newssting
BITING NEWS :
*విషమంగానే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ఆరోగ్యం.. వెంటిలేటర్ పై చికిత్స *వనపర్తి జిల్లా నాగపూర్ లో విషాదం ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య *హైద‌రాబాద్‌: పంచాయతీ,మండల, జిల్లాప్రజా పరిషత్‌లకు 15వ ఆర్థిక సంఘం నిధుల పునరుద్ధరణ.. ఆరేళ్ల క్రితం నిలిపివేసిన ఆర్థికసంఘం.. ఈ ఏడాదికి రూ.1,847 కోట్ల నిధుల మంజూరు*ఢిల్లీ: ప్ర‌శాంత్ భూష‌ణ్ కోర్టు ధిక్క‌ర‌ణ సుమోటో కేసులో సుప్రీంకోర్టు తీర్పు... ప్ర‌శాంత్ భూష‌ణ్‌ను దోషిగా తేల్చిన జ‌స్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం.. శిక్ష‌పై ఈ నెల 20న వాద‌న‌లు వింటాం-సుప్రీం*హైద‌రాబాద్‌: కోవిడ్ కి ఉచిత చికిత్స చేయాలి.. కరోనాతో ఆదాయ మార్గం పోయింది కాబట్టి పేదలకు ఆరు నెలల పాటు రూ. 7500 చొప్పున‌ ఇవ్వాలి-ప్రొఫెస‌ర్ కోదండరాం*భార‌త్‌లో రికార్డు స్థాయిలో పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు.. గడచిన 24 గంటల్లో 64,553 కరోనా కేసులు నమోదు, 1007 మంది మృతి.. 24,61,191కు చేరుకున్న క‌రోనా పాజిటివ్ కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 48,040 మంది మృతి*తెలంగాణ‌లో 1921 పాజిటివ్ కేసులు నమోదు, 9 మంది మృతి.. 88396కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్పటి వరకు 674 మంది మృతి

ఇంత పోటీలోనూ అంత ధీమా ఎలాగో..?

23-11-201923-11-2019 07:58:01 IST
2019-11-23T02:28:01.250Z23-11-2019 2019-11-23T02:26:12.644Z - - 15-08-2020

ఇంత పోటీలోనూ అంత ధీమా ఎలాగో..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ కాంగ్రెస్‌కు కాబోయే నాయ‌కుడు ఎవ‌రు అనేది ఇప్పుడు పార్టీ నేత‌ల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. సుమారు 10 మంది నేత‌లు పీసీసీ రేసులో ఉండ‌టంతో అధిష్ఠానం ఎవ‌రిని నియ‌మిస్తుంద‌నేది ఆస‌క్తిక‌రంగా ఉంది.

ప్ర‌స్తుత పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప‌ద‌వీకాలం ముగియ‌డం, వ‌రుస ఓట‌ముల త‌ర్వాత ఆయ‌న కూడా పీసీసీ ప‌ద‌విని చేప‌ట్టేందుకు ఇష్టంగా లేక‌పోవ‌డంతో కొత్త అధ్య‌క్షుడి రాక ఖాయ‌మైంది. ఇటీవ‌ల పార్టీ అధిష్ఠానం కూడా ఈ మేర‌కు క‌స‌ర‌త్తు చేసింది.

పీసీసీ చీఫ్ రేసులో ప్ర‌ధానంగా ఎంపీలు కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి, రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధ‌ర్ బాబు, ఎమ్మెల్సీ జీవ‌న్‌రెడ్డి ఉన్నారు. ఇక‌, ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి, మాజీ ఎంపీ మ‌ధుయాష్కి, నేత‌లు వి.హ‌నుమంత‌రావు, సంప‌త్ కుమార్ వంటి వారు కూడా ఈ ప‌ద‌విని ఆశిస్తున్నారు. పోటీ తీవ్రంగా ఉన్నా పీసీసీ చీఫ్ అయ్యేది తానేన‌ని భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి న‌మ్మ‌కంగా ఉన్నారు.

మ‌హారాష్ట్ర‌లో ప్ర‌భుత్వం ఏర్ప‌డ‌గానే తెలంగాణ పీసీసీ అధ్య‌క్షుడిగా త‌న పేరును అధిష్ఠానం ప్ర‌క‌టిస్తుంద‌ని ఆయ‌న ధీమాగా ఉన్నారు. త‌న‌కు పీసీసీ అప్ప‌గిస్తే రాష్ట్ర‌మంతా పాద‌యాత్ర చేస్తాన‌ని కూడా కోమ‌టిరెడ్డి ఇప్ప‌టికే అధిష్టానాన్ని కోరారు.

ఇటీవ‌ల తెలంగాణ‌కు వ‌చ్చిన పార్టీ అగ్ర‌నేత గులాం న‌బీ ఆజాద్‌ను కూడా ఆయ‌న ఇదే కోరారు. త‌న అనుచ‌రులు సైతం గాంధీ భ‌వ‌న్ వ‌ద్ద‌కు వ‌చ్చి ఈ విష‌యాన్ని డిమాండ్ చేశారు.

కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి ఈ ప‌ద‌విపై ఇంత ధీమాగా ఉండ‌టానికి ప్ర‌స్తుతం పార్టీలో వివిధ స‌మీక‌ర‌ణాలే కార‌ణ‌మ‌ట‌. ప్ర‌స్తుత పీసీసీ చీఫ్ ఉత్త‌మ్‌కుమార్ రెడ్డికి అధిష్ఠానం వ‌ద్ద మంచి పేరుంది. ఆయ‌న త‌న అభ్య‌ర్థిత్వానికి మ‌ద్ద‌తు ఇస్తున్నార‌నేది కోమ‌టిరెడ్డి ఆశ‌. ఇక‌, త‌న‌కు ప్ర‌ధాన పోటీదారుగా ఉన్న రేవంత్‌రెడ్డికి పార్టీలోని సీనియ‌ర్ల మ‌ద్ద‌తు లేక‌పోవ‌డం త‌న‌కు క‌లిసి వ‌స్తుంద‌ని ఆయ‌న ఆశిస్తున్నారు.

అయితే, కోమ‌టిరెడ్డితో పాటు రేవంత్, శ్రీధర్‌బాబు, జీవ‌న్‌రెడ్డి ఈ ప‌ద‌వి కోసం పోటీ ప‌డుతున్నారు. రేవంత్ రెడ్డికి ప్ర‌జ‌ల్లో ఛ‌రిష్మా ఉన్నా సీనియ‌ర్లు ఆయ‌నకు వ్య‌తిరేకంగా ఉన్నారు.

అందుకే త‌న‌కు కాక‌పోతే సీనియ‌ర్ నేత జానారెడ్డికి పీసీసీ చీఫ్ ప‌ద‌వి ఇవ్వాల‌ని ఆయ‌న రేవంత్ కోరిన‌ట్లు తెలుస్తోంది. ఇక‌, ఎమ్మెల్సీ జీవ‌న్‌రెడ్డికి అంద‌రు నేత‌ల‌తో మంచి స‌ఖ్య‌త ఉంది. కానీ, ఆర్థికంగా ఆయ‌న బ‌లంగా లేక‌పోవ‌డం మైన‌స్ కావ‌చ్చు.

ఇక‌, మంథ‌ని ఎమ్మెల్యే శ్రీధ‌ర్‌బాబుకు క్లీన్ ఇమేజ్ ఉంది. పార్టీలో వివాద‌ర‌హితుడిగా ఉన్న ఆయ‌న పేరును జ‌గ్గారెడ్డి ప్ర‌తిపాధిస్తున్నారు. అయితే, రెడ్డి సామాజ‌క‌వ‌ర్గాన్ని ప‌క్కన‌పెట్టి బ్రాహ్మ‌ణ సామాజ‌క‌వ‌ర్గానికి పీసీసీ చీఫ్ ప‌ద‌వి ఇచ్చే అవ‌కాశాలు త‌క్కువే అనే చ‌ర్చ పార్టీలో జ‌రుగుతోంది.

ఒక వేళ బీసీకి గ‌నుక ఈ ప‌ద‌వి ఇవ్వాల‌ని అధిష్ఠానం భావిస్తే మ‌ధుయాష్కికి ద‌క్కే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఇంత పోటీ ఉన్నా కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి మాత్రం త‌న‌కు ఈ ప‌ద‌వి ఖాయ‌మైంద‌ని, రాజ‌శేఖ‌ర్‌రెడ్డిలా పాద‌యాత్ర చేసి పార్టీని అధికారంలోకి తెస్తాన‌ని ధీమాగా ఉన్నారు. మ‌రి, ఆయ‌న ఆశ‌లు హైక‌మాండ్‌ నెర‌వేరుస్తుందో లేదో చూడాలి.

స్వదేశీ అంటే విదేశీ వస్తు బహిష్కరణ కాదు.. ఆరెస్సెస్ చీఫ్ భగవత్

స్వదేశీ అంటే విదేశీ వస్తు బహిష్కరణ కాదు.. ఆరెస్సెస్ చీఫ్ భగవత్

   25 minutes ago


ఏపీలో తగ్గిన కేసుల తీవ్రత.. కోలుకున్న లక్షా 80వేలమంది

ఏపీలో తగ్గిన కేసుల తీవ్రత.. కోలుకున్న లక్షా 80వేలమంది

   13 hours ago


కరోనానుంచి కోలుకున్న అమిత్ షా

కరోనానుంచి కోలుకున్న అమిత్ షా

   14 hours ago


 ఏపీలో ఎంసెట్ ఎంట్రన్స్ ఎప్పుడంటే...?

ఏపీలో ఎంసెట్ ఎంట్రన్స్ ఎప్పుడంటే...?

   15 hours ago


కోవిడ్ నుంచి కోలుకున్నవారు ప్లాస్మా దానం చేయండి.. గవర్నర్ పిలుపు

కోవిడ్ నుంచి కోలుకున్నవారు ప్లాస్మా దానం చేయండి.. గవర్నర్ పిలుపు

   16 hours ago


ఉప్పొంగెలే గోదావరి... జోరుమీదున్న శబరి

ఉప్పొంగెలే గోదావరి... జోరుమీదున్న శబరి

   18 hours ago


కరోనా ఎలా పోతుందంటే... బీజేపీ ఎంపీ వింత చిట్కా

కరోనా ఎలా పోతుందంటే... బీజేపీ ఎంపీ వింత చిట్కా

   18 hours ago


కేసీయార్‌‌‌ని జగన్ లైట్ తీసుకుంటున్నారా?

కేసీయార్‌‌‌ని జగన్ లైట్ తీసుకుంటున్నారా?

   21 hours ago


కాంగ్రెస్‌లో ముదురుతున్న వివాదాలు.. రేవంత్ రెడ్డి‌పై వీహెచ్ నారాజ్

కాంగ్రెస్‌లో ముదురుతున్న వివాదాలు.. రేవంత్ రెడ్డి‌పై వీహెచ్ నారాజ్

   a day ago


తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ.. కేటీఆర్ భూమి పూజ

తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ.. కేటీఆర్ భూమి పూజ

   a day ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle