఎంపీ చాడ సురేష్ రెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. 

ఇక జ‌న‌వ‌రి 2 నుంచి రెండ్రోజుల‌పాటు జిల్లాల‌వారీగా వ‌ర్క్ షాపులు.. 5 నుంచి మూడు రోజుల‌పాటు విద్యావేత్త‌లు, మేథావులతో మున్సిపాలిటీల్లో ర్యాలీలు.. 8 నుంచి 13 వ‌ర‌కూ గ్రామాల్లో బీజేపీ నాయ‌కులు వెళ్లి సీఏఏ గురించి ప్ర‌జ‌ల‌కు వివరించాలని నిర్ణయించారు.

హిందూ సంప్రదాయానికి అతిపెద్ద పండుగగా భావించే సంక్రాంతిలో సీఏఏ సంఘీభావ ముగ్గుల పోటీల‌ను కూడా నిర్వ‌హించాల‌ని బీజేపీ నేత‌లు ప్ర‌ణాళిక సిద్ధం చేశారు. ఒక్కమాటగా చెప్పాలంటే ప్రత్యర్థి పార్టీలు మున్సిపాలిటీ ఎన్నికలకు ఏదైతే ప్రచారంగా తీసుకోవాలని ప్లాన్ చేసారో బీజేపీ అందుకు విరుగుడునే అస్త్రంగా తీసుకోవాలని సిద్దమైంది. మరి ఫలితాలు ఎలా ఉంటాయో చూడాల్సి ఉంది.

       040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle