newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఇంట్లో ఉంటేనే రక్షణ.. హరీష్ రావు సందేశం

03-04-202003-04-2020 10:07:19 IST
Updated On 03-04-2020 11:42:49 ISTUpdated On 03-04-20202020-04-03T04:37:19.899Z03-04-2020 2020-04-03T04:35:44.328Z - 2020-04-03T06:12:49.908Z - 03-04-2020

ఇంట్లో ఉంటేనే రక్షణ.. హరీష్ రావు సందేశం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్న వేళ ఆర్థికమంత్రి హరీష్ రావు అధికారులకు, ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. సంగారెడ్డి కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్లో కరోనా వైరస్‌ నివారణకు సంబంధించి సమీక్షా సమావేశము నిర్వహించారు మంత్రి హరీశ్‌రావు. కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ సోషల్ డిస్టెన్స్ పాటించినట్లయితే ఆ వ్యాధి పూర్తిగా నిర్మూలించడం సాధ్యమవుతుందన్నారు. 

సీఎం కేసీయార్ ఆదేశాల ప్రకారం ఏప్రిల్ 15 వరకు ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉంటూ తప్పనిసరి అయితే తప్ప బయటకు వెళ్లొద్దని ఎవరి ఇంటిలోనే ఉన్నట్లయితే మన కుటుంబాన్ని మన రాష్ట్రాన్ని మన దేశాన్ని కాపాడుకున్న వాళ్లమవుతాం అన్నారు. సంగారెడ్డి  పట్టణంలో పాజిటివ్ కేసులు వచ్చినా  ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని అధికారుల సూచనలు పాటిస్తూ ఎవరికి వారు జాగ్రత్తగా ఉంటూ ఎవరికైనా జలుబు దగ్గు లాంటి ఉంటే వైద్యాధికారులను సంప్రదించాలని మంత్రి హరీష్ రావు ప్రజలకు సూచించారు.

కరోనాపై పోరులో తెలంగాణ ప్రభుత్వం ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తోందని తెలిపారు. ఢిల్లీ ప్రార్ధనల్లో సంగారెడ్డి  జిల్లా నుండి 21మంది పాల్గొన్నారని, ఢిల్లీలోని ప్రార్థన మందిరానికి వెళ్లినట్లు అధికారుల వద్ద సమాచారం ఉందన్నారు.  అందరినీ హాస్పటల్ తరలించడం కుదరదని, క్వారంటైన్‌లో ఉన్న వారిని పరీక్షల నిమిత్తం వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తరలిస్తారన్నారు. సంగారెడ్డి లో ఆరుగురికి పాజిటివ్ వచ్చిందని, ప్రైమరీ కాంటాక్ట్ కింద ఆరుగురి కుటుంబ సభ్యులలో 42 మంది ని క్వారైంటైన్ కి పంపామన్నారు మంత్రి హరీష్ రావు.

సెకండరి కాంటాక్ట్ వివరాలు సేకరిస్తున్నారని, వారందరినీ హోం క్వారంటైన్ చేస్తున్నామన్నారు. ఆరుగురి ఇళ్ళ వద్ద కిలోమీటర్ మేర 42 మెడికల్ టీమ్స్ వెళ్ళి అవగాహన కలిగిస్తాయన్నారు.  మైనారిటీలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కరోనా వ్యాపిస్తోందని, దీనిని నెగిటివ్ గా తీసుకోకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. హదిస్‌లో వ్యాదులు ప్రబలుతున్న సమయంలో ఎక్కడివారు అక్కడే ఉండండని చెప్పారని, హదిస్ లో వున్న పదాలను ఉర్దూలో చదివి వినిపించారు హరీష్ రావు. కరోనా వ్యాపించకుండా వైద్య సిబ్బందికి సహకరించాలన్నారు. పాజిటివ్ వచ్చిన ప్రాంతాల్లో  డ్రోన్,ఫైర్ ఇంజన్ ల ద్వారా మందులను పిచికారీ చేస్తామన్నారు. 

బీజేపీకి  70 సీట్లోస్తే గొప్పే : మమత

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత

   5 hours ago


బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

   6 hours ago


ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

   6 hours ago


మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   9 hours ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   11 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   9 hours ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   11 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   12 hours ago


సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

   7 hours ago


ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

   13 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle