newssting
BITING NEWS :
*అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పర్యటన.. ఘనంగా స్వాగతం..సబర్మతి ఆశ్రమంలో మహాత్మాగాంధీ వినియోగించిన చరఖా తిప్పిన ట్రంప్ పంపతులు *సబర్మతి ఆశ్రమంలో ట్రంప్ దంపతులు... గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ట్రంప్, మోడీ *నేడు విజయనగరం జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన.. జగనన్న వసతి దీవేన కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం*సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు బాంబు బెదిరింపు.. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో పోలీసుల తనిఖీలు.. ప్లాట్ ఫామ్‌లతో పాటు రైళ్లలోనూ క్షుణ్ణంగా తనిఖీ, పేలుడు పదార్థాలు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు *చిత్తూరు జిల్లాలో గుప్త నిధుల తవ్వకాల కలకలం..శ్రీ చౌడేశ్వరి ఆలయం వెనకాల ప్రాంతంలో తవ్వకాలు *ఆదిలాబాద్‌ గుడిహత్నూర్‌లో దారుణం....బాలికపై ఇద్దరు కామాంధుల అత్యాచారం* చైనాలో కొనసాగుతున్న కరోనా మరణమృదంగం....ఇప్పటివరకు 2వేల 460కి చేరిన కొవిడ్-19 మృతుల సంఖ్య*ఒడిశా : పూరీ జిల్లా పిప్పిలి ప్రాంతంలో ఏనుగుల బీభత్సం...ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి.., ఐదుగురికి గాయాలు *గుజరాత్‌లోని వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం..ట్రక్కు- టెంపో ఢీ, 11మంది మృతి *68వ రోజు కొనసాగుతున్న రాజధాని రైతుల ఆందోళన

ఇంత‌కు ముందో లెక్క‌.. ఇప్పుడో లెక్క‌..!

24-10-201924-10-2019 08:43:33 IST
Updated On 24-10-2019 16:26:21 ISTUpdated On 24-10-20192019-10-24T03:13:33.753Z24-10-2019 2019-10-24T03:12:12.715Z - 2019-10-24T10:56:21.320Z - 24-10-2019

ఇంత‌కు ముందో లెక్క‌.. ఇప్పుడో లెక్క‌..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తొమ్మిదేళ్ల పాటు ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు, విభ‌జ‌న త‌ర్వాత రెండు తెలుగు రాష్ట్రాల‌కు గ‌వ‌ర్న‌ర్‌గా ప‌నిచేసిన న‌ర‌సింహ‌న్‌తో న‌లుగురు ముఖ్య‌మంత్రులు ప‌నిచేశారు. ఏ ముఖ్య‌మంత్రితోనూ ఆయ‌న‌కు బేదాభిప్రాయాలు లేవు. గ‌వ‌ర్న‌ర్‌గా ప్ర‌భుత్వ వ్య‌వ‌హారాల్లో ఆయ‌న అత్య‌వ‌స‌రం అయితే త‌ప్ప జోక్యం చేసుకునే వారు కాదు. దీంతో ముఖ్య‌మంత్రుల‌కు అంతా సాఫీగా సాగిపోయింది.

వృత్తిరీత్యా ఐపీఎస్ అధికారి అయిన న‌ర‌సింహ‌న్ రాజ‌కీయాల‌ను పెద్ద‌గా ప‌ట్టించుకునే వారు కాదు. ఆయ‌న‌కు ఏ ర‌క‌మైన రాజ‌కీయ ఉద్దేశ్యాలు కూడా లేవు. అయితే, ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో పాగా వేయాల‌ని భావిస్తోంది బీజేపీ. ముందుగా తెలంగాణ‌లో త‌మ‌కు ఎక్కువ‌గా అవ‌కాశాలు ఉన్నాయ‌నేది ఆ పార్టీ అంచ‌నా. ఆ దిశ‌గా బీజేపీ అన్ని ప్ర‌య‌త్నాలూ చేస్తోంది.

ఇంత‌లో కొత్త గ‌వ‌ర్న‌ర్‌గా త‌మిళ‌నాడు బీజేపీ నాయ‌కురాలిగా ఉన్న త‌మిళిసైను కేంద్రం నియ‌మించింది. ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు చెక్ పెట్ట‌డానికే ప‌క్కా బీజేపీ నుంచి వ‌చ్చిన త‌మిళిసైను గ‌వ‌ర్న‌ర్‌గా నియ‌మించార‌నే విశ్లేష‌ణ‌లు అప్పుడే వ‌చ్చాయి.

ఇప్పుడు ఆమె గ‌వ‌ర్న‌ర్‌గా బాధ్య‌త‌లు తీసుకున్న రెండు నెల‌ల్లోనే త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటున్నారు. గ‌త గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌లా కాకుండా రాష్ట్రంలో ప‌రిస్థితుల‌పై స్పందిస్తున్నారు.

ఇంత‌కుముందు వివిధ స‌మ‌స్య‌ల‌ను పార్టీలు గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌ను క‌లిసి విన‌తిప‌త్రాలు స‌మ‌ర్పించినా ఆయ‌న ప్ర‌భుత్వ వ్య‌వ‌హారాల్లో పెద్ద‌గా జోక్యం చేసుకునే వారు కాదు. అంతా ప్ర‌భుత్వానికే వ‌దిలేసేవారు. కానీ, త‌మిళిసై ఇందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. రాష్ట్రంలో ఆర్టీసీ స‌మ్మెపై ఆమె వెంట‌నే కేంద్రానికి నివేదిక స‌మ‌ర్పించారు.

ర‌వాణా శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి సునీల్ శ‌ర్మ‌ను పిలిపించి ప‌రిస్థితిని విశ్లేషించారు. ర‌వాణా శాఖ మంత్రి పువ్వాడ అజ‌య్‌కు ఫోన్ చేసి ప‌రిస్థితుల‌ను చ‌క్క‌దిద్దాల‌ని సూచించారు. త‌న‌ను క‌లిసిన ఆర్టీసీ కార్మికుల‌కు కూడా ఆమె భ‌రోసానిచ్చారు. కార్మికులు ఎవ‌రూ ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డ‌వ‌ద్ద‌ని ఆమె వారిని కోరారు. దీంతో ఆర్టీసీ కార్మికుల‌కు కూడా కొంత ధైర్యం వ‌చ్చింది.

ఇక‌, ఇప్పుడు ఆమె నేరుగా ప్ర‌జ‌ల్లోకి వెళ్లేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. గిరిజ‌న తండాల్లో నిద్రించాల‌ని, వారితో క‌ల‌వాల‌ని ఆమె నిర్ణ‌యించారు. ఇందుకోసం ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాన్ని రూపొందించ‌నున్నారు. త్వ‌ర‌లోనే ఆమె గిరిజ‌న తండాల ప‌ర్య‌ట‌నకు వెళ్ల‌నున్నారు. ఇక‌, ఆర్టీసీ కార్మికుల స‌మ్మె ఉధృతంగా సాగుతుండ‌గా మ‌రోవైపు తాము కూడా స‌మ్మెకు దిగాల‌ని క్యాబ్ డ్రైవ‌ర్లు భావించారు.

వారు కూడా ఈ స‌మ‌యంలో స‌మ్మె చేస్తే హైద‌రాబాద్‌లో, ప్ర‌త్యేకించి ఐటీ ఏరియాలో ర‌వాణా వ్య‌వ‌స్థ పూర్తిగా స్తంభించే ప్ర‌మాదం ఉండేది. వీరంతా గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసి త‌మ స‌మ‌స్య‌ల‌ను చెప్పుకున్నారు.

హైద‌రాబాద్ ఇమేజ్ దెబ్బ‌తిన‌కుండా ఉండేందుకు స‌మ్మె ఆలోచ‌న విర‌మించుకోవాల‌ని, స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి తాను ప్ర‌య‌త్నిస్తాన‌ని త‌మిళిసై వారికి భ‌రోసా ఇచ్చారు. దీంతో వారు స‌మ్మె ఆలోచ‌న‌ను విర‌మించుకున్నారు. మొత్తానికి గ‌వ‌ర్న‌ర్‌గా త‌మిళిసై వ‌చ్చిన రెండు నెల‌ల్లోనే త‌న మార్క్ చూపిస్తున్నారు.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle